జైలర్ పాన్ ఇండియా ఫిల్మ్ కాదు: తమన్నా భాటియా

ఈ మధ్యకాలంలో రజినీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కావడం లేదు. దీంతో ఓ మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న ఈ సూపర్ స్టార్.. జైలర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బీస్ట్ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆగస్టు 10న విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా నువ్వు కావాలయ్యా సాంగ్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి […]

Share:

ఈ మధ్యకాలంలో రజినీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కావడం లేదు. దీంతో ఓ మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న ఈ సూపర్ స్టార్.. జైలర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బీస్ట్ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆగస్టు 10న విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా నువ్వు కావాలయ్యా సాంగ్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

అయితే ఇందులో తమన్నా డాన్స్ తో కుర్రకారుల మనసుని కొల్లగొడుతోంది.ముంబైలో తమన్నా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది, అక్కడ ఆమె పాట కి వచ్చిన  ప్రజాదరణ గురించి వివరించింది. “పాటను చిత్రీకరిస్తున్నప్పుడు, దర్శకుడు నెల్సన్, మా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌లతో సహా అత్యుత్తమ బృందం ఉంది  మరియు రజనీ సార్‌ని సెట్స్‌లో ఉండడం  మరియు అతనితో డ్యాన్స్ చేయడం నాకు ఒక అద్భుతమైన క్షణం గ అనిపించింది .. ఈ పాత అద్భుతంగా ఉంటుంది అని తెలుసు కానీ ఇంత పెద్దగా హిట్  అవుతుందని ఊహించలేదు. సాధారణంగా, ప్రజలు పాటలపై రీల్స్ చేస్తారు , కానీ ఈసారి నాకు కావాలాలో రీల్ చేస్తే బాగుణ్ణు అని అనుకున్నాను కానీ ఆ సాంగ్ ఇంతగా వైరల్ అవుతాది అని ఊహించలేదు . నేను పోస్ట్ చేసినప్పటి నుండి నా నోటిఫికేషన్ ఆగలేదు అని తన ఆనందాన్ని మీడియా తో పంచుకున్నారు తమన్నా.  

 ‘వా.. నువ్వు కావాలయ్యా లో అదరగొట్టే స్టెప్ లు ….

ఈ పాటలో  హుక్ స్టెప్పులేసి డాన్స్ తో అదరగొట్టింది తమన్నా. ఆమె అందాలకు తోడు రజినీకాంత్ స్టైల్ హైలైట్ అయింది. దీంతో తెలుగు వర్షన్ కూడా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ పాటకు అనిరుద్ స్వరాలు అందించగా.. సింధూజ శ్రీనివాసన్ ఆలపించారు. ఇప్పటికే మూవీ టీమ్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసింది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు సినిమాపై హైప్ తీసుకొస్తున్నారు మేకర్స్.

ఆగస్ట్ 10న ఈ మూవీ విడుదల కానుంది…  ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో మోహన్‌లాల్, రమ్యకృష్ణ, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ తదితరులు నటిస్తున్నారు.ఇంత గొప్ప  టీమ్ లో భాగం కావడం గురించి తమన్నా చెబుతూ కంటెంట్ బాగుంది ఇంత మంచి టీమ్  ఉంటె చాలు అని ఆమె అన్నారు. 

. ‘‘గతంలో నేను చాలా బృందాల్లో భాగమయ్యాను కానీ  స్క్రిప్ట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా లేదా అన్న భయం ఉండేది కానీ ఈ సినిమా లో నాకు అన్ని విధాలుగా ప్రేక్షకులిని అలరిస్తుంది అన్న నమ్మకం ఉంది అని ఆమె తెలిపారు. 

జైలర్ పాన్ ఇండియా మూవీ కాదు..  ఆ ఉద్దేశం తో మూవీ తీయలేదు అని ఆమె అన్నారు, అంతే కాకుండా ఈ  సినిమా సూపర్ స్టార్ కి  ఈ మూవీ సూపర్ హిట్ ఇస్తుంది అని అన్నారు అంతే కాకుండా కావలి సాంగ్ తెలుగు టైటిల్ ఉన్న తమిళ్ సాంగ్ అని ఆమె వివరించారు… ఆ సాంగ్ ని తెలుగు లో దుబ్ చేసి రిలీజ్ చేసాక ఊహంచలేని విదంగా వైరల్ అయ్యింది అని తమన్నా తెలిపారు ,అంతే కాకుండా ఇప్పుడు ఈ సాంగ్ హిందీ లో రీలీజ్ కాబోతుంది అని మరియు ఇక్కడ కూడా అంతే పెద్ద హిట్ అవుతుంది అన్న నమ్మకం ఉంది అని ఆమె మీడియా తో తెలిపారు.  

ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గరపడుతుండడంతో లేటెస్ట్‌గా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఇక ఈ చిత్రం రన్ టైమ్ విషయానికి వస్తే.. ఈ చిత్రం 2 గంటల 49 నిమిషాల సుదీర్ఘ రన్‌టైమ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, నాగేంద్ర బాబు, రమ్య కృష్ణన్, సునీల్, వసంత్ రవి, యోగి బాబు కీలకపాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ నిర్మించింది.