స‌లార్ విష‌యంలో సాటిస్‌ఫై అవ్వని ప్రశాంత్ నీల్..

అందరు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా ప్రభాస్ పాన్ ఇండియా సినిమా సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యే క్రమంలో మరో చేదు వార్త అభిమానులను నిరాశపరిచిందనే చెప్పుకోవాలి. కొన్ని కారణాలవల్ల సలార్ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. మరి ఎందుకు వాయిదా పడింది.. రిలీజ్ డేట్ ఎప్పుడు తెలుసుకోవాలంటే.. పూర్తిగా ఈ వార్త చదవాల్సిందే..  సలార్ సినిమా వాయిదా ఇదే కారణాలు:  ప్రభాస్ ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా […]

Share:

అందరు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా ప్రభాస్ పాన్ ఇండియా సినిమా సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యే క్రమంలో మరో చేదు వార్త అభిమానులను నిరాశపరిచిందనే చెప్పుకోవాలి. కొన్ని కారణాలవల్ల సలార్ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. మరి ఎందుకు వాయిదా పడింది.. రిలీజ్ డేట్ ఎప్పుడు తెలుసుకోవాలంటే.. పూర్తిగా ఈ వార్త చదవాల్సిందే.. 

సలార్ సినిమా వాయిదా ఇదే కారణాలు: 

ప్రభాస్ ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమా సలార్ రిలీజ్ వాయిదా పడింది. ఫేమస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ద్వారా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా అనుకోకుండా వాయిదా పడిపోయింది. అభిమానుల ముందుకు సెప్టెంబర్ 28న రావాల్సిన సినిమా, సంవత్సర చివరిలో రిలీజ్ అవ్వబోతున్నట్లు సినిమా టీం ప్రకటించింది. మరింత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్లో ఉండడం కారణంగానే సినిమా వాయిదా పడినట్లు స్పష్టం చేశారు. అయితే సినిమా డిసెంబర్ 2023 గాని, జనవరి 2024 లో గాని రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు సినిమా టీం. 

అయితే నివేదికలు అందించిన సమాచారం ప్రకారం, సినిమా లో కనిపించనున్న ఆనిమేషన్ వర్క్ నిజానికి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని సాటిస్ఫై చేయలేకపోయాయి. ముంబాయికి చెందిన విజువల్ ఎఫెక్ట్స్ టీం ద్వారా రూపొందించబడిన కొన్ని ఫిక్షనల్ సిటీ రూపకల్పన అంత ఎఫెక్టివ్ గా లేదని, అందుకే వాటిపై ముంబై విజువల్ ఎఫెక్ట్స్ టీంకి, ఆయన ఇచ్చిన రిఫరెన్స్ లు ప్రకారం రీ-వర్క్ చేయాలని కూడా ప్రశాంత్ నీల్ కోరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, రివర్క్ అనంతరం, విజువల్ ఎఫెక్ట్స్ తో తాను సాటిస్ఫై అయితే తప్పిస్తే, మరో అడుగు ముందుకు వేసేది లేదు అంటూ, ఎందుకంటే ఈ చిత్రం మీద ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్న అభిమానులకు నిరాశ ఎదురవకూడదు అని ఆలోచనతో తను రిలీజ్ ని వాయిదా వేసి మరీ రీ-వర్క్ చేయించేందుకు డైరెక్టర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

వివిధ దేశాల్లో రిలీజ్: 

ప్రత్యేకించి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న సమయంలో, సినిమా వాయిదా పడింది అని అప్డేట్ ప్రతి ఒక్కరిని నిరాశలోకి తీసుకువెళ్లింది. ముఖ్యంగా ఈ సినిమా వివిధ దేశాలలో యూకే, ఆస్ట్రేలియా, జపాన్ పలు దేశాలలో రిలీజ్ కి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. అయితే డైరెక్టర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం, సినిమా చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే నిజానికి ఇండియాలో రిలీజ్ అవ్వడానికి రెండు రోజులు ముందు మాత్రమే వేరే ఇతర దేశాలలో రిలీజ్ అవ్వడానికి కుదురుతుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేసే ప్రింట్ డౌన్లోడ్ చేసేందుకు ప్రొడ్యూసర్స్ అందించే డిక్రిప్ట్ కీ మాత్రమే పని చేస్తుంది. అయితే రీ క్రియేషన్ మొత్తం పూర్తవ్వడం తర్వాత ఇతర దేశాల్లో డిస్ట్రిబ్యూట్ చేసేందుకు కొంత సమయం అయితే పడుతుంది కాబట్టి, సుమారు వచ్చే సంవత్సరం జనవరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నాయి నివేదికలు.

ప్రభాస్ తర్వాత సినిమా: 

సాలార్ సెప్టెంబర్ 28న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా వాయిదా పడింది. ఈ సంవత్సరం చివరిలో లేదంటే, జనవరి 2024 లో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. సాలార్ తర్వాత, ప్రభాస్ మరో భారీ-బడ్జెట్ చిత్రంతో రాబోతున్నాడు, ప్రాజెక్ట్ కెతో తెరపైకి తిరిగి వస్తాడు. బాహుబలి సిరీస్ అతన్ని సూపర్ స్టార్‌డమ్‌కి నడిపించినప్పటికీ, SS రాజమౌళి చిత్రాల తర్వాత ప్రభాస్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకోలేకపోయాడు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన సాహో, రాధే శ్యామ్ మరియు ఆదిపురుష్ విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మోస్తరు ఆదరణ కేవలం అందుకున్నారు. ఆదిపురుష్ ప్రేక్షకులు ముందు ఆకట్టుకోలేకపోయినప్పటి నుంచి ఇప్పుడు అందరి దృష్టి సాలార్ పైనే ఉంది.