ఇలియానాకు కాబోయే భ‌ర్త ఇత‌నేనా?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తొలి సినిమాతోనే ఒక స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి హీరోయిన్స్ కి ఎప్పటికీ కూడా క్రేజ్ తగ్గదు , వాళ్ల బ్రాండ్ ఇమేజి కి మార్కెట్ డిమాండ్ స్థిరం గా ఉంటుంది. అలా కేవలం మొదటి సినిమాతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్న హీరోయిన్స్ లో ఒకరు గోవా బ్యూటీ ఇలియానా.  వై వీ ఎస్ చౌదరి దర్శకత్వం లో తెరకెక్కిన ‘దేవదాసు’ […]

Share:

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తొలి సినిమాతోనే ఒక స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి హీరోయిన్స్ కి ఎప్పటికీ కూడా క్రేజ్ తగ్గదు , వాళ్ల బ్రాండ్ ఇమేజి కి మార్కెట్ డిమాండ్ స్థిరం గా ఉంటుంది. అలా కేవలం మొదటి సినిమాతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్న హీరోయిన్స్ లో ఒకరు గోవా బ్యూటీ ఇలియానా.  వై వీ ఎస్ చౌదరి దర్శకత్వం లో తెరకెక్కిన ‘దేవదాసు’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా ఇలియానా ఆ సినిమా సంచలన విజయం సాధించడం తో , రెండవ సినిమాకే ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటించే చాన్సు కొట్టేసింది. వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘పోకిరి’ చిత్రం ఆరోజుల్లో ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని తిరగరాసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

బాలీవుడ్ వెళ్ళాక కెరీర్ నాశనం :

టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని అందుకొని సుమారుగా దశాబ్దం పాటు ఒక వెలుగు వెలిగింది. ఒక రామ్ చరణ్ తో తప్ప ఈమె నేటి తరం స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. సౌత్ లో ఒక వెలుగు వెలుగుతున్న సమయం లోనే ఆమెకి బాలీవుడ్ నుండి పిలుపు వచ్చింది. అదే ఆమె కొంప మంచిది అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అక్కడ ఈమె చేసిన సినిమాలన్నీ వరుసగా ఒకదానిని తర్వాత ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీనితో ఆమెకి బాలీవుడ్ లో అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ఇక ప్రతీ ఏడాది టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ వస్తూనే ఉంటారు. ఇలియానా బ్రాండ్ కి ఇప్పటికీ విలువ ఉన్నా కూడా, స్టార్ హీరోలయు మాత్రం ఆమె తో చెయ్యడానికి ఆసక్తి చూపడం లేదు, దీనితో ఈమె ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది.

ప్రియుడిని పరిచయం చేసిన హాట్ బ్యూటీ :

అయితే ఇంస్టాగ్రామ్ ద్వారా ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఇలియానా , గత కొంతకాలం క్రితం తాను కడుపుతో ఉన్నట్టు గా అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చింది. పెళ్లి కాకముందే తల్లిని అయ్యాను అంటూ ఆమె పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మగవాడితో సంబంధం లేకుండా ఇలియానా ఒక బిడ్డకు ఎలా జన్మని ఇవ్వబోతుంది?, ఆమె గర్భం లోకి అత్యాధునిక పద్దతి ద్వారా వీర్యం పంపించారా?, అందువల్లే ఆమెకి గర్భం కలిగిందా?, లేదా ఆమె ఎవరితోనైనా డేటింగ్ చేస్తుందా?, చేస్తే ఇప్పటి వరకు సోషల్ మీడియా లో అతని ఫోటోలు ఎందుకు పెట్టలేదు?, అతనిని సీక్రెట్ గా ఉంచాల్సిన అవసరం ఏమిటి?, ఇలా ఎన్నో ప్రశ్నలు అభిమానుల మెదడు ని తొలిచేశాయి. అయితే వాళ్ళందరి ప్రశ్నలకు సమాధానం చెప్పకనే చెప్పింది ఇలియానా. తన బాయ్ ఫ్రెండ్ పెంపుడు కుక్కని ముద్దాడుతున్న సమయం లో అతని ఫోటో తీసి ఇంస్టాగ్రామ్ లో ‘పప్పీ లవ్’ అంటూ పరిచయం చేసింది. ఇందులో అతని ముఖం కనిపించలేదు కానీ, తాను కృతిమంగా బిడ్డని కనడం లేదని, తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఈ స్టోరీ ద్వారా అభిమానులకు పంచుకుంది. ఎదో ఒక రోజు పూర్తి ఫోటో అప్లోడ్ కచ్చితంగా చేస్తుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.