ఆరు నెలలు బ్రేక్ తీసుకోనున్న సాయి ధరమ్ తేజ్..!

సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న సాయి ధరమ్ తేజ్.. కారణం..? టాలీవుడ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్  మేనల్లుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. సాయి ధరంతేజ్ , పవన్ కళ్యాణ్ కలయికలో తెరకెక్కుతున్న తమిళ్ రీమేక్ మూవీ ” బ్రో ” . తమిళ్ వర్షన్ నీ డైరెక్ట్ చేసిన సముద్రఖని.. ఈ రీమేక్ ని […]

Share:

సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న సాయి ధరమ్ తేజ్.. కారణం..?

టాలీవుడ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్  మేనల్లుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. సాయి ధరంతేజ్ , పవన్ కళ్యాణ్ కలయికలో తెరకెక్కుతున్న తమిళ్ రీమేక్ మూవీ ” బ్రో ” . తమిళ్ వర్షన్ నీ డైరెక్ట్ చేసిన సముద్రఖని.. ఈ రీమేక్ ని కూడా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఈ నెల 28న రిలీజ్ కి సిద్ధమవుతుంది. దీంతో సాయి ధరంతేజ్ ప్రమోషన్స్ పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు.ఈ ఇంటర్వ్యూలో తాను ఆరు నెలలు గ్యాప్ తీసుకోబోతున్నట్లు వెల్లడించాడు.  సాయి ధరమ్  తేజ్ బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే.. ఆ ప్రమాదంతో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈయన ఇటీవలే  విరూపాక్ష సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. మూడు నెలల గ్యాప్ తో మళ్ళీ బ్రో మూవీ ని కూడా తీసుకురావడంతో అభిమానులు హ్యాపీ ఫీలయ్యారు. 

ఇకపోతే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సినిమాలకు గ్యాప్ తీసుకోబోతున్నాడు అని తెలిసి అభిమానుల సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అయితే ఉన్నట్టుండి ఇలా ఆయన సినిమాలకు బ్రేక్ తీసుకోవడానికి కూడా ఒక కారణం ఉందట. ఎందుకంటే బైక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు స్టెరాయిడ్స్ ఎక్కువగా ఇచ్చారని వాటి ప్రభావం ఇంకా తన బాడీ లో అలాగే ఉంది అని శరీరం పైన ఆ ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.  ఇటీవల బ్రో సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేయగా అందులో సాయి ధరంతేజ్ డాన్స్ మూమెంట్స్ ఏమీ లేకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఇక ఈ సమయంలోనే తాను పడుతున్న ఆరోగ్య ఇబ్బందుల గురించి వెల్లడిస్తూ త్వరలోనే మీ ముందుకి మళ్ళీ మునుపటి సాయి ధరంతేజ్ లాగా మారి వస్తానని చెప్పుకొచ్చాడు .. అందుకే  ఈ సినిమా తర్వాత ఆరు నెలల పాటు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు వెల్లడించి అందరిని షాక్ కి గురి చేశాడు. 

సాయిధరమ్ తేజ్ ఆ బైక్ యాక్సిడెంట్ నుంచి ఇంకా రికవరీ అవ్వలేదట.. దానిని నుంచి కోలుకోవడానికి కొంత సమయం తీసుకోవాలని అనుకుంటున్నాడట.. అలాగే ప్లేట్స్ తొలగించడానికి ఒక చిన్న సర్జరీ కూడా ఉన్నట్లు వెల్లడించాడు. కాబట్టి ఒక ఆరు నెలల పాటు గ్యాప్ తీసుకుని కంప్లీట్ రెస్ట్ లో ఉండి పూర్తిగా కోలుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ప్రెసెంట్ ఎటువంటి సినిమా కథలు కూడా వినలేదని, అయితే ఈ మధ్యలో తన ఫ్రెండ్స్ తో కలిసి చేసిన ఒక షార్ట్ ఫిలిం ని మాత్రం ఇండిపెండెన్స్ రోజు రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. సైనికుల భార్యలు తమ భర్తలను దేశం కోసం పంపించేటువంటి త్యాగం చేస్తున్నారో..?  అనేది ఆ షార్ట్ ఫిలిం స్టోరీ అంట… ఇకపోతే సాయి ధరంతేజ్ త్వరగా రికవరీ అయ్యి మళ్లీ ఒక గొప్ప కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇక త్వరలోనే ఆయన మళ్లీ మన ముందుకు వచ్చా అవకాశాలు ఉన్నాయన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.