రూపాలి బరువా ని రెండో పెళ్లి చేసుకొని ఈ మధ్యే ఆశిష్ విద్యార్థి వార్తల్లోకి ఎక్కాడు. ఆశిష్ విద్యార్థి ఈ మధ్య మీడియాకి ఒక లెటర్ రాశాడు. ఆశిష్ విద్యార్థి 1991లో కాల్ సంధ్య అనే మూవీ తో తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. ఆశిష్ విద్యార్థి ఈమధ్యే ఒక లెటర్ పోస్ట్ చేశాడు. ఆశిష్ విద్యార్థి తన సినీ ప్రస్థానానికి సంబంధించిన చాలా విషయాలను ఇందులో పంచుకున్నాడు. తాను ఎదుర్కొన్న ఆన్లైన్ ట్రోలింగ్ గురించి కూడా ఇందులో తెలిపాడు.
తాను రెండు పెళ్లి విషయంలో చాలా ట్రోలింగ్ గురయ్యానని ఆశీష్ విద్యార్థి వాపోయాడు. ఇందులో తను నటించిన చిత్రాల గురించి షేర్ చేసుకున్నాడు. తను యాక్టింగ్ చేయడానికి ఎప్పుడు సిద్ధమే అని మరోసారి స్పష్టం చేశాడు. తాను యాక్టింగ్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పాడు. ఆశిష్ విద్యార్థి తాను చేసిన నెగిటివ్ పాత్రలకు అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వచ్చేదని అభిప్రాయపడ్డాడు. ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ పాత్రలు చేసినందుకు ఆనందంగా ఉందని చెప్పాడు.
ఇంకా ఆశిష్ విద్యార్థి గతంలో చాలా అద్భుతమైన చిత్రాల్లో నటించాడు. తెలుగులో ఉదయ్ కిరణ్ తో నటించిన శ్రీరామ్ లో తను భయంకరమైన విలనిజం చూపించాడు. పోకిరి సినిమాలో తన యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆశీష్ విద్యార్థి కొన్ని చిత్రాల్లో కామెడీ విలన్ పాత్రలు కూడా చేశాడు. ఆశిష్ విద్యార్థి ఒక విలక్షణమైన నటుడు.
కరోనా కాలంలో తాను ఎక్కువగా బయట ఫుడ్ తింటూ వీడియోలు చేస్తూ బిజీగా గడిపాడు. ఆశిష్ విద్యార్థి ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఇలాంటి వీడియోలే చేస్తూ ఉన్నాడు.
పోకిరి, శ్రీరామ్, అతిధి, గుడుంబా శంకర్.
ఆశిష్ విద్యార్థి మహేష్ బాబుతో అతిధి, పోకిరి లాంటి చిత్రాల్లో నటించాడు. ఆశీష్ విద్యార్థి తన నటనతో ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. విభిన్నమైన షెడ్స్ ఉన్న పాత్రలు ఆశిష్ విద్యార్థికి కొట్టినపిండి. చాలా చిత్రాల్లో తను చేసిన పాత్రలు చూసి ప్రేక్షకులకు కోపం వస్తుంది, తను పాత్రలో అంతగా ఒదిగిపోతాడు. ఆశిష్ విద్యార్థి ప్రస్తుత వయసు 61 సంవత్సరాలు.తను రెండవ పెళ్లి చేసుకున్నందుకు తనని చాలా రకాలుగా ట్రోల్ చేశారని అన్నాడు.
ఆశిష్ విద్యార్థి ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమాలు చేయట్లేదు. కెరియర్ మొదట్లో తను క్రూరమైన విలన్ పాత్రలు చేసేవాడు. తర్వాత కొద్దిగా మార్చి కామెడీ విలన్ పాత్రలు చేయడం మొదలుపెట్టాడు. ఆశిష్ విద్యార్థికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. బాద్షా చిత్రంలో తన పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. తను ఎన్టీఆర్ తో కలిసి కంత్రి, బాద్షా లాంటి చిత్రాల్లో నటించాడు.
తమిళంలో కూడా ఆశిష్ విద్యార్థికి మంచి పేరుంది. విశాలాంటి నటులతో కలిసి తను చాలా చిత్రాలు చేశాడు. తమిళ్ లో కూడా తన నటనకు చాలా అవార్డులు వచ్చాయి. తన పాత్రతో సినిమాకే అట్రాక్షన్ అయ్యే ఆశిష్ విద్యార్థి గారు మరోసారి వెండి తెర మీద మరిన్ని చిత్రాలు చేయాలని మరోసారి కోరుకుందాం.