మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా

ప్రస్తుతం ఇలియానా తన బిడ్డను చూసి మురిసిపోతూ తన బిడ్డ ఫోటో షేర్ చేసింది. మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా తన పర్సనల్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ఇలియానా గురించి మరో వార్త చెక్కర్లు కొడుతుంది. 2023 మే నెలలో ఇలియానా బాయ్ ఫ్రెండ్ ని వివాహం చేసుకున్నట్లు, ఇటీవలే వెల్లడించింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. అంతేకాకుండా ఇలియానా బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పమని చాలామంది కామెంట్ లో […]

Share:

ప్రస్తుతం ఇలియానా తన బిడ్డను చూసి మురిసిపోతూ తన బిడ్డ ఫోటో షేర్ చేసింది. మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా తన పర్సనల్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ఇలియానా గురించి మరో వార్త చెక్కర్లు కొడుతుంది. 2023 మే నెలలో ఇలియానా బాయ్ ఫ్రెండ్ ని వివాహం చేసుకున్నట్లు, ఇటీవలే వెల్లడించింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. అంతేకాకుండా ఇలియానా బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పమని చాలామంది కామెంట్ లో కూడా పెట్టారు. ఇటీవల ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ పిక్చర్ ని కూడా షేర్ చేయడం జరిగింది. 

ఇలియానా డి’క్రూజ్ తన మొదటి బిడ్డ కోవా ఫీనిక్స్ డోలన్‌కు ఆగస్టు 1న జన్మనిచ్చింది మరియు ఆగస్టు 5న తన బిడ్డకు సంబంధించిన వార్తలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు,కొత్త నివేదిక ప్రకారం, ఇలియానా మైఖేల్ డోలన్‌ను వివాహం చేసుకుంది. అంతేకాదు ఇలియానా డి క్రజ్ తన భర్త పేరును మాత్రమే కాకుండా, వివాహ తేదీని కూడా వెల్లడించింది, మే 13, 2023. 

ఇటీవల ఛాన్స్ మిస్: 

పోకిరి సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి, ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన ఇలియానాకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇలియానా సినిమా వస్తుందంటే ప్రతి ఒక్కరు ఆ సినిమా తప్పకుండా చూడాలని కోరుకునేవారు. అదేవిధంగా ఇలియానా తాను చేసిన ప్రతి సినిమాలో అసలు హీరోతో ఏ మాత్రం తగ్గకుండా, తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం బోలా శంకర్ సినిమాలో చిరంజీవి సరసన నటిస్తున్నది తమన్నా, శృతిహాసన్ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ముందుగా చిరంజీవి పక్కన హీరోయిన్గా నటించడానికి బోలా శంకర్ టీం నుంచి తనకి ఆహ్వానం అందినట్లు చెప్పింది ఇలియానా. కాకపోతే తన పర్సనల్ లైఫ్ కారణంగా ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ హ్యాపీగా గడుపుతున్నట్లు పేర్కొంది. ఫ్యూచర్ లో తను టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని హింట్ ఇచ్చింది. 

ఇంతకుముందు రవితేజ సినిమా ఇలియానా, అమర్ అక్బర్ ఆంటోనీలో నటించే అందరి అభిమానాలను మళ్ళీ దక్కించుకుంది. అయితే అమ్మడు ఆ సినిమాలో కొద్దిగా కనిపించడంతో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంది. ఆ తర్వాత టాలీవుడ్ని విడిచిపెట్టి, తన పర్సనల్ లైఫ్ లో ప్రస్తుతం బిజీ అయిపోయింది ఇలియానా. 

అంతేకాకుండా, బిడ్డకు జన్మనిచ్చిన తరువాత, ఇలియానా మళ్లీ సినిమాల్లోకి రావాలని ఆలోచనలోనే ఉంది అని తెలుస్తోంది. ఇలియానా టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ అందుకుంది అంతేకాకుండా టాలీవుడ్ లో మొదలైన తన సినీ ప్రయాణం బాలీవుడ్ వరకు వెళ్ళింది. తను నటించిన ఆట, పోకిరి, కిక్, జల్సా, జూలై సినిమాలు తనకు ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టండి. 

అయితే ప్రస్తుతం తను పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉండడం వల్ల బోలా శంకర్ మూవీ రిజెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చింది. తన బిడ్డ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తే మురిసిపోతోంది ఇలియానా. ప్రస్తుతం బిడ్డ పుట్టిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తానని ముందుగా చెప్పిన ఇలియానా మళ్లీ సినిమాల్లోకి వస్తుందో లేదో చూడాల్సి ఉంది.