జ‌వాన్ ఓటీటీ పార్ట్‌న‌ర్ ఫిక్స్‌..! 

ఇండియాలో ఇప్పుడు చాలా మంది నేషనల్ రేంజ్ స్టార్లు ఉన్నారు. కానీ, చాలా కాలం క్రితమే ఈ స్థాయికి చేరుకోవడంతో పాటు ఎన్నో ఘనతలు, రికార్డులను క్రియేట్ చేసిన హీరోనే బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. ఒకప్పుడు వరుస హిట్లతో సత్తా చాటిన ఆయన.. చాలా కాలం పాటు ఫ్లాపుల పరంపరతో ఇబ్బంది పడ్డాడు. ఈ పరిస్థితుల్లోనే ‘పఠాన్’తో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఈ జోష్‌లోనే షారూఖ్ ఖాన్ ఇప్పుడు ‘జవాన్’ అనే సినిమాను చేశాడు.  అయితే […]

Share:

ఇండియాలో ఇప్పుడు చాలా మంది నేషనల్ రేంజ్ స్టార్లు ఉన్నారు. కానీ, చాలా కాలం క్రితమే ఈ స్థాయికి చేరుకోవడంతో పాటు ఎన్నో ఘనతలు, రికార్డులను క్రియేట్ చేసిన హీరోనే బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. ఒకప్పుడు వరుస హిట్లతో సత్తా చాటిన ఆయన.. చాలా కాలం పాటు ఫ్లాపుల పరంపరతో ఇబ్బంది పడ్డాడు. ఈ పరిస్థితుల్లోనే ‘పఠాన్’తో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఈ జోష్‌లోనే షారూఖ్ ఖాన్ ఇప్పుడు ‘జవాన్’ అనే సినిమాను చేశాడు. 

అయితే ‘జవాన్’  సినిమా స్పెషల్ షోను బుధవారం రాత్రి అంధేరిలోని వైఆర్ఎఫ్ స్టూడియోలో ప్రదర్శించారు. ఈ సినిమా చూసిన దర్శకుడు ముఖేష్ ఛాబ్ర, ర్యాపర్ రాజకుమారి తమ ఫస్ట్ రియాక్షన్‌ను షేర్ చేసుకున్నారు. కత్రినా కైఫ్, సుహానా ఖాన్, హృతిక్ రోషన్ తదితర సెలబ్రిటీలు ఈ షోకు హాజరయ్యారు. ఈ షో పూర్తయిన తరవాత కొంత మంది సెలబ్రిటీలు సినిమాపై స్పందించారు. ఈ సినిమాకు కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన ముఖేష్ ఛాబ్ర కూడా ‘జవాన్’ చూశారు. ఇక ఈయన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఇది ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ బాలీవుడ్, పాన్ ఇండియా సినిమాల్లో ఒకటని కొనియాడారు. ఆరంభంలోనే ఎన్నో అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

షారుఖ్ ఖాన్ తాజా చిత్రం, జవాన్, సెప్టెంబర్ 7న థియేట్రికల్ రిలీజ్‌తో ఇప్పటికే భారతదేశాన్ని చుట్టుముట్టింది. అర్ధరాత్రి కూడా థియేటర్‌ల వెలుపల గుమిగూడిన ఉత్సాహభరితమైన జనాల ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ముంచెత్తడంతో సినిమా చుట్టూ ఉన్న ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తున్నాయి. జవాన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ హీరోగా.. కోలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన చిత్రమే ‘జవాన్’. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అలాగే, ఇండియాలో కూడా అదే కనిపిస్తోంది. నార్త్ అండ్ సౌత్‌లో ఈ సినిమా షోలకు బుకింగ్స్ బాగున్నాయి. దీంతో ఈ మూవీకి ఓపెనింగ్స్ బాగానే వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘జవాన్’ మూవీ ఓటీటీ వివరాలు రివీల్ అయ్యాయి.

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘జవాన్’ మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు డీల్ చేసుకున్నారట. అంటే సెప్టెంబర్ 7న విడుదలైన ‘జవాన్’ నవంబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందని సమాచారం.  

ఇదిలా ఉండగా.. ‘జవాన్’ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీపిక పదుకొనే స్పెషల్ రోల్‌లో కనిపించింది. ఈ చిత్రానికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రంతోనే డైరెక్ట‌ర్‌గా అట్లీ, హీరోయిన్‌గా న‌య‌న‌తార బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఇదివరకటి రోజుల్లో థియేటర్ లో విడుదల టోన్ నిర్మాత కు డబ్బు వచ్చేది. కానీ ఈ డిజిటల్ యుగం లో OTT హక్కులు, మ్యూజిక్ హక్కులు, డబ్బింగ్ హక్కుల రూపంలో నిర్మాతకి బాగానే మిగులుతోంది సినిమా ఏ మాత్రం బాగున్నా సరే. హిట్ ఐన సినిమా కి ఈ ఆదాయం నిజంగా నిర్మాతలకు వరమే.

ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుందాం. “జవాన్” అనేక సవాళ్లను ఎదుర్కొన్న మరియు సమాజంలోని తప్పు చేసేవారిని ఎదిరించాలని నిర్ణయించుకున్న వ్యక్తి యొక్క ఉత్కంఠభరితమైన కథ. అవినీతిని, అన్యాయాన్ని చవిచూసిన ఆయన.. ఎంతకైనా తెగించేందుకు సిద్ధమయ్యారు. అట్లీ, సుమిత్ అరోరా, రమణగిరివాసన్‌లు ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు.