వైరల్ అవుతున్న  షారుఖ్ ఖాన్ ‘జవాన్’ డైలాగ్

బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ కేసు దేశమంతా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఓ క్రూయిజ్‌లో ఆర్యన్‌ను అరెస్ట్‌ చేసిన నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో మాజీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేకు అప్పట్లో అంతే రేటింగ్‌ వచ్చింది. అయితే.. కొడుకును విడిపించాలంటూ తండ్రిగా షారూఖ్‌ చాలా ప్రయత్నాలు చేశారు. చివరకు సమీర్‌ వాంఖడేనే వేడుకున్నారు. ఆర్యన్‌ను సేవ్‌ చేయాలని అడుక్కున్నారు. అన్నీ నేను చూసుకుంటానని.. సమీర్‌ వాంఖడే షారూఖ్‌తో చాట్ చేశారు.  […]

Share:

బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ కేసు దేశమంతా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఓ క్రూయిజ్‌లో ఆర్యన్‌ను అరెస్ట్‌ చేసిన నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో మాజీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేకు అప్పట్లో అంతే రేటింగ్‌ వచ్చింది. అయితే.. కొడుకును విడిపించాలంటూ తండ్రిగా షారూఖ్‌ చాలా ప్రయత్నాలు చేశారు. చివరకు సమీర్‌ వాంఖడేనే వేడుకున్నారు. ఆర్యన్‌ను సేవ్‌ చేయాలని అడుక్కున్నారు. అన్నీ నేను చూసుకుంటానని.. సమీర్‌ వాంఖడే షారూఖ్‌తో చాట్ చేశారు.  కొడుకు కోసం షారూఖ్‌ పడిన తపన తీరు ఆ చాటింగ్స్‌లో కళ్లకు కడుతోంది. ఆర్యన్‌కు ఎన్‌సీబీ క్లీన్‌ చిట్‌ ఇచ్చి రిలీజ్‌ చేసింది. ఆ తర్వాత సమీర్‌ వాంఖడే చిట్టా తెరిచింది. ఆర్యన్‌ను డ్రగ్స్‌ కేసులో ఇరికించకుండా ఉండేందుకు సమీర్‌..షారూఖ్‌ను 25 కోట్లు లంచం అడిగినట్లు ఆరోపణలొచ్చాయి. ఆర్యన్‌ లంచం కేసునే సమీర్‌పై సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేశారు. ఆ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని సమీర్ వాంఖడే బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

అంతేకాదు. వాంఖడే ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని సీబీఐ రిపోర్ట్‌..పలుసార్లు కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలు వెళ్లారని సీబీఐ చెబుతోంది. ఐదేళ్లలో 2017 నుంచి 2021 వరకు.. సమీర్ వాంఖడే తన కుటుంబంతో యూకే, ఐర్లాండ్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, మాల్దీవులు వెళ్లినట్లు ఆధాలు సేకరించారు. వాంఖడే దగ్గర దాదాపు 20 లక్షలు విలువ చేసే రోలెక్స్‌ వాచ్‌ ఉందని..ముంబయ్‌లో నాలుగు ఫ్లాట్లు ఉన్నాయని.. మరోచోట 41 ఎకరాల భూమి ఉన్నట్లు సీబీఐ అధికారులు లెక్క తేల్చారు. ఐదో ఫ్లాట్‌కు అడ్వాన్స్‌ కూడా ఇచ్చారని చిట్టా మొత్తం బయట పెట్టింది. ఇదే ఇప్పుడు వాంఖమే మెడకు చుట్టుకుంటోంది.

డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్‌ని కస్టడీలోకి తీసుకొని సమీర్‌ వాంఖడే దర్యాప్తు చేయడం అప్పట్లో సంచలనం రేపింది. అదే సమయంలో షారుఖ్‌ ‘జవాన్‌’ సినిమా షూటింగ్‌ జరుగుతుండగా..తాజాగా రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌లో సమీర్‌ని హెచ్చరిస్తూ బాలీవుడ్‌ బాద్‌షా డైలాగులు పేల్చినట్టు ఫ్యాన్స్‌ చెబుతున్నారు.

జవాన్‌ ట్రైలర్‌లో ఓ డైలాగ్‌ గురించి సోషల్‌మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. కొడుకు మీద చెయ్యి వేసే ముందు వాడి తండ్రి మీద చెయ్యి వేయ్ అని షారుఖ్‌ చెప్పిన డైలాగ్‌ మాజీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చీఫ్‌ సమీర్‌ వాంఖడే గురించేనన్న ప్రచారం జరుగుతోంది. జవాన్ షూటింగ్ సమయంలో షారూఖ్ కుమారుడు ఆర్యన్‌కు డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సమీర్ వాంఖడే కస్టడీలోకి తీసుకున్నాడు. అయితే ఆర్యన్‌కు తర్వాత క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత సమీర్‌ ఓ కేసులో ఇరుక్కున్నాడు. అర్యన్‌ని కేసులో ఇరికించకుండా ఉండటానికి షారుఖ్‌ నుంచి 25 కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేసినందుకు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇక ప్రస్తుతం జవాన్‌ ట్రైలర్‌లో ఉన్న డైలాగ్‌ సమీర్‌కి వార్నింగ్‌ అని షారుఖ్‌ ఫ్యాన్స్ అంటున్నారు.

షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘జవాన్‌’ సినిమా ట్రైలర్‌ విడుదలై అభిమానుల్లో మూవీ పట్ల మరింత హైప్‌ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో ఖాన్ ద్విపాత్రాభినయం చేస్తూ, తండ్రి కొడుకులుగా, నయనతార పోలీసుగా, విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు. దీపికా పదుకొణె కూడా అతిధి పాత్రలో కనిపించింది. ట్రైలర్‌లో వైరల్‌గా మారిన పవర్‌ఫుల్‌ డైలాగ్ ఉంది. ఇది షారుఖ్‌ కుమారుడు ఆర్యన్‌ని డ్రగ్స్ కేసులో ప్రశ్నించిన సమీర్ వాంఖడేపై అని ఫ్యాన్స్‌ ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈ ట్రైలర్‌ను’శతాబ్దపు’ ట్రైలర్‌గా ఫ్యాన్స్‌ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అద్భుతమైన విజువల్స్‌తో పాటు, పంచ్ డైలాగ్‌లు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన బాలీవుడ్‌ బాద్‌షా హస్కీ వాయిస్‌తో “బేటే కో హాత్ లగానే సే పెహ్లే, బాప్ సే బాత్ కర్” అని చెప్పడంతో ఫ్యాన్స్‌ ఈ డైలాగునే సమీర్‌కి ట్యాగ్‌ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు.