రజనీ సినిమాలో జీవితా రాజశేఖర్

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ భార్యగా జీవితా రాజశేఖర్‌కు మంచి పేరుంది. ఆమె 1980 వ దశకంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత రాజశేఖర్‌ని పెళ్లి చేసుకున్న ఆమె.. పెళ్ళి తర్వాత సినిమాలు చేయడం మానేశారు. తలంబ్రాలు, జానకి రాముడు, ఆహుతి, అంకుశం, మగాడు వంటి హిట్ చిత్రాల్లో జీవిత కథానాయికగా నటించారు. చివరిగా 1990లో మగాడు సినిమాలో కనిపించి రాజశేఖర్‌ని పెళ్లాడారు జీవిత.  బహుముఖ ప్రజ్ఞాశాలి జీవితా రాజశేఖర్ యాంగ్రీ […]

Share:

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ భార్యగా జీవితా రాజశేఖర్‌కు మంచి పేరుంది. ఆమె 1980 వ దశకంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత రాజశేఖర్‌ని పెళ్లి చేసుకున్న ఆమె.. పెళ్ళి తర్వాత సినిమాలు చేయడం మానేశారు. తలంబ్రాలు, జానకి రాముడు, ఆహుతి, అంకుశం, మగాడు వంటి హిట్ చిత్రాల్లో జీవిత కథానాయికగా నటించారు. చివరిగా 1990లో మగాడు సినిమాలో కనిపించి రాజశేఖర్‌ని పెళ్లాడారు జీవిత. 

బహుముఖ ప్రజ్ఞాశాలి జీవితా రాజశేఖర్

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ భార్యగానే కాకుండా.. సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది జీవితా రాజశేఖర్. మొదట నటిగా సినిమాల్లోకి ప్రవేశించిన ఆమె.. ఆ తర్వాత నిర్మాతగా, దర్శకురాలిగా మారారు. ఇద్దరు కుమార్తెల పెంపకంతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా గడుపుతున్నారు. 
ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ

అయితే జీవిత 33 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేశారు ఆమె.

జీవిత తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించనున్నారు. లాల్ సలామ్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జీవిత రజనీకి సోదరిగా నటిస్తున్నారు. మార్చి 7న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రస్తుతం రజనీకాంత్ వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో ‘జైలర్’ సినిమా చేస్తున్నారు. దానితో పాటు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య డైరెక్షన్లో వస్తున్న లాల్ సలామ్‌లో ఒక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలోనే జీవితా రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

ఐశ్వర్య గతంలో ధనుష్, శృతి హాసన్‌లతో 3 అనే సినిమా చేసింది. ఓ డాక్యుమెంటరీ కూడా తీశారు. రజనీ, జీవిత‌తో పాటు విష్ణు విశాల్ కూడా లాల్ సలామ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను మేక‌ర్స్ వెల్ల‌డిస్తారు.

పెళ్లయ్యాక నటనకు దూరమైనా సినిమాలతోనే కొనసాగారు. ఆమె తన భర్త రాజశేఖర్ చిత్రాలకు నిర్మాతగా మరియు దర్శకురాలిగా పనిచేసింది. రాజశేఖర్ హీరోగా శేషు, సత్యమేవజయతే, మహంకాళి, శేఖర్ వంటి సినిమాలు తీశారు జీవిత. జీవిత, రాజశేఖర్‌ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారు శివాని రాజశేఖర్ మరియు శివాత్మిక రాజశేఖర్. సినిమాల్లో హీరోయిన్లుగా కూడా పని చేస్తున్నారు. వీరి పెద్ద కుమార్తె శివాని ‘అద్భుతం’ అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో శివాని నటనకు మంచి పేరు వచ్చింది. అలాగే వారి చిన్నమ్మాయి శివాత్మిక దొరసాని సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను అందుకోలేక పోయినా.. హీరోయిన్‌గా శివాత్మికకు మంచి పేరు వచ్చింది. తొలి సినిమా దొరసానితో మంచి గుర్తింపు తెచ్చుకున్న శివాత్మికకు హీరోయిన్‌గా మాత్రం ఆఫర్లు రాలేదు. మీడియం రేంజ్ హీరోలు, స్టార్ హీరోల సినిమాల్లో శివాత్మికను హీరోయిన్‌గా సెట్ చేయాలని జీవితా రాజశేఖర్ దంపతులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.