దేవర తర్వాత శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ తో NTR?

జూనియర్ NTR ఆర్.ఆర్.ఆర్ చిత్రం ఘన విజయం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి కొన్ని పోస్టర్ లు విడుదల కాగా అభిమానులు వాటికి ఫిదా అయిపోయారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ ప్రత్యర్థి పాత్ర పోషిస్తున్నారు. ఇది ఇలా ఉండగా దేవర తర్వాత జూనియర్ ఎన్టీఆర్ శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. పీరియాడిక్ యాక్షన్ బాక్డ్రాప్ […]

Share:

జూనియర్ NTR ఆర్.ఆర్.ఆర్ చిత్రం ఘన విజయం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి కొన్ని పోస్టర్ లు విడుదల కాగా అభిమానులు వాటికి ఫిదా అయిపోయారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ ప్రత్యర్థి పాత్ర పోషిస్తున్నారు. ఇది ఇలా ఉండగా దేవర తర్వాత జూనియర్ ఎన్టీఆర్ శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. పీరియాడిక్ యాక్షన్ బాక్డ్రాప్ లో డైరెక్టర్ రాహుల్ ఒక అద్భుతమైన కథను జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించినట్లు ఆ కథ పట్ల ఎన్టీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. 

ఈ విషయం పట్ల ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. అయినా ఈ ప్రాజెక్టు గురించి సోషల్ మీడియాలో అభిమానులు విపరీతంగా చర్చించుకుంటున్నారు. నాని , సాయి పల్లవి జంటగా తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ చిత్రం మంచి కథతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుది. ఈ చిత్రంలో నాని కూడా కొత్త లుక్ లో కనిపించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన రాహుల్ ఎన్టీఆర్ తో తీసే పీరియాడిక్ యాక్షన్ మూవీ అంటే ఇప్పటి నుండే అంచనాలు పెరిగేలా ఉన్నాయి. గతంలో ఈ డైరెక్టర్ విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా చిత్రాన్ని తీయగా ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. 

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం? 

జూనియర్ ఎన్టీఆర్, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్ లో రానున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సినిమా కథ ను కూడా విన్నట్లు తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లుగా రాజరిగితే దేవర షూటింగ్ అవ్వగానే ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఫ్యాన్స్ మాత్రం అధికారిక ప్రకటన కోసం మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సైమా అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడానికి దుబాయ్ వెళ్లారు. ఆయన దుబాయ్ నుండి వచ్చిన తర్వాత అధికారిక ప్రకటన వస్తుందో లేక ఇంకా సమయం పడుతుందో తెలియదు.  కానీ ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించి రచ్చ రచ్చ చేస్తున్నారు. 

ఆచి తూచి వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ కథలను ఎంచుకోవడంలో చాలా పరిణితి చెందారు అనే చెప్పుకోవాలి. ఒకప్పుడు తనకు సరిపోయే కథలను ఎంచుకోవడంలో తీవ్రంగా విఫలం అయిన ఎన్టీఆర్ టెంపర్ చిత్రం నుండి కథలు ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. టెంపర్ చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఒక్క చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచలేదు. అలాగే ప్రతీ చిత్రానికి భిన్నమైన కథాంశం కూడా ఉండేలా చూస్తున్నారు ఎన్టీఆర్. ఆర్.ఆర్.ఆర్ చిత్రం దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించడంతో ఆయన ప్యాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు. ఇప్పుడు నటిస్తున్న దేవర చిత్రాన్ని కూడా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం దర్శకుడు గత చిత్రం ఆచార్య తీవ్ర నిరాశ పరచడంతో దేవర తో గట్టి హిట్ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ చిత్రంలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. 2024 సంవత్సరంలో దేవర చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.