విశాల్ పెళ్లి పుకార్లు 

నటుడు విశాల్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పందెంకోడి సినిమా. ఆ సినిమాలో విశాల్ నటన చూసిన తరువాత ప్రతి ఒక్కరూ విశాల్ కు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. ఆయన సినిమాలు తమిళ్ లోనే కాకుండా తెలుగు సినీ రంగంలో కూడా ఎంతగానో పేరుగాంచాయి. ప్రస్తుతం విశాల్ పెళ్లి విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సినిమాల్లో విశాల్ పక్కన హీరోయిన్గా నటించిన లక్ష్మి మీనన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. […]

Share:

నటుడు విశాల్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పందెంకోడి సినిమా. ఆ సినిమాలో విశాల్ నటన చూసిన తరువాత ప్రతి ఒక్కరూ విశాల్ కు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. ఆయన సినిమాలు తమిళ్ లోనే కాకుండా తెలుగు సినీ రంగంలో కూడా ఎంతగానో పేరుగాంచాయి. ప్రస్తుతం విశాల్ పెళ్లి విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సినిమాల్లో విశాల్ పక్కన హీరోయిన్గా నటించిన లక్ష్మి మీనన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

విశాల్ పెళ్లి ఎవరితో: 

తమిళ, తెలుగు సినిమా రంగంలో, నటుడు విశాల్ ప్రేమ జీవితం చాలా మందికి ఆసక్తిని రేకిత్తిస్తున్న అంశం. మొదట్లో నటి వరలక్ష్మితో రిలేషన్షిప్ గురించి ప్రస్తావన వచ్చినప్పటికీ, ఇటీవలి వినిపిస్తున్న వార్తల ప్రకారం అతని పాండియ నాడు సినిమాలో నటించిన సహనటి లక్ష్మీ మీనన్‌ తో రిలేషన్షిప్ లో ఉన్నట్లు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. తాజాగా వినిపిస్తున్న నీవేదికల ప్రకారం, వీరిద్దరి మధ్య ప్రస్తుతం ఉన్న రిలేషన్షిప్ పెళ్లి వరకు వెళ్లే ఛాన్స్ ఉందని ఊహాగానాలు రేపుతున్నాయి.

విశాల్ మరియు లక్ష్మి మీనన్ మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎప్పటినుంచో ఒక ఫ్రెండ్ షిప్ గా అందరికీ తెలిసినప్పటికీ ప్రస్తుతం అది ప్రేమగా మారిందని కొందరు అంటున్నారు. విశాల్‌ రొమాంటిక్‌ రూమర్స్‌లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు, నాడోడిగల్ చిత్రంలో ఆమె పాత్రకు ప్రసిద్ధి చెందిన అభినయతో అతని ప్రమేయం గురించి పుకార్లు చెక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే, అంతేకాకుండా వారిద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా అప్పుడప్పుడు బయటపడుతూ ఉండేది.

విశాల్ పెళ్లి విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆసక్తి రేపించే అంశంగా మారింది. కొన్నేళ్లుగా, నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తో కూడా రిలేషన్ షిప్ లో ఉన్నట్టు పుకార్లు వినిపించాయి, తర్వాత ఈ పుకార్లకు చెక్ పెట్టాలని వారి మధ్య ఉన్న కనెక్షన్ మంచి స్నేహితులది మాత్రమే అని పదేపదే నొక్కిచెప్పారు. అయితే, 2022లో, వరలక్ష్మి శరత్‌కుమార్ తండ్రి, ఆర్ శరత్‌కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించిన విశాల్ టీం. అయితే ఆ తర్వాత నుంచి వారిద్దరి మధ్య ఉన్న పుకార్లకు పడిపోయినట్లు అయింది. ఈ సంఘటన ట్విట్టర్‌లో ఉన్న నేటిజన్ల ఊహాగానాలు మార్చేసింది, అంతేకాకుండా ట్విట్టర్లో వరలక్ష్మి విశాల్‌ను బహిరంగంగా విమర్శించారు. 

విశాల్ సినీ ప్రయాణం: 

ఈ వ్యక్తిగత వ్యవహారాల మధ్య, విశాల్ వృత్తిపరమైన ప్రయాణం కొనసాగుతుంది. అతని రాబోతున్న నెక్స్ట్ సినిమా “మార్క్ ఆంటోనీ” ఉంది, ఇది రచయిత-దర్శకుడు అధిక్ రవిచంద్రన్ నిర్మిస్తున్న ఒక పీరియడ్ సైన్స్-ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్. ప్రతిభావంతుడైన మిస్కిన్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ “తుప్పరివాలన్” అతని మరొక ప్రాజెక్ట్.

ముఖ్యంగా విశాల్ ఎప్పుడు కూడా తన సినీ రంగంలోనే ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటాడు. తన వ్యక్తిగత జీవితం ఏదిఏమైనాప్పటికీ, ఆయన అందించే సేవా కార్యక్రమాలు ఎన్నో. అంతేకాకుండా హీరో విశాల్ ఏ సినిమా చేసినప్పటికీ అభిమానులు ఎప్పుడూ కూడా తమ అభిమానాన్ని చూపిస్తూనే ఉంటారు. ఆయన ఏ సినిమా చేసినప్పటికీ ఆ సినిమాలో నటించినట్లు అనిపించదు జీవించినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా కామెడీ పరంగా హీరో విశాల్ చాలా బాగా నటిస్తారు. ఆయన నటించిన ప్రతి సినిమాలో ఆయన చూపించిన హీరోయిజంకి ఎంతో మంది అభిమానులు.