చిరు కోసం 12 ఏళ్లు పోరాటం చేసా: అల్లు అర‌వింద్

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా ఆగస్ట్ 11న రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆదివారం నాడు గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.ఈ  ఈవెంట్‌లో అల్లు అరవింద్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మాట్లాడింది నాలుగైదు నిమిషాలే అయినా కూడా తనకు చిరంజీవి అంటే ఎంత ప్రేమో చెప్పేశారు అల్లు అర‌వింద్. మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై 2011లో జీవిత, రాజశేఖర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం అందరికి తెలిసిన విషయమే. ఆ వివాదాస్పద […]

Share:

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా ఆగస్ట్ 11న రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆదివారం నాడు గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.ఈ  ఈవెంట్‌లో అల్లు అరవింద్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మాట్లాడింది నాలుగైదు నిమిషాలే అయినా కూడా తనకు చిరంజీవి అంటే ఎంత ప్రేమో చెప్పేశారు అల్లు అర‌వింద్.

మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై 2011లో జీవిత, రాజశేఖర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం అందరికి తెలిసిన విషయమే. ఆ వివాదాస్పద వ్యాఖ్యలు పై అప్పటిలో నిర్మాత అల్లు అరవింద్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు వారి పై కోర్ట్ లో పరువు నష్టం దావా కూడా వేశారు అల్లు అరవింద్. దాదాపు 12 ఏళ్ళ పాటు ఈ కేసు పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు.. జీవిత, రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోవడం, వారు అన్నారని ప్రూవ్ అవ్వడంతో వారిద్దరికీ ఏడాది జైలు శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధిస్తు ఇటీవల తీర్పుని ఇచ్చింది.ఆ తర్వాత వారు బెయిల్ తెచ్చుకొని పై కోర్టుకి అప్పీల్ చేశారు.

కానీ ఇన్నేళ్లలో ఆ విషయం గురించి ఇప్పటి వరకు మెగా కుటుంబం నుంచి ఎవరు మాట్లాడలేదు. కేసు వేసిన అల్లు అరవింద్ కూడా మీడియా ముందు ఎక్కడ నోరు విప్పలేదు.తాజాగా భోళా శంకర్ (Bholaa Shankar) ప్రీ రిలీజ్ వేదిక పై అల్లు అరవింద్ ఆ కేసు గురించి మాట్లాడారు. 

 అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 

నేను ఇక్కడికి వచ్చింది సినిమా సక్సెస్ కావాలని చెప్పడానికి కాదు. ఎందుకంటే ఆయన చూడని బ్లాక్ బస్టర్ లేవు ఆయన చూడని కలెక్షన్స్ లేవు. మీరు ఆయన సినిమాలు చూస్తూ అభిమానులు అయ్యి ఉంటారు. కానీ నేను ఆయనతో సినిమాలో చేస్తూ అభిమానిని అయ్యాను… నేను ఆయన్ను ఎంత ప్రేమిస్తాను.. ఎంత అభిమానిస్తాను అని ప్రత్యేకంగా నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. ఆ అభిమానం ఎలాంటిది అంటే.. ఆయన్ని పై తప్పుడు మాటల మాట్లాడినందుకు వాళ్ళని జైలుకెళ్లే వరకు ఊరుకోలేదు, 12 ఏళ్ళు పాటు పోరాడాను. అది నా అభిమానం  అంటూ పేర్కొన్నారు .

అలాగే భోళాశంకర్ దర్శకుడు మెహర్ రమేష్ గురించి మాట్లాడుతూ.. “తనని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చిరంజీవి అంటే తనకి ఎంతో అభిమానం. ఆ ప్రేమతోనే ఈ సినిమాని తెరకెక్కించాడు. అతని కోసం ఇక్కడికి వచ్చాను. అతని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పడానికి వచ్చాను” అంటూ చెప్పుకొచ్చారు అల్లు అరవింద్ .. 

జీవితా రాజశేఖర్‌లు చేసిన కామెంట్స్.. 

చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన కొత్తలో జీవితా రాజశేఖర్‌లు ఎలాంటి కామెంట్లు చేశారో అందరికీ తెలిసిందే. చిరంజీవిని కిందకు లాగేందుకు నానా రకాల ప్రయత్నాలు చేశారు. ఆఖరికి ఎంతో మందికి సేవ చేయడానికి  పెట్టిన బ్లడ్ బ్యాంక్ మీద కూడా ఆరోపణలు చేశారు. రక్తం అమ్ముకుంటున్నారని వారు ఒక్కపుడు  చేసిన కామెంట్లకు ఈ మధ్యే శిక్ష పడిన సంగతి తెలిసిందే.అప్పుడు ఆలా మాట్లాడినందుకు అల్లు అరవింద్ కోర్ట్ లో కేసు వేసిన సంగతి తెలిసిందే.  

వారి మీద పరువునష్టం దావాను వేశారు  అల్లు అరవింద్. అది కోర్టులో అలా అలా ముందుకు నడుస్తూ ఈ మధ్యే తీర్పు వచ్చింది. ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానాను కూడా కోర్టు విధించింది . ఇదే విషయాన్ని అల్లు అరవింద్ బోళా శంకర్ ఈవెంట్  స్టేజ్ మీద గుర్తు చేశారు  చిరంజీవిని, ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి మాట్లాడితేనే తాను ఊరుకోలేదని, పోరాటం చేసి మరీ జైలుకి పంపించాను.. అని చిరంజీవి అంటే తనకు అంత ఇష్టమని చెప్పకనే చెప్పేశారు  అల్లు అరవింద్ . 

అల్లు మెగా కాంపౌండ్ మధ్య దూరం ఉందనే  రూమర్లకు అరవింద్ ఇలా పుల్ స్టాప్ పెట్టినట్టు అయింది. ప్రతీ సారి అల్లు మెగా మధ్య దూరం పెరిగిందనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంటుంది. అల్లు అర్జున్ , మెగా అనే పదాన్ని కూడా తలుచుకోవడానికి ఇష్టపడటం లేదనే ప్రచారం సాగుతుంటుంది. కానీ నిన్న అల్లు అరవింద్ మాట్లాడిన మాటలతో మెగా అల్లు  ఎప్పటికీ ఒక్కటే అని అందరికీ అర్థమై ఉండొచ్చు.