విజయ్ ‘అర్జున్‌ రెడ్డి’ ఫ్లేవర్ నుంచి బయటికొస్తున్నాడా?

విజయ్‌ దేవరకొండ  అర్జున్ రెడ్డి ఫ్లేవర్ నుంచి బయటకొస్తున్నట్లు కనిపిస్తుంది. లైగర్‌‌ ఫ్లాప్‌ తర్వాత విజయ్‌ మళ్లీ లవర్ బాయ్‌  సినిమా చేస్తున్నాడు. తన తాజా మూవీ ఖుషి రిలీజ్‌కు రెడీగా ఉంది. దీంతో   విజయ్‌ అర్జున్‌ రెడ్డి ఫ్లేవర్‌‌ నుంచి బయటకొస్తున్నాడని పలువురు అనుకుంటున్నారు.  విజయ్‌ దేవరకొండ… ‘అర్జున్‌రెడ్డి’ సినిమా తర్వాత ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ టైమ్‌లో విజయ్‌ ఎక్కడికి వెళ్లినా జనాలు బ్రహ్మరథం పట్టే వాళ్లు. అంతలా ఆ క్యారెక్టర్‌‌ […]

Share:

విజయ్‌ దేవరకొండ  అర్జున్ రెడ్డి ఫ్లేవర్ నుంచి బయటకొస్తున్నట్లు కనిపిస్తుంది. లైగర్‌‌ ఫ్లాప్‌ తర్వాత విజయ్‌ మళ్లీ లవర్ బాయ్‌  సినిమా చేస్తున్నాడు. తన తాజా మూవీ ఖుషి రిలీజ్‌కు రెడీగా ఉంది. దీంతో   విజయ్‌ అర్జున్‌ రెడ్డి ఫ్లేవర్‌‌ నుంచి బయటకొస్తున్నాడని పలువురు అనుకుంటున్నారు. 

విజయ్‌ దేవరకొండ… ‘అర్జున్‌రెడ్డి’ సినిమా తర్వాత ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ టైమ్‌లో విజయ్‌ ఎక్కడికి వెళ్లినా జనాలు బ్రహ్మరథం పట్టే వాళ్లు. అంతలా ఆ క్యారెక్టర్‌‌ జనాల్లోకి వెళ్లిపోయింది. ఫుల్‌ రస్టిక్‌ లుక్‌తో సీరియస్ యాక్షన్‌తో విజయ్‌ దేవరకొండ అర్జున్‌రెడ్డిలో అదగొట్టేశాడు. ఆ మూవీ తర్వాత వచ్చిన గీతా గోవిందం కూడా విజయ్‌లో మంచి యాక్టర్‌‌ను బయటకు తీసుకొచ్చింది. ఆ సినిమా కూడా సూపర్‌‌ సక్సెస్‌ అయింది. దీంతో తెలుగు ఇండస్ట్రీకి విజయ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ యాక్టర్‌‌ అయిపోయాడు. అర్జున్ రెడ్డి తర్వాత తన యాటిట్యూడ్‌తో కొంతమంది బాగా ట్రోల్ చేశారు. ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రెడ్‌ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రచారం చేసినా.. లాభం లేకుండా పోయింది. దీంతో సినిమా ఫ్లాప్‌  అయింది. దాని తర్వాత వచ్చిన వరల్డ్ ఫేమస్‌ లవర్‌‌ మూవీ కూడా డిజాస్టర్‌‌ అవ్వడంతో దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయాడు. ఆ వెంటనే వచ్చిన ‘లైగర్‌‌’ మూవీ కూడా భారీ డిజాస్టర్‌‌ అయింది. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీపై విజయ్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ కోసం దేశ వ్యాప్తంగా కాళ్లకు చక్రాలు కట్టుకొని ప్రచారం చేశాడు. ప్రతి ఇంటర్వ్యూలో తన యాటిట్యూడ్‌ చూపిస్తూ మాట్లాడేవాడు. అయితే, ఆ సినిమా కూడా భారీ డిజాస్టర్‌‌ అయ్యాక పరిస్థితి మొత్తం మారిపోయింది. అయితే, ఈ సినిమాకు విజయ్‌ పడిన కష్టంపై ప్రశంసలు దక్కాయి కానీ, సినిమా ఫెయిల్‌ అయ్యింది. పలు విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. విజయ్ అర్జున్‌రెడ్డి ఫ్లేవర్‌‌ నుంచి  బయటకు రావాలని సలహా కూడా ఇచ్చారు. 

