Vaishnav Tej: వైష్ణవ్ తేజ్ హిట్ కొట్టేనా!

ఉప్పెన (Uppena) సినిమా (Cinema)తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) తనదైన శైలిలో సినిమా (Cinema)లు తీసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న వైనం కనిపిస్తోంది. అయితే తాను ఇంతకుముందు తీసిన రెండు సినిమా (Cinema)లు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడడంతో తన రాబోయే చిత్రం గురించి మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. సాయి ధరంతేజ్ సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తమ్ముడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) ఇప్పుడు […]

Share:

ఉప్పెన (Uppena) సినిమా (Cinema)తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) తనదైన శైలిలో సినిమా (Cinema)లు తీసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న వైనం కనిపిస్తోంది. అయితే తాను ఇంతకుముందు తీసిన రెండు సినిమా (Cinema)లు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడడంతో తన రాబోయే చిత్రం గురించి మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. సాయి ధరంతేజ్ సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తమ్ముడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ఆదరభిమానాలు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

హిట్ కోసం సకల ప్రయత్నాలు..: 

వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) అతని గత రెండు చిత్రాలు ‘కొండ పొలం’, ‘రంగ రంగ వైభవంగా’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినందున, ఇప్పుడు రాబోయే సినిమా (Cinema) పెద్ద హిట్ (Hit) కోసం ఎదురు చూస్తున్నారు. ‘ఉప్పెన (Uppena)’ వంటి సంచలన విజయంతో కెరీర్‌ను ప్రారంభించినప్పటికీ, మెగా హీరో దానిని నిలబెట్టుకోలేకపోయాడు. వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) పెద్ద హిట్ (Hit) అందుకోవడానికి ఇదే సరైన సమయమని, ఎందుకంటే యువ హీరోల మధ్య పోటీ రోజురోజుకు పెరుగుతోంది అని అందరికీ తెలిసిన విషయమే.

సాఫ్ట్ లవర్‌గా మొదలైన ఈ నటుడు ప్రయాణం ఇప్పుడు తన రాబోయే చిత్రం ‘ఆదికేశవ’లో యాక్షన్ హీరోగా మారాడు. కొత్త అవతార్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆశిస్తున్నాడు. యాక్షన్ పాత్రలు ఎల్లప్పుడూ సవాలుగా ఉంటాయి. చాలా నెమ్మదిగా ఉన్న స్క్రిప్ట్ దగ్గర నుంచి ఇప్పుడు ఒక యాక్షన్ సినిమా (Cinema) పరంగా ఒక యాక్షన్ హీరో స్క్రిప్ట్ లో నటించడానికి ఎన్నో కసరత్తులు చేశాడు వైష్ణవ తేజ్. నిజానికి, మెగా కుటుంబం నుండి వచ్చిన హీరో కాబట్టి తప్పకుండా.. అతనికి కొంత ప్రయోజనాన్ని ఇస్తుంది.

యువ హీరోలు విజయ్ దేవరకొండ (Vijay), సిద్ధు జొన్నళ్లగడ్డ (Sidhu), మరియు నవీన్ పోలిశెట్టి (Naveen) వంటి యువ హీరోలు ప్రస్తుతానికి లవ్ ట్రాక్ మీద సినిమా (Cinema)లు తీస్తున్న వైనంలో, వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) ఇదే అదునుగా తీసుకుని ఇప్పుడు తన యాక్షన్ పాత్రతో మాస్‌ను ప్రయత్నిస్తున్నాడు. బహుశా ప్రముఖ, రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (J. NTR) మరియు అల్లు అర్జున్ (Allu Arjun) యాక్షన్ హీరోల వంటి ప్రముఖులలో చేరాలనుకుంటున్నాడు. అయితే తన సినిమా (Cinema)లో చాలా ఛాలెంజింగ్ పాత్ర పోషిస్తున్న వైష్ణవ తేజ్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూడాలని, తప్పకుండా హిట్ (Hit) కొట్టడానికి ఎదురుచూస్తున్నాడు. 

వైష్ణవ్ తేజ్ గురించి మరింత: 

పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తమ్ముడు. అల్లు-కొణిదెల కుటుంబ సభ్యుడు, చిరంజీవి (Chiranjeevi) మేనల్లుడు. తేజ్ హైదరాబాద్‌లోని నలంద స్కూల్‌లో తన స్కూల్ కి పూర్తిచేసుకుని, హైదరాబాద్‌లోని సెయింట్ మేరీస్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.

పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) రొమాంటిక్ డ్రామా ఉప్పెన (Uppena) (2021)లో కథానాయకుడిగా అరంగేట్రం చేసాడు, ఇది అతనికి ఉత్తమ ఫిల్మ్‌ఫేర్ అవార్డును తెచ్చి పెట్టింది. తరువాత యాక్షన్ థ్రిల్లర్ కొండ పొలం (2021), రంగ రంగ వైభవంగా (2022)లో నటించాడు. అయితే ఈ రెండు చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలవలేకపోయాయి.

తేజ్ తన మామ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దర్శకత్వం వహించి, నటించిన జానీ (2003)లో బాల నటుడిగా కనిపించాడు. తర్వాత చిరంజీవి (Chiranjeevi) నటించిన శంకర్ దాదా M.B.B.S (2004) లో వీల్ చైర్ మీద పిల్లవాడిగా నటించాడు.