జైలర్ మొదటి రోజే కలెక్షన్ల వర్షం

రెండు సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడు రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు జులై 10న విడుదలై అభిమానుల చేత శభాష్ అనిపించుకుంది. జైలర్ సినిమా గురించి ప్రకటించినప్పటి నుంచి, రజనీకాంత్ ఫ్యాన్స్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఎదురు చూడ సాగరు. 2023 ఆగస్టు 10న జైలర్ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాకుండా మొదటి రోజే కలెక్షన్ల వర్షం చూసింది. జైలర్ సినిమా మొదటి రోజు కలెక్షన్ […]

Share:

రెండు సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడు రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు జులై 10న విడుదలై అభిమానుల చేత శభాష్ అనిపించుకుంది. జైలర్ సినిమా గురించి ప్రకటించినప్పటి నుంచి, రజనీకాంత్ ఫ్యాన్స్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఎదురు చూడ సాగరు. 2023 ఆగస్టు 10న జైలర్ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాకుండా మొదటి రోజే కలెక్షన్ల వర్షం చూసింది. జైలర్ సినిమా మొదటి రోజు కలెక్షన్ 49 కోట్లుగా ఉందని, అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అని అఫీషియల్ గా రిలీజ్ అయ్యే నివేదికల ప్రకారం తేలనుంది. అత్యధికంగా తమిళ్ నాడులో, జైలర్ సినిమా 25 కోట్లు వరకు మొదటి రోజు వసూలు ఉండవచ్చని అంచనా.

జైలర్ సినిమా హడావిడి:

జైలర్ సినిమా గురించి ప్రకటించినప్పటి నుంచి, రజనీకాంత్ ఫ్యాన్స్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఎదురు చూడ సాగరు. ఈ సందర్భంగా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రత్యేక సన్నాహాలు చేయడం జరిగింది. 2023 ఆగస్టు 10న జైలర్ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాకుండా మొదటి రోజే కలెక్షన్ల వర్షం చూసింది. జైలర్ సినిమా మొదటి రోజు కలెక్షన్ 49 కోట్లుగా ఉందని, అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అని అఫీషియల్ గా రిలీజ్ అయ్యే నివేదికల ప్రకారం తేలనుంది. రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడు రూ.25 కోట్లు రాబట్టవచ్చని, కర్ణాటక నుంచి రూ.11 కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మార్కెట్‌లో రూ.7 కోట్లు రాబట్టవచ్చని అంచనా. జైలర్ సినిమా రిలీజ్ అవ్వకముందు నుంచే హడావిడి మొదలైంది, జైలర్ సినిమా రిలీజ్ కారణంగా చెన్నై అలాగే బెంగళూరులోని పలు ప్రాంతాలలో కొన్ని ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో జైలర్ సినిమా కోసం ఉచిత టికెట్లు పంపిణీ కూడా చేశారు. 

జైలర్ సినిమా విశేషాలు:

రజనీకాంత్‌తో పాటు, జైలర్‌లో జాకీ ష్రారోఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్య కృష్ణన్, వినాయకన్, మిర్నా మీనన్, తమన్నా మరియు మలయాళం స్టార్ మోహన్‌లాల్ అతిధి పాత్రలో పెద్ద పెద్ద తారలు కనిపించబోతున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు, ఆ పాటలు ఇప్పటికే ఇంటర్నెట్ ని ఊపేస్తున్నాయి. జైలర్ ఆగస్ట్ 10న విడుదల అయింది. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగా ముఖ్యంగా తమన్నా డాన్స్ స్టెప్పులు, అదేవిధంగా, ఎప్పటిలాగే రజనీకాంత్ స్టైల్, డైలాగ్ డెలివరీతో అదరగొట్టారని ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రజనీకాంత్, తమన్నా జంటగా నటించిన చిత్రం జైలర్. ఈ సినిమాలో కావాలా అనే పాటను రీసెంట్ గా విడుదల చేశారు. ఈ పాటలో తమన్నా స్టెప్పులు ప్రేక్షకులను అలరించే విధంగా ఉన్నాయి. రజనీకాంత్ తో కలిసి తమన్నా స్టెప్పులు వేయడం సినిమా పై అంచనాలను మరింత పెంచింది, అదేవిధంగా ప్రస్తుతం రిలీజ్ అయిన సినిమా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కావాలా అనే పాటని శిల్పారావు, అనిరుద్ రవిచంద్రన్ పాడారు. ఈ పాట లిరిక్స్ని అరుణ్ రాజా కామరాజ్ రాశాడు. ఈ పాట అందర్నీ ఇంప్రెస్ చేస్తుంది. ఈ కావాలా అనే పాట ట్రాక్ ఆఫ్ ది ఇయర్ అవుతుందని ఫాన్స్ అంటున్నారు.