తాజాగా విజయ్‌ ‘ఖుషి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ప్రేక్షకుల ఇమేజ్‌కి దూరంగా సాఫ్ట్‌ లవర్‌‌ బాయ్‌గా తనను తాను మార్చుకొని ఈ సినిమా చేశాడు. దీనిపై విజయ్‌ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ మూవీని ప్రమోట్‌ చేయడానికి ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో విజయ్ పర్యటిస్తున్నాడు. అయితే, అర్జున్‌ రెడ్డి ప్రభావం విజయ్‌పై చాలా ఉందని, అతన్ని అలాగే, చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని ఒక డిస్ట్రిబ్యూటర్‌‌ చెప్పాడు. విజయ్‌  తాజా సినిమా ‘ఖుషి’లో కూడా అర్జున్‌ రెడ్డిలాగా ఫెరోషియస్‌ లవర్ బాయ్‌గా నటించి ఉంటే అడ్వాన్స్‌ బుకింగ్‌లు దూసుకుపోయేవని అతను అన్నాడు. అయితే, లవర్‌‌ బాయ్‌గా తనను తాను మార్చుకోవడానికి విజయ్ ప్రయత్నిస్తున్నాడని తెలిపాడు. అతను అనవసరంగా ట్రాక్‌లు మారుస్తున్నాడని డిస్ట్రిబ్యూటర్‌‌ పేర్కొన్నాడు. 

అర్జున్‌ రెడ్డి

‘‘అర్జున్‌ రెడ్డి సినిమాలో విజయ్‌ క్యారెక్టర్‌‌, అతను పలికిన డైలాగ్‌లు వల్ల చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు. అప్పట్లో వాటన్నింటికి విజయ్‌ బాగా కౌంటర్‌‌ ఇచ్చాడు. ధైర్యవంతంగా, నిజాయితీగా దూకుడుగా వ్యవహరించే ఆ క్యారెక్టర్‌‌ ను సమాజం జీర్ణించుకోదు. అందుకే ఆ విమర్శల గురించి విజయ్‌ అంతగా పట్టించుకోక పోగా, వాటికి ధీటుగా సమాధాన ఇచ్చాడు. ఆ సినిమా చూశాక విజయ్‌లాగా ఉండాలని చాలా మంది అనుకున్నారు. కానీ, బయట సమాజంలో అలా ఉంటే ఒప్పుకోదు. ఇంట్లో కుటుంబసభ్యుల ఒత్తిళ్ల కారణంగా కూడా నిజజీవితంలో అర్జున్‌ రెడ్డిలాగా మనం ఉండలేం. అయితే, ఈ సినిమా తర్వాత విజయ్‌కు తెలుగుతో పాటు దేశ వ్యాప్తంగా ఏ హీరోకు లేని క్రేజ్‌ ఏర్పడింది. అందుకే రోటిన్‌ లవ్‌ స్టోరీలు, లవర్ బాయ్‌ క్యారెక్టర్లు చేయడం వల్ల విజయ్‌ తన అర్జున్ రెడ్డి సినిమా వల్ల వచ్చిన అభిమానులు వదులుకోకూడదు. లవర్‌‌ బాయ్‌ క్యారెక్టర్లు ఇప్పటికే చాలా మంది చేస్తున్నారు” అని ఆ డిస్ట్రిబ్యూటర్‌‌ చెప్పాడు. 

ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలడు..

‘‘ఆవేశంలో చేసిన ఒక తప్పు వల్ల రష్మికను మేడం.. మేడం.. అంటూ సారీ చెబుతూ ‘గీత గీవిందం’ విజయ్‌ చేసిన పాత్రకు ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి విజయాన్ని సాధించింది. అర్జున్ రెడ్డికి, గీత గోవిందంలో  విజయ్‌ క్యారెక్టర్‌‌ చాలా ట్రాన్స్ ఫార్మ్ అయ్యాడు. ఈ సినిమా చూశాక నటుడిగా విజయ్‌ ఎలాంటి పాత్రనైనా చేయగలనని నిరూపించాడు. అయితే, అర్జున్ రెడ్డి లాగా దూకుడు స్వభావం ఉన్న క్యారెక్టర్‌‌లోనే విజయ్‌ని చాలా మంది ఇష్టపడుతున్నారు. అలాంటి క్యారెక్టర్‌‌నే విజయ్‌ మళ్లీ చేస్తేనే ఫ్యాన్స్‌ లో పాపులారిటీ పెరుగుతుంది. ఇప్పుడు మళ్లీ అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్‌ ప్రేక్షకుల మందుకు రావాల్సి ఉంటుంది” అని ఆ డిస్ట్రిబ్యూటర్‌‌ తెలిపాడు.