ఎన్టీఆర్ కొడుకు అభ‌య్ రామ్ పాట విన్నారా

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటన అనే పేరు ఎత్తితే మన అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. చిన్న వయస్సులోనే సూపర్ స్టార్ రేంజ్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేసిన ఏకైక హీరో ఎన్టీఆర్ మాత్రమే. 2001 సంవత్సరం లో ఆయన ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. 2002 వ సంవత్సరం ఆయన నాల్గవ చిత్రం ‘ఆది’ విడుదలైంది. ఈ సినిమా సినిమా సృష్టించిన ప్రభంజనం మామూలుది గాడు. ఎవరీ చిచ్చర […]

Share:

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటన అనే పేరు ఎత్తితే మన అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. చిన్న వయస్సులోనే సూపర్ స్టార్ రేంజ్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేసిన ఏకైక హీరో ఎన్టీఆర్ మాత్రమే. 2001 సంవత్సరం లో ఆయన ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. 2002 వ సంవత్సరం ఆయన నాల్గవ చిత్రం ‘ఆది’ విడుదలైంది. ఈ సినిమా సినిమా సృష్టించిన ప్రభంజనం మామూలుది గాడు. ఎవరీ చిచ్చర పిడుగు, ఈ రేంజ్ లో నటిస్తున్నాడు అని అందరూ ఆయన వైపు చూసిన రోజులవి. అప్పటికి ఎన్టీఆర్ వయస్సు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే, మూతి మీద మీసాలు కూడా సరిగా రాని ఆ వయస్సులో, ఆయన ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తో సరిసమానమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించాడు. అలా ప్రారంభమైన ఎన్టీఆర్ కెరీర్ , హిట్స్,సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ తో పాటుగా డిజాస్టర్ ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి.

హిట్టు/ ఫ్లాప్ తో సంబంధం లేని క్రేజ్ :

అయితే హిట్టు/ఫ్లాప్ తో సంబంధం లేకుండా సూపర్ స్టేర్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తూ వచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు #RRR చిత్రం తో గ్లోబల్ స్టార్ గా అవతరించడం ఆయన ఫ్యాన్స్ కి మామూలు రేంజ్ కిక్ ఇవ్వలేదు. నూటికో కోటికో ఇద్దరు ముగ్గురుకి దక్కాయి ఈ అరుదైన ఇమేజి ఎన్టీఆర్ కి దక్కినందుకు ఫ్యాన్స్ ఎంతగానో ఆనందిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని సెట్ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఎంత బిజీ గా ఉన్నప్పటికీ కూడా తన కుటుంబానికి స్పేస్ ఇవ్వడం లో ఎప్పుడూ ముందు ఉంటాడు ఎన్టీఆర్. ఆయన లక్ష్మి ప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ దంపతులిద్దరికీ అభయ్ రామ్, భార్గవ్ రామ్ అని ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. తన భార్య పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలు , వీడియోలను ఎన్టీఆర్ ఇప్ప్పటికప్పుడు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తూ ఉంటాడు.

సోషల్ మీడియా ని ఊపేస్తున్న ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ పాట:

ఇది ఇలా ఉండగా నిన్న ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ పుట్టిన రోజు. నిన్నతో అభయ్ రామ్ తన 8వ ఏటలోకి అడుగుపెట్టాడు. ఎన్టీఆర్ అభిమానులు అభయ్ రామ్ పుట్టిన రోజు వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఘనంగా జరిపించారు. అయితే అభయ్ రామ్ కి సంబంధించిన ఒక క్యూట్ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో లో ఎవరో కుందేలు బొమ్మ పట్టుకొని అభయ్ రామ్ తో ఆడుకుంటూ ఉంటే, అభయ్ రామ్ తన తండ్రి నాన్నకు ప్రేమతో చిత్రం లోని ‘ఫాలో ఫాలో యూ’ అనే పాటని పాడుతూ ఎంతో క్యూట్ గా కనిపించాడు. ఈ వీడియో ని అభిమానులు షేర్ చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే,తనకి జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. ఈ ఏడాది లోపే షూటింగ్ ని పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.