లీకైన నయనతార జవాన్ లుక్

షారుక్ ఖాన్ జవాన్ సినిమా ట్రైలర్ వచ్చేవారం విడుదలవ్వబోతుంది. ట్రైలర్ లాంచ్ చేయడానికి ఇంకా కొన్ని రోజులే ఉండగా, ఈ సినిమాలో నయనతార ఫస్ట్ లుక్ లీక్ అయింది. ఈ సినిమాని తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేశాడు.  బాలీవుడ్ లో డెబ్యూ చేస్తున్న నయనతార: నయనతార జవాన్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెడుతుంది. సినిమాని తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేశాడు. తను ఇంతకుముందు నయనతారతో రాజా రాణి వంటి చిత్రం చేశాడు. లీకైన ఫోటోలో నయనతార […]

Share:

షారుక్ ఖాన్ జవాన్ సినిమా ట్రైలర్ వచ్చేవారం విడుదలవ్వబోతుంది. ట్రైలర్ లాంచ్ చేయడానికి ఇంకా కొన్ని రోజులే ఉండగా, ఈ సినిమాలో నయనతార ఫస్ట్ లుక్ లీక్ అయింది. ఈ సినిమాని తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేశాడు. 

బాలీవుడ్ లో డెబ్యూ చేస్తున్న నయనతార:

నయనతార జవాన్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెడుతుంది. సినిమాని తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేశాడు. తను ఇంతకుముందు నయనతారతో రాజా రాణి వంటి చిత్రం చేశాడు. లీకైన ఫోటోలో నయనతార లుక్ బాగుంది. ఈ ఫోటోలో నయనతార పింక్ డ్రెస్ వేసుకొని ఉంది. జవాన్ సినిమాతో నయనతార బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇందులో షారుఖ్ ఖాన్ సరసన నటిస్తుంది. ఈ సినిమాలో నయనతారే కాకుండా విజయ్ సేతుపతి, సాన్యా మల్హోత్రా కూడా నటిస్తున్నారు. దీపికా పదుకొనే ఇందులో గెస్ట్ గా నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. ట్రైలర్ వచ్చేవారం విడుదల అవ్వబోతుంది. ఈ సినిమా టీజర్ ఈ వారంలో రిలీజ్ అవుతుందని అందరూ అంటున్నారు. జవాన్ సినిమా టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. షారుక్ ఖాన్,అట్లీ దీన్ని లాంచ్ చేస్తారని అంటున్నారు. టీజర్ చూసి అందరూ షాక్ అవుతారని అంటున్నారు. చెన్నైలో జవాన్ టీజర్ రిలీజ్ చేస్తారని అంటున్నారు. 

జవాన్ నయనతారకు బ్రేక్ ఇచ్చేనా?: 

నయనతార సుమారు 20 ఏళ్ల క్రింద సినీ రంగ ప్రవేశం చేసింది. చంద్రముఖి సినిమా తనకి మొదటగా బ్రేక్ ఇచ్చింది. తర్వాత తను తెలుగులో లక్ష్మీ తో అరంగ్రేటం  చేసింది. తర్వాత నాగార్జునతో బాస్ సినిమా నటించింది. ఆ తర్వాత కూడా నయనతార ప్రభాస్ తో యోగి, రవితేజ తో దుబాయ్ శీను వంటి సినిమాలు చేసింది. నయనతార తన పర్ఫార్మెన్స్ తో అనతి కాలంలోనే టాలీవుడ్ లో పెద్ద స్టార్ అయింది. తెలుగులో నటిస్తూనే తమిళ్ లో కూడా సినిమాలు చేసింది. శింబుతో చేసిన వల్లభ తనని వివాదాల్లో ఇరుక్కునేలా చేసింది. తర్వాత దాని నుండి కోలుకొని తమిళ్లో పెద్ద స్టార్ అయింది. తర్వాత కొన్ని రోజులకి ప్రభుదేవా తో పెళ్లి పీటల వరకు వెళ్ళింది. కానీ అది కూడా బ్రేక్ అయింది. తర్వాత కొన్ని రోజులకు నయనతార  లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం మొదలు పెట్టింది. ఆ సినిమాల విజయాలతో నయనతార తమిళ్లో లేడీ సూపర్ స్టార్ అయింది. తమిళంలో సినిమాలు చేస్తూనే తెలుగులో కూడా అడపాదడపా సినిమాలు చేసింది. చిరంజీవితో నయనతార చేసిన సైరా తనకు మంచి విజయాన్ని అందించింది. ఇప్పటికీ నయనతార మంచి జడ్జిమెంట్ తో సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా తను విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకుంది. నయనతార సినిమాలో ఉందంటే సినిమాలో కంటెంట్ ఉందని తమిళ ప్రేక్షకులు నమ్ముతారు. 

నయనతారకు తమిళ్ లో అంత క్రేజ్ ఉంది. ఇప్పుడు తను బాలీవుడ్ డెబ్యూ చేస్తుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి అక్కడ కూడా పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుందాం. రానున్న రోజుల్లో నయనతార బాలీవుడ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. తనకు ఇది బాగా కలిసి రావాలని కోరుకుందాం.