పుష్ప డైరెక్టర్ సుకుమార్‌ ఇంట్లో ఐటీ రైడ్స్?

టాలీవుడ్ క్రేజీ దర్శకుడు  సుకుమార్‌ ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నట్లు కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా డైరెక్టర్‌గా సుకుమార్  గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ..పుష్ప2 తో గ్లోబల్ ఇండియన్ సినిమా మార్కెట్‌కు గురి పెట్టారు సుకుమార్. అయితే ఈ క్రమంలోనే డైరెక్టర్ సుమార్ జీఎస్టీ(GST) సరిగా కట్టలేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో  ఆయన ఇంట్లో ఆదాయ పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాదు సుకుమార్ ఇంటితో పాటు “మైత్రి […]

Share:

టాలీవుడ్ క్రేజీ దర్శకుడు  సుకుమార్‌ ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నట్లు కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా డైరెక్టర్‌గా సుకుమార్  గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ..పుష్ప2 తో గ్లోబల్ ఇండియన్ సినిమా మార్కెట్‌కు గురి పెట్టారు సుకుమార్. అయితే ఈ క్రమంలోనే డైరెక్టర్ సుమార్ జీఎస్టీ(GST) సరిగా

కట్టలేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో  ఆయన ఇంట్లో ఆదాయ పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాదు సుకుమార్ ఇంటితో పాటు “మైత్రి మూవీ మేకర్స్‌” ఆఫీసుల్లో కూడా సోదాలు కొనసాగుతున్నట్లుగా  వార్తలు వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సుమారు 700 కోట్ల రూపాయలు అనేక రూపాల్లో డబ్బు సమకూర్చుకొని జీఎస్టీ కట్టలేదనే ఆరోపణలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

 ఈక్రమంలోనే అటు డైరెక్టర్, ఇటు ప్రొడ్యూసర్‌ ఆఫీసులు, ఇళ్లపై సోదాలను ఐటీ శాఖ అధికారులు నిర్వహిస్తున్నారు. కీలక పత్రాలను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అటు సుకుమార్ అభిమానులు ఐటి దాడులపై కొంత నిరాశగా ఉన్నారు. కాగా సుకుమార్, మైత్రీ మూవీ కాంబినేషన్‌లోనే పుష్ప2 సినిమా తెరకెక్కుతోంది.

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ  2015లో చలనచిత్రాలను నిర్మించడం ప్రారంభించింది. టాలీవుడ్ పరిశ్రమలో అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించింది. వారి విజయవంతమైన లీస్టులో శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన, పుష్ప: ది రైజ్, సర్కారు వారి పాట, వీర సింహారెడ్డి మరియు వాల్తేర్ వీరయ్య ఉన్నాయి. 

దర్శకుడి నుంచి నిర్మాతగా సుకుమార్ ప్రయాణం…..

సుకుమార్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జగడంతో కెరియర్ మొదలుపెట్టారు. మొదట్లో తన క్రియేటివిటీతో సినిమాలు తీసిన దర్శకుడు.. ఆ తర్వాత కంటెంట్‌ మార్చుతూ భారీ సినిమాలను, కమర్షియల్‌గా హిట్‌ ఫార్ములా ఉన్న సినిమాలకు దర్శకత్వం వహించారు. రంగస్థలంతో బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్, తర్వాత అల్లు అర్జున్‌తో fపుష్ప సినిమా తీసి ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో పేరు తెచ్చుకున్నారు. తాజాగా విరూపాక్ష సినిమాకు దర్శకుడు  సుకుమార్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సుకుమార్‌ ప్రస్తుతం “పుష్ప 2: ది రూల్” నిర్మాణంలో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన “పుష్ప 2: ది రైజ్” ఈ ఫ్రాంచైజీ యొక్క మొదటి భాగం, పుష్ప 1: ది రైజ్ బ్లాక్‌బస్టర్‌ అవడం వల్ల ఇది చాలా అంచనాలు ఉన్న సినిమాలలో ఒకటిగా ఉంది. పుష్ప కరోనా మహమ్మారి తర్వాత విడుదలైంది. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందాన, మరియు మెయిన్ విలన్‌గా ఫహద్ ఫాసిల్‌తో పాటు ఎందరో పెద్ద నటులు కూడా నటించారు. 

2023లో అత్యధికంగా ఎదురుచూస్తున్న చిత్రంలో పుప్ప2 కూడా ఉందని ఒక సర్వేలో వెల్లడైంది.. ఈ సంవత్సరంలో అత్యధికంగా ఎదురుచూస్తున్న 5 చిత్రాలపై సర్వే నిర్వహించిన తర్వాత ఓర్మాక్స్ మీడియా ఈ ఫలితాన్ని ప్రకటించింది. ఈ జాబితాలో పుష్ప 2 అగ్రస్థానంలో ఉండగా, అక్షయ్ కుమార్ హేరా ఫేరి 3, షారుఖ్ ఖాన్ జవాన్, సల్మాన్ ఖాన్ టైగర్ 3 మరియు కార్తీక్ ఆర్యన్ భూల్ భులైయా 3 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.