జ‌వాన్ హ‌వా.. 4 రోజుల్లోనే దాదాపు 300 కోట్లు

అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా కలెక్షన్లతో అధరకొడుతుంది. విడుదల అయిన నాలుగు రోజుల్లోనే 287 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది.  తమిళ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హీరోగా జవాన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల అయ్యి ఘన విజయం సాధించింది. షారుఖ్ ఖాన్ ను పవర్ ఫుల్ రోల్ లో చూసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ చిత్రం […]

Share:

అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా కలెక్షన్లతో అధరకొడుతుంది. విడుదల అయిన నాలుగు రోజుల్లోనే 287 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది. 

తమిళ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హీరోగా జవాన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల అయ్యి ఘన విజయం సాధించింది. షారుఖ్ ఖాన్ ను పవర్ ఫుల్ రోల్ లో చూసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ చిత్రం కలెక్షన్ల విషయానికి వస్తే గురువారం విడుదల అయిన ఈ చిత్రం మొదటి వారంలోనే సూపర్ కలెక్షన్లతో దూసుకు పోతుంది. గురువారం ఈ చిత్రానికి 75 కోట్ల రూపాయలు కలెక్షన్ రాగా అందులో 65.5 కోట్లు హిందీ వర్షన్ కు మిగతాది తెలుగు , తమిళ వర్షన్ ల నుండి వచ్చింది. శుక్రవారం 53.23 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించగా శనివారం 77.83 కోట్ల రూపాయలను ఆదివారం ఏకంగా 81 కోట్ల రూపాయలను సాధించింది. దీంతో విడుదల అయిన మొదటి నాలుగు రోజుల్లోనే 287 కోట్ల రూపాయల కలెక్షన్లు అందుకుంది. 

ఆదరించిన తెలుగు ప్రేక్షకులు 

సినిమా బావుంటే చాలు డైరెక్టర్ గురించి కానీ హీరో గురించి కానీ పట్టించుకోకుండా థియేటర్ లకు క్యూ కట్టడంలో తెలుగు ప్రేక్షకులు ముందు ఉంటారు. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ చిత్రం హిట్ టాక్ వస్తే తగ్గేదెలే అంటారు. ఈ చిత్రంలో హీరో బాలీవుడ్ మరియు దర్శకుడు తమిళ ఇండస్ట్రీ వ్యక్తి అయినా కూడా తమిళం కంటే ఎక్కువగా తెలుగు వర్షన్ కే థియేటర్ లో సీట్లు నిండాయి. హిందీ వర్షన్ చిత్రానికి థియేటర్ ఆక్యూపెన్సి 70.77 శాతంగా ఉండగా తమిళ వర్షన్ కి 53.71 మాత్రమే ఉంది. అయితే తెలుగు వర్షన్ షో లకు 68.79 శాతం ఆక్యుపెన్సీ నమోదు అవ్వడం గమనార్హం. ఇక ఆదివారం జవాన్ చిత్రం మరో రికార్డు సృష్టించింది. ఆదివారం ఒక్కరోజు లోనే దేశం మొత్తం మీద రికార్డు స్థాయిలో 2875961 టికెట్లు అమ్ముడు పోయాయి. 

ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లు కలెక్ట్ చేసింది

భారతదేశంలో మొదటి నాలుగు రోజుల్లోనే 287 కోట్లు కలెక్ట్ చేసిన జవాన్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను అందుకుంది అని ఫిల్మ్ ట్రేడ్ ఎనలిస్ట్ మనోబాల విజయ బాలన్ తెలిపారు. అలాగే ఒకే సంవత్సరంలో రెండు సార్లు 500 కోట్లకు పైగా కలెక్షన్ అందుకున్న ఏకైక హీరోగా షారుఖ్ ఖాన్ నిలవడం గమనార్హం. గతంలో  విడుదల అయిన పఠాన్ చిత్రానికి కూడా షారుఖ్ ఖాన్ ఇదే రేంజ్ లో కలెక్షన్లు అందుకున్నారు. ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్ విషయంలో జవాన్ చిత్రం పఠాన్ కలెక్షన్ లను దాటేసింది. పఠాన్ చిత్రం ఓపెనింగ్ వీకెండ్ లో 280.75 కోట్లను సాధించగా జవాన్ 287 కోట్ల రూపాయలను అందుకుంది. 

అల్లు అర్జున్ నటించిన సీన్ తొలగించారు

జవాన్ చిత్రంలో ఒక కామియో రోల్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించారు. అయితే సినిమా నిడివి పెరిగిపోవడంతో ఆ సీన్ లను తొలగించాల్సి వచ్చింది అని చిత్ర బృందం తెలిపింది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు, తెలుగు ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. ఇక ఈ చిత్రంలో కొన్ని ముఖ్యమైన సందర్భాలలో దీపికా పదుకునే, విజయ్ సేతుపతి నటించారు. ఏదేమైనా షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ హిట్ లతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ గా ఉన్నారు.