జైలర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఆగస్టులో విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.630 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి సూపర్ హిట్ అయింది. తలైవా రజినీకాంత్ స్టైల్, యాక్షన్.. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ టేకింగ్, అనిరుధ్ రవిచందర్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోవడంతో జైలర్ అంచనాలకు మించి భారీ విజయం సాధించింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అటు చాలా […]

Share:

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఆగస్టులో విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.630 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి సూపర్ హిట్ అయింది. తలైవా రజినీకాంత్ స్టైల్, యాక్షన్.. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ టేకింగ్, అనిరుధ్ రవిచందర్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోవడంతో జైలర్ అంచనాలకు మించి భారీ విజయం సాధించింది.

అయితే, ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అటు చాలా కాలం తర్వాత రజినీకి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది జైలర్. ప్రస్తుతం జైలర్ థియేట్రికల్ రన్ కొనసాగిస్తుండగానే ఇటు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తోందా అంటూ నెట్టింట చర్చ మొదలైంది. రెండు రోజులుగా జైలర్ ఓటీటీ స్ట్రీమింగ్ పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాజాగా జైలర్ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన వచ్చింది. 

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోన్న సినిమా జైలర్. సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ఇది. బీస్ట్ సినిమా తర్వాత ఫుల్ యాక్షన్ మోడ్‏లో రజినీతో ఈ చిత్రాన్ని రూపొందించి బాక్సాఫీస్‍ను షేక్ చేస్తున్నారు డైరెక్టర్ దిలీప్. ఆగస్ట్ 10న విడుదలైన ఈ సినిమా దూసుకుపోతుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అటు చాలా కాలం తర్వాత రజినీకి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది జైలర్.

 ప్రస్తుతం జైలర్ థియేట్రికల్ రన్ కొనసాగిస్తుండగానే ఇటు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తోందా అంటూ నెట్టింట చర్చ మొదలైంది. రెండు రోజులుగా జైలర్ ఓటీటీ స్ట్రీమింగ్ పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాజాగా జైలర్ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని తెలియజేశారు మేకర్స్.

 ఫుల్ యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్, మోహల్ లాల్, తమన్నా, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలకు ముందే ఇందులోని పాటలు యూట్యూబ్ లో సెన్సెషన్ అయ్యాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో తమన్నా చేసిన కావాలయ్యా పాట ఏ రెంజ్ లో ట్రెండ్ అయ్యిందో చెప్పక్కర్లేదు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా నెట్టింట ఈ పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు. 

సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడంతో నిర్మాత కళానిధి మారన్ ఫుల్ సంతోషంలో ఉన్నారు. ఇప్పటికే రజినీకి రెమ్యూనరేషన్ కాకుండా రూ.100 కోట్లు అదనంగా గిఫ్ట్ ఇచ్చారు కళానిధి. అలాగే ఖరీదైన బీఎండబ్ల్యూ కారు బహుమతిగా అందించారు. ఇక డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కు కూడా లగ్జరీ బీఎండబ్ల్యూ అందించారు మారన్.

రజనీకాంత్, కళానిధి మారన్‌ల చిత్రాన్ని పంచుకుంటూ మనోబాల విజయబాలన్ ఇలా రాశారు, “అందులో వస్తున్న సమాచారం, కళానిధి మారన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అందజేసిన కవరులో సిటీ యూనియన్ బ్యాంక్, మండవేలి బ్రాంచ్, చెన్నై నుండి రూ.100 కోట్ల మొత్తం చెక్కు ఉంది. ఇది జైలర్ ప్రాఫిట్ షేరింగ్ చెక్, ఇది సినిమా కోసం సూపర్ స్టార్‌కి ఇప్పటికే చెల్లించిన రెమ్యునరేషన్ రూ. 110 కోట్లు కంటే ఎక్కువ. మొత్తం రూ.210 కోట్లు. సూపర్ స్టార్ రజనీకాంత్‌ను భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా జైలర్ నిలబెట్టింది.