బోళా శంకర్ లో ఇలియానా..!

అయితే ప్రస్తుతం ఇలియానా తన పర్సనల్ లైఫ్ లో కూల్ గా హ్యాపీ ఉంది. ప్రస్తుతం తన ప్రెగ్నెంట్ ఫోటోలు వైరల్ గా మారాయి. అంతేకాకుండా ఇలియానా బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పమని చాలామంది కామెంట్ లో కూడా పెట్టారు. ఇటీవల ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ పిక్చర్ ని కూడా షేర్ చేయడం జరిగింది. తను పర్సనల్ లైఫ్ లో హ్యాపీగా ఉందని, బహుశా డెలివరీ తర్వాత తాను మళ్ళీ సినిమాలోకి వచ్చే ఛాన్స్ ఉందని […]

Share:

అయితే ప్రస్తుతం ఇలియానా తన పర్సనల్ లైఫ్ లో కూల్ గా హ్యాపీ ఉంది. ప్రస్తుతం తన ప్రెగ్నెంట్ ఫోటోలు వైరల్ గా మారాయి. అంతేకాకుండా ఇలియానా బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పమని చాలామంది కామెంట్ లో కూడా పెట్టారు. ఇటీవల ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ పిక్చర్ ని కూడా షేర్ చేయడం జరిగింది. తను పర్సనల్ లైఫ్ లో హ్యాపీగా ఉందని, బహుశా డెలివరీ తర్వాత తాను మళ్ళీ సినిమాలోకి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నాయి సినిమా వర్గాలు. 

చిరంజీవి పక్కన ఛాన్స్ మిస్: 

అయితే ప్రస్తుతం బోలా శంకర్ సినిమాలో చిరంజీవి సరసన నటిస్తున్నది తమన్నా, శృతిహాసన్ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ముందుగా చిరంజీవి పక్కన హీరోయిన్గా నటించడానికి బోలా శంకర్ టీం నుంచి తనకి ఆహ్వానం అందినట్లు చెప్పింది ఇలియానా. కాకపోతే తన పర్సనల్ లైఫ్ కారణంగా ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ హ్యాపీగా గడుపుతున్నట్లు పేర్కొంది. ఫ్యూచర్ లో తను టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని హింట్ ఇచ్చింది. 

ఇంతకుముందు రవితేజ సినిమా ఇలియానా, అమర్ అక్బర్ ఆంటోనీలో నటించే అందరి అభిమానాలను మళ్ళీ దక్కించుకుంది. అయితే అమ్మడు ఆ సినిమాలో కొద్దిగా కనిపించడంతో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంది. ఆ తర్వాత టాలీవుడ్ని విడిచిపెట్టి, తన పర్సనల్ లైఫ్ లో ప్రస్తుతం బిజీ అయిపోయింది ఇలియానా. 

అంతేకాకుండా, బిడ్డకు జన్మనిచ్చిన తరువాత, ఇలియానా మళ్లీ సినిమాల్లోకి రావాలని ఆలోచనలోనే ఉంది అని తెలుస్తోంది. ఇలియానా టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ అందుకుంది అంతేకాకుండా టాలీవుడ్ లో మొదలైన తన సినీ ప్రయాణం బాలీవుడ్ వరకు వెళ్ళింది. తను నటించిన ఆట, పోకిరి, కిక్, జల్సా, జూలై సినిమాలు తనకు ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టండి. 

అయితే ప్రస్తుతం తను పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉండడం వల్ల బోలా శంకర్ మూవీ రిజెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చింది. 

బోళా శంకర్ సినిమా: 

భోలా శంకర్ అనేది ఒక తమిళ సినిమా రీమేక్. 2015లో అజిత్ కుమార్ నటించిన “వేదాళం” కథ ఆధారంగా తయారు అవుతింది, అది ఒక యాక్షన్ థ్రిల్లర్, సోదరి చావు ప్రతీకారం తీర్చుకునే ఒక టాక్సీ డ్రైవర్ కథ. ఈ రీమేక్ సినిమాలో అజిత్ పాత్ర చిరంజీవి పోషించగా, కీర్తి సురేష్ ఆయన చెల్లెలి పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రంలో రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్ మరియు ఉత్తేజ్ కూడా నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య, ఎంతో ఆసక్తి రేపుతోంది టీజర్, సోషల్ మీడియాలో విడుదలై చిరంజీవి అభిమానులకు కనులవిందు చేస్తోంది. పవర్-ప్యాక్డ్ యాక్షన్ మరియు మాస్ మ్యూజిక్ ర్యాంపేజ్ కలిసి ఉన్నాయి. అనిల్ సుంకర గారి ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం లో భోళా శంకర్ ఈ సంవత్సరం ఆగస్టు 11 న థియేటర్లలోకి రానుంది. అదే తేదీన విడుదలవుతున్న రజనీకాంత్ సినిమా “జైలర్‌”. ఈ రెండు సినిమాలు “జామ్ జామ్ జజ్జనకా” పాట లాగా అదరగొట్టాలని, మంచి విజయం సాధించాలని కోరుకుందాం.