జైలర్ పూర్తి సినిమా ఆన్‌లైన్‌లో లీక్..!

రజనీకాంత్ జైలర్ మూవీ థియేటర్లలో సందడి చేస్తుండగా.. మరోవైపు లీక్ రాయుళ్లు రెచ్చిపోయారు. విడుదలైన కొన్ని గంటల్లోనే ఫుల్ మూవీని ఆన్‌లైన్‌లో పెట్టేశారు. దీంతో మూవీ మేకర్స్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. రజనీకాంత్ రెండేళ్ల తరువాత జైలర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు జైలర్ మూవీ తో వచ్చారు . ఐకానిక్ ఎంటర్‌టైనర్‌లో నటించిన జైలర్‌పై అభిమానులు మరియు జర్నలిస్టులు ప్రశంసలు కురిపించారు. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రకటించినప్పటి నుండి మంచి ఫీడ్ […]

Share:

రజనీకాంత్ జైలర్ మూవీ థియేటర్లలో సందడి చేస్తుండగా.. మరోవైపు లీక్ రాయుళ్లు రెచ్చిపోయారు. విడుదలైన కొన్ని గంటల్లోనే ఫుల్ మూవీని ఆన్‌లైన్‌లో పెట్టేశారు. దీంతో మూవీ మేకర్స్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.

రజనీకాంత్ రెండేళ్ల తరువాత జైలర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు జైలర్ మూవీ తో వచ్చారు . ఐకానిక్ ఎంటర్‌టైనర్‌లో నటించిన జైలర్‌పై అభిమానులు మరియు జర్నలిస్టులు ప్రశంసలు కురిపించారు. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రకటించినప్పటి నుండి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. 

ఆగస్ట్ 10న విడుదలైన జైలర్ అంచనాలకు తగినట్లే బ్లాక్‌బస్టర్ టాక్‌తో జైలర్ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కగా.. తలైవాకు జోడిగా తమన్నా నటించింది. పాన్‌ఇండియా లెవల్లో కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. తలైవా ఈజ్ బ్యాక్ అంటూ జైలర్ మూపై ప్ర‌శంస‌ల వర్షం కురుస్తుంది  

 మేకర్స్‌కు షాక్ .. .

జైలర్  థియేటర్లలోకి వచ్చిన కొన్ని  గంటల్లోనే పైరసీ బారిన పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. అనేక పైరసీ సైట్లలో హెచ్‌డీ ప్రింట్ అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. పైరసీ సైట్లలో లీక్ కావడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెలిగ్రామ్, తమిళ్ రాకర్స్, టొరంటో, మూవీ రూల్జ్ వంటి వెబ్‌సైట్ల చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. జైలర్ మూవీని పైరసీలో చూడొద్దని కోరుతున్నారు. సినిమాను డౌన్‌లోడ్ చేసుకోని చూస్తుండడంతో మేక‌ర్స్‌కి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. జైలర్ మూవీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ చేయాల్సిందేనని.. ఆ థ్రిల్ మిస్‌ అవ్వకూడదని అంటున్నారు సినీ లవర్స్ . 

 జైలర్  రివ్యూ.. 

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. దీంతో ఆయన అభిమానులు సందడి చేస్తున్నారు. కొన్ని సంస్థలు అక్కడి ఉద్యోగులకు సెలవులు కూడా ఇచ్చేసింది… ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా మూవీపై తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు.

ఈ మూవీ చూసిన ప్రేక్షకులు ఫస్టాఫ్ బాగుందని, సెకండ్ ఆఫ్ మాత్రం అస్సలు బాగోలేదని రివ్యూ ఇస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. మూవీ మొత్తంగా బాగుందని, ఫ్యాన్స్‌కు పండగేనని అంటున్నారు. ముఖ్యంగా అనిరుద్ బీజీఎం అదిరిపోయిందట. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్స్ భలే థ్రిల్లింగ్‌గా ఉన్నట్లు చెబుతున్నారు. డార్క్ కామెడీని ఇష్టపడేవారికి ఈ మూవీ నచ్చుతుందని అంటున్నారు. హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పిల్లలతో వెళ్లకపోవడమే బెటర్ అంటు సోషల్ మీడియా లో మూవీ గురించి అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు. 

 ఇక ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను స‌న్ నెక్ట్స్‌ ద‌క్కించుకుంది. సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారం నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రం ఓటీటీ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్‌ కూడా ప్రయత్నిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ కూడా డీల్ సెట్ అయితే రెండు ఓటీటీ ఫ్లారమ్స్‌లో ఒకే రోజు విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. శాటిలైట్ రైట్స్‌ను జెమిని టీవీకి దక్కాయి.ఇక‌పోతే చిరంజీవి న‌టించిన భోళా శంక‌ర్ కంటే జైల‌ర్ ప్రీ బుకింగ్స్ ఎక్కువ‌గా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భోళా శంక‌ర్ కంటే జైల‌ర్ మేనియానే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.