మెగా ఇంట్లో అడుగుపెట్టే ముందు లావణ్య త్రిపాఠి కీలక నిర్ణయం..!

మరికొద్ది రోజుల్లోనే మెగా కుటుంబంలో అడుగుపెట్టబోతున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ప్రస్తుతం సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. నాగబాబు తనయుడు, హీరో వరుణ్ తేజ్‌ని ప్రేమించిన లావణ్య త్రిపాఠి ఆయనతో మూడు ముళ్లబంధంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరగనుందని టాక్. మెగా ఫ్యామిలీకి సినిమా బ్యాక్ గ్రౌండ్ చాలా ఎక్కువ. అలాగే మొదటి నుంచి లావణ్య త్రిపాఠి కూడా […]

Share:

మరికొద్ది రోజుల్లోనే మెగా కుటుంబంలో అడుగుపెట్టబోతున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ప్రస్తుతం సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. నాగబాబు తనయుడు, హీరో వరుణ్ తేజ్‌ని ప్రేమించిన లావణ్య త్రిపాఠి ఆయనతో మూడు ముళ్లబంధంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరగనుందని టాక్.

మెగా ఫ్యామిలీకి సినిమా బ్యాక్ గ్రౌండ్ చాలా ఎక్కువ. అలాగే మొదటి నుంచి లావణ్య త్రిపాఠి కూడా గ్లామర్ ఇండస్ట్రీలో ఉంది. హీరోయిన్ గా పలువురు యువ హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది. అయితే ఇప్పుడు మాత్రం ఆమె కెరీర్ పరంగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మెగా ఫ్యామిలీలో అడుగుపెడుతోంది కాబట్టి ఇప్పటినుంచే జాగ్రత్త పడుతోందట లావణ్య. మెగా కోడలయ్యాక మెగా ఫ్యాన్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని సినిమా ఆఫర్స్ ఓకే చేయాలి. పెద్దింటి కోడలిగా ఫ్యాన్స్‌ని నొప్పించే ఏ పని చేసినా అది పెద్ద రచ్చ అయ్యే ప్రమాదం ఉంది.మరీ ముఖ్యంగా గతంలో మాదిరి బోల్డ్ రోల్స్, సిల్వర్ స్క్రీన్ రొమాన్స్ చేయడం అనేది పెద్ద సాహసం అవుతుంది. మెగా కోడలిగా ఫ్యాన్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేయక తప్పదు. లేదంటే తేడా కొడుతుంది. ఈ నేపథ్యంలో ఇకపై తాను చేయబోయే సినిమాలపై ఓ స్ట్రాంగ్ డిసీజన్ తీసుకుందట లావణ్య.

వరుణ్ తేజ్ తో నిశ్చితార్థం చేసుకున్న లావణ్య త్రిపాఠి.. ఈ నిశ్చితార్థం కాగానే ఇప్పటికే కమిటైన కొన్ని సినిమాలు రిజెక్ట్ చేసిందట. కొన్ని నెలల క్రితం ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆమె.. ఈ వెబ్ సిరీస్ లో తన రోల్ కాస్త బోల్డ్ గా ఉండటంతో కుదరదని తెగేసి చెప్పిందట. ఈ మేరకు సదరు చిత్ర టీంకి అడ్వాన్స్ తిరిగి ఇవ్వడంతో పాటు తనకు బదులుగా మరో హీరోయిన్ ను తీసుకోవాలని కోరిందట. త్వరలో మెగా ఇంటికి కోడలు కానుండటంతో లావణ్య త్రిపాఠి ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుండటం హాట్ టాపిక్ అయింది.

గతంలో అక్కినేని ఫ్యామిలీలో సమంత ఎంట్రీ ఇచ్చాక ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయో చూసే ఉన్నాం. పెళ్లి తర్వాత సమంత చేసిన కొన్ని రోల్స్ అక్కినేని అభిమానులను హర్ట్ చేశాయి. చివరకు సమంత వైవాహిక బంధం బ్రేకప్ కావడం, దానికి ఆమె చేసిన బోల్డ్ రోల్స్ కూడా ఓ కారణం అనే టాక్ స్ప్రెడ్ కావడం చూశాం. ఈ నేపథ్యంలో ఆ భయంతోనే పెళ్లికి ముందే లావణ్య ఇలాంటి నిర్ణయం తీసుకుందని కొందరు చెప్పుకుంటున్నారు.

చాలా రోజులుగా వరుణ్ తేజ్ తో సీక్రెట్ లవ్ ఎఫైర్ నడిపించింది లావణ్య త్రిపాఠి. అయితే ఈ సీక్రెట్ రివీల్ చేస్తూ జూన్ 9న ఈ ప్రేమ పక్షులు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.

రీసెంట్ గానే లావణ్యతో ప్రేమ సంగతులపై ఓపెన్ అయ్యారు వరుణ్ తేజ్. దాదాపు ఐదారేళ్ల నుంచి తామిద్దరం స్నేహితులమని చెప్పిన వరుణ్ తేజ్.. తన ఇష్టాఇష్టాలన్నీ లావణ్యకు తెలుసు అని చెప్పారు. మొదట తానే ప్రపోజ్ చేశానని లవ్ సీక్రెట్ చెప్పిన మెగా వారసుడు.. ఇద్దరి అభిరుచులు కలవడంతోనే రిలేషన్ షిప్‌లోకి వెళ్లినట్లు చెప్పారు.

అప్పటినుంచి తమ మధ్య లవ్ ఎఫైర్ మొదలైందని వరుణ్ తేజ్ అన్నారు. ఇరు కుటుంబాలు తమ నిర్ణయాన్ని అంగీకరించాయని అన్నారు. తాను వాడుతున్న ఫోన్‌ని కూడా లావణ్య గిఫ్ట్ గా ఇచ్చిందని చెప్పారు వరుణ్. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంటగా మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ కానప్పటికీ వరుణ్- లావణ్య కెమిస్ట్రీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 కాగా.. ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారట వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం అందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు టాక్. నవంబర్ నెలలో ఈ పెళ్లి జరగనుందట.