అన్నయ్య అని కీర్తి సురేశ్ ఎక్కడ అంటుందోనని తెగ భయపడ్డాను

వాల్తేరు వీరయ్యతో సూపర్‌‌ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు ‘భోళా శంకర్‌‌’గా మరోసారి ప్రేక్షకులను, తన అభిమానులను పలకరించబోతున్నారు. మరో మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతోందీ సినిమా. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పలు అంశాలపై సుదీర్ఘంగా చిరంజీవి మాట్లాడారు. భోళా శంకర్‌‌లో తన సోదరిగా నటించిన కీర్తి సురేశ్‌పై జోక్ చేశారు.  గుండె కలుక్కుమంటుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి, కీర్తిసురేశ్‌తోపాటు సుశాంత్ అక్కినేని, అల్లు అరవింద్, డైరెక్టర్ మెహర్ […]

Share:

వాల్తేరు వీరయ్యతో సూపర్‌‌ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు ‘భోళా శంకర్‌‌’గా మరోసారి ప్రేక్షకులను, తన అభిమానులను పలకరించబోతున్నారు. మరో మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతోందీ సినిమా. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పలు అంశాలపై సుదీర్ఘంగా చిరంజీవి మాట్లాడారు. భోళా శంకర్‌‌లో తన సోదరిగా నటించిన కీర్తి సురేశ్‌పై జోక్ చేశారు. 

గుండె కలుక్కుమంటుంది..

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి, కీర్తిసురేశ్‌తోపాటు సుశాంత్ అక్కినేని, అల్లు అరవింద్, డైరెక్టర్ మెహర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిరు, కీర్తి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సందర్బంగా మెగాస్టార్ మాట్లాడుతూ.. కీర్తి సురేశ్‌పై ప్రశంసలు కురిపించారు. కీర్తి అద్భుతమైన నటి అని కొనియాడారు. ‘‘మా ఇంట్లో బిడ్డలా అనిపిస్తుంది. సినిమాలో ఇద్దరం అన్నా చెల్లెల్లా నటించాం. అన్నయ్య అని కీర్తి సురేశ్ ఎక్కడ అంటుందోనని భయపడ్డాను. మెహర్‌‌ రమేశ్‌ను అన్నయ్య అంటే ఓకే కానీ నన్ను మాత్రం అన్నయ్య అనకు అని చెప్పాను. నన్ను అన్నయ్య అనే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇంత టాలెంట్ ఉన్న అమ్మాయి అన్నయ్య అంటే కష్టం కదా. అందుకే మొదటి రోజే అలా పిలవొద్దని చెప్పాను” అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇంత అందమైన అమ్మాయి అన్నయ్య అంటే గుండె కలుక్కుమంటుందని అన్నారు. కీర్తితో నటించిన సమయం అంతా నది మీద పడవ ప్రయాణంలా సాగిందని చిరు అన్నారు.  లవ్ యూ డార్లింగ్ అని అన్నారు.

గతంలో జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌ను చిరు పంచుకున్నారు. ‘‘మా ఇంట్లో తమిళనాడుకు చెందిన వంట మనిషి ఉన్నాడు. కీర్తికి కావాల్సిన భోజనం అతనే పంపేవాడు. తినేది తక్కువే అయినా కీర్తి చాలా వెరైటీలు కావాలని అడిగేది. ఉప్పు, కారం తగ్గితే ఫుడ్‌ను వెనక్కి పంపి.. మళ్లీ సరిగ్గా చేయమనేది. అలా ఒకసారి షూట్‌లో బిజీగా ఉన్న టైమ్‌లో కీర్తి నా దగ్గరికి వచ్చి.. ‘రేపు మెనూ ఏంటి?’ అని అడిగింది. నాకు అప్పుడు కోపమొచ్చి.. ఫన్నీగా కీర్తి పీక పట్టుకున్నా. ఆ సమయంలో షాట్ తీశారు’’ అని మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు.

రీమేక్ చేస్తే తప్పేంటి?

మంచి కంటెంట్ ఉన్నప్పుడు రీమేక్ చేస్తే తప్పేంటని మెగాస్టార్ చిరంజీవి ప్రశ్నించారు. ‘‘మంచి కంటెంట్ ఉన్నప్పుడు రీమేక్ చేయడంలో తప్పులేదు. కథ నాకు నచ్చింది.. ప్రేక్షకులకు నచ్చుతుందని భావించాను. గొప్ప కథను తెలుగు ప్రేక్షకులకు అందించాలే తపనతో ఈ సినిమాను చేశాను. దర్శకుడు మెహర్ రమేశ్ ఈ చిత్రానికి పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. భోళా శంకర్.. తమిళ మాతృక ‘వేదాళం’ సినిమా ఏ ఓటీటీ వేదికలోనూ లేదు. ఎవరూ చూసి ఉండరు. ఆ నమ్మకంతోనే ఈ సినిమాను చేశాం. కాబట్టి ప్రేక్షకులు కొత్త కథగానే ఫీల్ అవుతారు” అని చెప్పారు.  

‘‘మొన్న ‘బ్రో’ సినిమా వేడుకలో పవన్ కల్యాణ్ చెప్పినట్లు సినీ ఇండస్ట్రీ ఏ ఒక్కరి సొత్తూ కాదు. కొత్త ప్రతిభను ప్రోత్సహించడం నా బాధ్యతగా భావిస్తున్నా. నేను చిన్న పాత్రలు చేసి హీరోగా ఎదిగాను. నన్ను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతగా ఉంటాను” అని అన్నారు. 

గతంలో చిరంజీవి రీ ఎంట్రీగా ప్రతిష్ఠాత్మకంగా వచ్చిన ఖైదీ నంబర్ 150, ఇటీవలి గాడ్‌ఫాదర్ సినిమాలు రీమేక్‌లే. దీంతో మెగాస్టార్‌‌పై విమర్శలు వచ్చాయి. ప్రతిసారి రీమేక్ చేయడమేంటని ప్రశ్నలు వచ్చాయి. దీంతో తాజాగా మరోసారి చిరు క్లారిటీ ఇచ్చారు. ఇక వేదాళం సినిమా గతంలో తమిళంలో బ్లాక్ బస్టర్. అజిత్ హీరోగా వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.