ర‌జ‌నీకాంత్ గొప్పతనం గురించి చెప్పిన జాకీ ష్రాఫ్

‘జైలర్’ సినిమాతో తన అభిమానులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు సూపర్‌‌ స్టార్ రజనీకాంత్. పెద్దన్న (తమిళంలో అన్నాత్తే) సినిమా ఫ్లాప్‌తో రెండేళ్ల గ్యాప్‌ తర్వాత చేసిన సినిమా ఇది. జైలర్ సినిమాలో రజనీతోపాటు మోహన్‌ లాల్, శివరాజ్‌కుమార్‌‌ లాంటి స్టార్లు, జాకీష్రాఫ్, తమన్నా, సునీల్, రమ్యకృష్ణ, మిర్నా మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.  కారులో నుంచి వెనక్కి వచ్చి.. ఈ నేపథ్యంలో సినిమా చిత్రీకరణ సందర్భంగా […]

Share:

‘జైలర్’ సినిమాతో తన అభిమానులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు సూపర్‌‌ స్టార్ రజనీకాంత్. పెద్దన్న (తమిళంలో అన్నాత్తే) సినిమా ఫ్లాప్‌తో రెండేళ్ల గ్యాప్‌ తర్వాత చేసిన సినిమా ఇది. జైలర్ సినిమాలో రజనీతోపాటు మోహన్‌ లాల్, శివరాజ్‌కుమార్‌‌ లాంటి స్టార్లు, జాకీష్రాఫ్, తమన్నా, సునీల్, రమ్యకృష్ణ, మిర్నా మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

కారులో నుంచి వెనక్కి వచ్చి..

ఈ నేపథ్యంలో సినిమా చిత్రీకరణ సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటనను బాలీవుడు నటుడు జాకీ ష్రాఫ్‌ తాజాగా పంచుకున్నారు. షూటింగ్ సమయంలో తనకు రజనీ క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు. ‘‘జైలర్ చిత్రం షూటింగ్ సందర్భంగా తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తవడంతో ఇంటికి వెళ్లిపోయేందుకు రజనీ తన కారులో కూర్చున్నారు. అప్పటికి నా సీన్లు ఇంకా కొన్ని ఉన్నాయి. దీంత నేను అక్కడే ఉన్నా. ఈ సమయంలో రజనీ వెనక్కి వచ్చారు. నాకు ‘బై’ చెప్పడం మరిచిపోయి వెళ్లినందుకు క్షమాపణలు చెప్పారు” అని జాకీ గుర్తుచేసుకున్నారు. అంతేకాదు.. తాను ఉండాల్సిన అవసరం ఉంటే సెట్‌లో ఉంటానని కూడా రజని చెప్పారని అన్నారు. ఈ విషయాన్ని మీడియాతో పంచుకుంటూ.. రజనీ అలా చేయడంతో తాను భావోద్వేగానికి గురయ్యానని, కళ్లలో నీళ్లు వచ్చాయని జాకీ ష్రాఫ్ అన్నారు. సినిమా షూటింగ్ కొనసాగినన్నాళ్లు టీమ్‌ను రజనీకాంత్ ప్రేమతో, గౌరవంతో చూసుకున్నారని కొనియాడారు. ఈ చిత్రంలో ఎంతో ఎంజాయ్ చేస్తూ పని చేశామని అన్నారు. జైలర్ సినిమా చేయడానికి గల కారణాలను జాకీ ష్రాఫ్ చెప్పుకొచ్చారు. రజనీకాంత్ తనకు చాలా కాలం నుంచి మిత్రుడని చెప్పారు. అందుకే ఈ చిత్రంలో చేసేందుకు ఒప్పుకున్నానని, పెద్దగా ఆలోచించలేదని అన్నారు. 

రజనీ పారితోషకం 110 కోట్లు?

ఆగస్టు 10వ తేదీన జైలర్ సినిమా రిలీజ్ కానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 225 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ట్రైలర్ తోపాటు ‘నువ్వు కావాలయ్యా’ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.  ఇక ఈ సినిమాలో రజనీకాంత్ పారితోషకం గురించి బయటికి వచ్చిన వివరాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. జైలర్‌‌లో నటించినందుకు గానూ.. రజనీకాంత్ రూ.110 కోట్ల భారీ పారితోషకం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే సినిమాలో దాదాపు సగం భాగం రజనీ పారితోషకం కోసమే ఖర్చు చేశారు. గతంలో కూడా ఓ సినిమా కోసం రజనీకాంత్ ఇంతే మొత్తం తీసుకున్నారని చర్చ నడుస్తోంది. ఇక మలయాళ సూపర్‌‌స్టార్ మోహన్‌లాల్ రూ.8 కోట్లు, కన్నడ సూపర్‌‌స్టార్ శివరాజ్‌కుమార్ రూ.4 కోట్లు, జాకీ ష్రాఫ్‌ రూ.4 కోట్లు, తమన్నా రూ.3 కోట్లు తీసుకున్నారట. సినిమా మొత్తం ఖర్చులో కేవలం పారితోషకానికి ఎక్కువ వెచ్చించినట్లు తెలుస్తోంది.

170వ సినిమాకూ భారీ తారాగణం..

జైలర్, లాల్‌ సలామ్ తదితర చిత్రాల తర్వాత రజనీ నటించబోయే సినిమా గురించి బయటికి వస్తున్న అప్‌డేట్స్‌ ఆసక్తిని పెంచేస్తున్నాయి. రజనీ 170వ సినిమాను ‘జై భీమ్’ డైరెక్టర్ జ్ఞానవేల్ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. ఇందులో రజనీతోపాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్, టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని, మలయాళ విలక్షణ నటుడు ఫావద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రల్లో పోషించనున్నట్లు తెలుస్తోంది. మలయాళ నటి మంజూ వారియర్‌‌ కూడా ఇందులో భాగం కానున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో పోలీసు పాత్రలో రజనీకాంత్ కనిపిస్తారని కోలీవుడ్ వర్గాల భోగట్టా. ఈ చిత్రంలో ఎవరెవరు నటించనున్నారు? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనే వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.