రామ్ చరణ్‌పై జేమ్స్ కామెరూన్ ప్రశంసలు

జేమ్స్ కామెరూన్ ప్రశంసలతో చిరంజీవికి పుత్రోత్సాహం ఆస్కార్ పురస్కారాలు దగ్గర పడే కొద్ది తెలుగు సినీ అభిమానులలో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఆర్‌ఆర్ఆర్‌ నుంచి ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో నాటు నాటు ఆస్కార్‌ బరిలో నిలిచింది. ఒక తెలుగు చిత్రం ఆస్కార్ బరిలో దిగటమంటే ఆషామాషీ ఏమీ కాదు. ఇది తెలుగువారిగా మనందరికీ గర్వకారణమని చెప్పుకోవాలి. ఈ చిత్రాన్ని ఎందరో హాలీవుడ్ దర్శకులు, టెక్నీషియన్లు ప్రశంసించారు. హాలీవుడ్ దర్శక దిగ్గజమైన జేమ్స్ కామెరూన్ ఈ చిత్రంపై ప్రశంసల […]

Share:

జేమ్స్ కామెరూన్ ప్రశంసలతో చిరంజీవికి పుత్రోత్సాహం

ఆస్కార్ పురస్కారాలు దగ్గర పడే కొద్ది తెలుగు సినీ అభిమానులలో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఆర్‌ఆర్ఆర్‌ నుంచి ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో నాటు నాటు ఆస్కార్‌ బరిలో నిలిచింది. ఒక తెలుగు చిత్రం ఆస్కార్ బరిలో దిగటమంటే ఆషామాషీ ఏమీ కాదు. ఇది తెలుగువారిగా మనందరికీ గర్వకారణమని చెప్పుకోవాలి. ఈ చిత్రాన్ని ఎందరో హాలీవుడ్ దర్శకులు, టెక్నీషియన్లు ప్రశంసించారు. హాలీవుడ్ దర్శక దిగ్గజమైన జేమ్స్ కామెరూన్ ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించడం కొత్తగా అందరి దృష్టినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ క్యారెక్టర్ అద్భుతంగా ఉందంటూ జేమ్స్ కెమెరూన్ పొగిడారు. చెర్రీ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు.  

ఆస్కార్ పండగ దగ్గర పడటంతో జేమ్స్.. అవతార్ 2 కోసం హాలీవుడ్‌‌లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ సినిమాను పొగడ్తలతో ముంచెత్తాడు. రాజమౌళి దృష్టి కోణం గురించి, చరణ్ పాత్ర గురించి  ఎంతో గొప్పగా మాట్లాడాడు. చరణ్ పాత్ర తన ఆలోచనలను వదలడం లేదని, ఆ పాత్రను అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం పడుతుందని, కానీ అర్థమైన తర్వాత మనసు బాధతో బరువెక్కుతుందని అన్నారు.  చరణ్ పాత్రను రాజమౌళి గొప్పగా మలిచారని, ఇదే విషయాన్ని రాజమౌళితో స్వయంగా చెప్పానని అన్నారు. 

కాగా చిరంజీవి దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.  అటువంటి గొప్ప దర్శకుడు, గ్లోబల్‌ ఐకాన్, సినిమాటిక్‌ జీనియస్‌ పొగడటం ఆస్కార్ అవార్డు కంటే తక్కువ ఏమీ కాదని, రామ్ చరణ్‌కు ఇది ఒక గొప్ప గౌరవం అని చిరు ట్వీట్ చేశారు. చరణ్ సినీ ప్రస్థానాన్ని చూసి తాను ఎంతో గర్వపడుతున్నానని అన్నారు. ఇక చిరు ట్వీట్​పై మెగా అభిమానులు, మెగా పవర్ స్టార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

రామ్ చరణ్ కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటూ మంచి మంచి పాత్రలు చేస్తూ ఎంతో మంది ప్రశంసలు పొందారు. దాంతో కొడుకు విజయాన్ని చూసి చిరంజీవి పొంగిపోతున్నారు. ‘పుత్రోత్సాహము తండ్రికి’ అన్నట్టు, అటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దర్శకుడు తన తనయుడు రామ్ చరణ్‌‌ని అంతగా పొగడడంతో చిరంజీవి ఆనందానికి అంతులేదు. ఒక ఇండియన్ సినిమా గురించి ఇంత గొప్పగా హాలీవుడ్ దర్శకులు, టెక్నీషియన్లు మాట్లాడడం, మెచ్చుకోవడం ఆర్ఆర్ఆర్ వల్లే సాధ్యమైంది. చరణ్, తారక్ నటన, రాజమౌళి విజన్ లపై ఎందరో  ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్లు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికీ చైనా, జపాన్ దేశాలలో మంచి కలెక్షన్లను రాబడుతోంది. అంతేకాకుండా ఈ మధ్యనే నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం ఈ చిత్రం టీం కి మరింత పేరు తెచ్చిపెట్టింది. మరి ఆస్కార్ బరిలో నిలిచిన ఈ సినిమాకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు వస్తుందో? రాదో? అని చాలా మంది సినీ ప్రియులు టెన్షన్ పడుతున్నారు.