పొలిటికల్ లీడర్లను నేనేం అనలేదు: కాజోల్

నేను ఎడ్యుకేషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నానని. ఏ పొలిటికల్ లీడర్ లని తాను ఏమనట్లేదని కాజోల్ పేర్కొన్నారు. నేను పొలిటికల్ లీడర్ లను ఏం అనట్లేదు. నేను ఎడ్యుకేషన్  గురించి మాత్రమే మాట్లాడుతున్నా.  చదువుకుంటే మార్పు వస్తుంది అంటున్న కాజోల్: భారత దేశంలో మార్పు అనేది చాలా కష్టం. ఇక్కడ మార్పు చాలా మెల్లగా జరుగుతుంది. అందరూ చదువుకుంటే దేశెలో మార్పు వస్తుంది. మన ఇండియాలో పొలిటికల్ లీడర్లకు చదువు అనేది ఉండదు. నేను చాలామంది లీడర్లని […]

Share:

నేను ఎడ్యుకేషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నానని. ఏ పొలిటికల్ లీడర్ లని తాను ఏమనట్లేదని కాజోల్ పేర్కొన్నారు. నేను పొలిటికల్ లీడర్ లను ఏం అనట్లేదు. నేను ఎడ్యుకేషన్  గురించి మాత్రమే మాట్లాడుతున్నా. 

చదువుకుంటే మార్పు వస్తుంది అంటున్న కాజోల్:

భారత దేశంలో మార్పు అనేది చాలా కష్టం. ఇక్కడ మార్పు చాలా మెల్లగా జరుగుతుంది. అందరూ చదువుకుంటే దేశెలో మార్పు వస్తుంది. మన ఇండియాలో పొలిటికల్ లీడర్లకు చదువు అనేది ఉండదు. నేను చాలామంది లీడర్లని చూసాను చదువుకోకపోవడం వల్ల వాళ్లకు కొన్ని విషయాలు తెలియవు. అదే చదువుకొని ఉంటే అన్ని విషయాలు తెలిసేవి అని నేను అంటున్నా. నేను వాళ్ళు చదువుకోలేదని తక్కువ చేసి మాట్లాడట్లేదు. చదువుకుంటే బాగుండేదని మాత్రమే చెప్తున్నా. కాజోల్ నటిస్తున్న ది ట్రయల్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. 

కాజోల్ సినీ కెరీర్:

షారుక్ ఖాన్,  కాజోల్ ది హిట్ పెయిర్, వాళ్లు నటించిన చిత్రాలన్నీ హిట్ సినిమాలే. కాజోల్ షారుక్ ఖాన్ జంటగా నటించిన దిల్వాలే దుల్హనియా లేజాయింగే బాలీవుడ్ లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఈ సినిమా బాలీవుడ్ పొజిషన్ నే మార్చింది. బాలీవుడ్ లో షారుక్ ఖాన్ మంచి పొజిషన్లో ఉండడానికి కారణం ఈ సినిమా. కాజోల్ నటుడు అజయ్ దేవగణ్ ని పెళ్లి చేసుకుంది. కాజోల్ నటించిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి వాళ్ళతో కాజోల్ సినిమాలు చేసింది. షారుక్ ఖాన్ విషయానికి వస్తే తను రీసెంట్ గా నటించిన పఠాన్ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సినిమా. ఈ సినిమా 2023 లో బాలీవుడ్ కి పెద్ద విజయాన్ని అందించింది. ఈ సినిమా  సాధించిన విజయంతో బాలీవుడ్ కి ఊపొచ్చింది. ఇకపోతే కాజోల్ తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సక్సెస్ సాధించింది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ని పెళ్లి చేసుకున్నాక కూడా తన సినీ కెరీర్ కంటిన్యూ చేసింది. మంచి మంచి చిత్రాల్లో నటించింది. షారుక్ ఖాన్ లాంటి నటులతో తను నటించిన చిత్రాలకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. కాజోల్ లాంటి వాళ్లు మార్పు గురించి చేసిన కామెంట్స్ కొంతమంది నైనా మారుస్తాయి. 

మనదేశంలో చాలా విషయాలకు క్వాలిఫికేషన్స్ ఉంటాయి. కానీ రాజకీయాలకు మాత్రం క్వాలిఫికేషన్స్ ఉండవు. ప్రతి ఒక్కళ్ళు రాజకీయం చేస్తారు. చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే సొసైటీ లో చాలా మార్పు ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు కూడా చాలా మోడ్రన్ గా ఉంటాయి. ఇలాంటి మోడ్రన్ వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే దేశం చాలా విషయాల్లో మారుతుంది. కాజోల్ చేసిన కామెంట్స్ దీని గురించే. చదువుకున్న వాళ్ళకి ఏం చేస్తే ఏమవుతుందో ఒక క్లారిటీ ఉంటుంది. అదే చదువుకొని వాళ్లకు అలాంటి క్లారిటీ ఉండదు. అందుకే మన దేశం ఇంకా చాలా రంగాల్లో వెనకబడే ఉంది. ముందు ముందు అయినా చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి దేశ భవిష్యత్తును మారుస్తారని ఆశిద్దాం. చదువుకున్నవాళ్లు రాజకీయాల్లోకి వస్తే చాలా విషయాల్లో మార్పులు వస్తాయి. భవిష్యత్తులో అది జరగాలని కోరుకుందాం.