Tharun Bhascker: కీడకోలతో లాభాలు అందుకుంటున్న తరుణ్ భాస్కర్

తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) డైరెక్షన్లో తాజాగా విడుదలైన ‘కీడ కోల’ రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద ఒక మోస్తారులో ఆడినప్పటికీ, దర్శకుడిగా మారిన నటుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) తన కామెడీతో లాభాలను అందుకుంటున్నట్లు సమాచారం. అతను చిత్రాలలో ఎక్కువగా కొత్త నటీనటులు కనిపిస్తుంటారు, ఈ సినిమా (Cinema)లో కూడా కొత్త నటులు ఉన్నారు కాబట్టి తను సినిమా (Cinema)ను 6 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించినట్లు సమాచారం. మరోవైపు సేఫ్ సైడ్ […]

Share:

తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) డైరెక్షన్లో తాజాగా విడుదలైన ‘కీడ కోల’ రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద ఒక మోస్తారులో ఆడినప్పటికీ, దర్శకుడిగా మారిన నటుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) తన కామెడీతో లాభాలను అందుకుంటున్నట్లు సమాచారం. అతను చిత్రాలలో ఎక్కువగా కొత్త నటీనటులు కనిపిస్తుంటారు, ఈ సినిమా (Cinema)లో కూడా కొత్త నటులు ఉన్నారు కాబట్టి తను సినిమా (Cinema)ను 6 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించినట్లు సమాచారం. మరోవైపు సేఫ్ సైడ్ ఉండడానికి చిత్రాన్ని 8 కోట్ల రూపాయలకు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌కు అందించుకున్నాడు. 

లాభాలు అందుకుంటున్న తరుణ్ భాస్కర్: 

తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) చాకచక్యంగా డిజిటల్ హక్కులను రూ. 8 కోట్లకు విక్రయించి, సినిమా (Cinema) విడుదలకు ముందే తన స్నేహితుల పెట్టుబడులను తిరిగి పొందడంలో సహాయం చేశాడు అని నివేదికలు చెబుతున్నాయి. నిజానికి తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) తన ఇతర స్నేహితులతో కలిసి ఈ నవ్వుల అల్లర్లు ఊహించే సినిమా (Cinema) చేయడానికి, డబ్బు ఎక్కువ మొత్తంలో కలెక్ట్ చేసి పూర్తి చేయగలిగాడు. అదే విధంగా ఎలాంటి వృధా లేకుండా సినిమా (Cinema) తీసి, 

తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) ఫలితం దక్కించుకున్నాడని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన సురేష్ బాబు 4 కోట్ల రూపాయలకు థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసి, తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) సినిమా (Cinema)ను రానా బృందం పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తుండగా, మంచి సంఖ్యలో థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేసినట్లు సమాచారం. మొదటి రోజు రూ.50 లక్షలు రాబట్టింది, ముందు ముందు మరి ప్రేక్షకులను ఎలా ఆకర్షిస్తుందో చూడాలి. కథాంశం కంటే హాస్యం మరియు పాత్రల మధ్య ఈగో క్లాష్‌ల నేపథ్యంలో సాగే ఈ సినిమా (Cinema), డిజిటల్ ప్లాట్ ఫామ్ లో చూసేందుకు మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

నిజానికి, తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) తనని తాను టాలెంట్ డైరెక్టర్‌గా నిలబెట్టుకోవడానికి ‘పెళ్లి చూపులు, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి కొత్త-ఏజ్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించాడు. తరువాత, అతను నటుడు వెంకటేష్‌తో ఒక సినిమా (Cinema) చేయవలసి ఉండగా, కొన్ని కారణాలవల్ల అది రెండు సంవత్సరాలు ఆలస్యమైంది. అందుకే మళ్ళీ ఈ మధ్యకాలంలో తన చిన్న చిత్రాలతో మళ్ళీ మన ముందుకు వచ్చాడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker). 

తరుణ్ భాస్కర్ గురించి మరింత: 

తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) తెలుగు సినిమా (Cinema) దర్శకుడు అదేవిధంగా నటుడు. మొదటగా తల్లి రాసిన ఓ కవితను ఓ షార్ట్ ఫిలిం తీసి ఐఐటీ మద్రాసులో జరుగుతున్న సారంగ్ అనే ఉత్సవాల కోసం పంపాడు. అక్కడ దానికి బహుమతి వచ్చింది. అదే ఉత్సాహంతో జర్నీ, సెరెండిపిటీ, మినిట్స్‌ టు మిడ్‌నైట్‌, అనుకోకుండా, సైన్మా లాంటి ఓ షార్ట్ ఫిలింలను రూపొందించాడు. వీటిలో కొన్ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇంఫాల్ ఫిల్మ్ ఫెస్టివల్ లాంటి చిత్రోత్సవాలకు ఎంపికయ్యాయి. జునూన్ అనే సినిమా (Cinema)కు పీపుల్స్ చాయిస్ అవార్డు వచ్చింది. అనుకోకుండా అనే సినిమా (Cinema) యూట్యూబులో ఎక్కువమంది చూడటం జరిగింది. సైన్మాకి కూడా పలు పురస్కారాలు దక్కాయి. ఈ సినిమా (Cinema) చూసిన మంచు లక్ష్మి తనతో ఓ చిత్రానికి పనిచేయమని కోరింది. ఆ సినిమా (Cinema) స్క్రిప్టు పని జరుగుతున్న సమయంలో తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) తండ్రి మరణించడంతో అది వాయిదా పడింది.

2016 లో విడుదలైన పెళ్ళి చూపులు అతని మొదటి సినిమా (Cinema). ఈ సినిమా (Cinema)కు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానే కాక ఉత్తమ మాటల రచయితగా కూడా అతనికి జాతీయ పురస్కారం దక్కేలా చేసింది. 2019 లో తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) మీకు మాత్రమే చెప్తా అనే చిత్రంలో కథానాయకుడిగా నటించాడు. 2020లో వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్ లో అతిథి పాత్ర పోషించాడు. ఈ పెళ్ళి చూపులు సినిమా (Cinema)లో కథా నాయకుడైన విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) ముందు నుంచి స్నేహితుడు కావడంతో ఆ పరిచయంతో నిర్మాత రాజ్ కందుకూరిని కలిసి అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. తన మొదటి సినిమా (Cinema)కే జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు.