నా భర్త తర్వాత అంతగా ప్రేమించేది షారూఖ్‌నే.. !

షారూఖ్‌ ఖాన్‌తో కలిసి పని చేసిన క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని సీనియర్ నటి ప్రియమణి అన్నారు. తన భర్త తర్వాత అంతగా ప్రేమించేది, ఆరాధించేది షారుఖ్‌నే అని చెప్పారు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన సినిమా ‘జవాన్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడుతోంది. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదలై.. మంచి కలెక్షన్లను వసూలు చేస్తోంది. ఇందులో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూడా కీలక పాత్ర పోషించింది. చాలా రోజుల […]

Share:

షారూఖ్‌ ఖాన్‌తో కలిసి పని చేసిన క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని సీనియర్ నటి ప్రియమణి అన్నారు. తన భర్త తర్వాత అంతగా ప్రేమించేది, ఆరాధించేది షారుఖ్‌నే అని చెప్పారు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన సినిమా ‘జవాన్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడుతోంది. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదలై.. మంచి కలెక్షన్లను వసూలు చేస్తోంది. ఇందులో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూడా కీలక పాత్ర పోషించింది. చాలా రోజుల తర్వాత షారుఖ్ ఖాన్ సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించింది. షారుఖ్‌పై ప్రశంసలు కురిపించింది. ఆయనొక అంకితభావం ఉన్న నటుడని కొనియాడింది. ఎంతో కేరింగ్ పర్సన్ అని చెప్పుకొచ్చింది. మరోవైపు తమిళ లేడీ సూపర్‌‌స్టార్ నయనతారపైనా ప్రశంసలు కురిపించింది. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య సంపూర్ణ సమతుల్యతను కొనసాగిస్తోందని చెప్పింది. జవాన్‌లో నటించడానికి శిక్షణ పొందినట్లు చెప్పింది. హిట్ మెషీన్‌గా మారిన అట్లీ.. అద్భుతమైన దర్శకుడని తెలిపింది.

ఇప్పుడే బయటపెట్టాలని అనుకోవడం లేదు

తమ యాక్షన్ అడ్వెంచర్‌‌ సినిమా ‘జవాన్‌’ను మరింత మంది చూడాలని కోరుకుంటున్నానని, అందుకే తమ క్యారెక్టెర్ల గురించి ఇప్పుడే బయటపెట్టాలని అనుకోవడం లేదని ప్రియమణి చెప్పారు. అయితే కమాండో పాత్ర కోసం చాలా కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నట్లు వెల్లడించింది. దక్షిణ ఆఫ్రికాకు చెందిన నిపుణుల బృందం తమకు శిక్షణ ఇచ్చిందని వివరించింది. స్టైల్‌గా గన్ను పట్టుకోవడం ఎలా? ఎలా నిలబడాలి? ఆయుధాలతో ఎలా ముందుకు వెళ్లాలి? అనే అంశాల గురించి తెలుసుకున్నట్లు చెప్పింది. పోరాట సన్నివేశాల సమయంలో బాలీవుడ్ స్టంట్ మాస్టర్ సునీల్ రోడ్రిగ్స్ తమకు సాయం చేసినట్లు పేర్కొంది. అందువల్లే బిగ్ స్క్రీన్‌పై సీన్లు అంత బాగా వచ్చాయని చెప్పింది.

ఆయనొక కేరింగ్ పర్సన్

‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమా తర్వాత షారుఖ్ ఖాన్‌తో కలిసి సినిమా చేయడంపై స్పందిస్తూ.. ‘‘నిజం చెప్పాలంటే నా భర్త ముస్తఫా రాజ్‌ తర్వాత అంత ఎక్కువగా ప్రేమించేది, ఆరాధించేది షారుఖ్‌ ఖాన్‌నే. ఆయనొక కేరింగ్ పర్సన్. అంత ఫాలోయింగ్ ఉన్నప్పటికీ.. డౌన్‌ టు ఎర్త్ ఉంటారు. తన సహ నటులను జాగ్రత్తగా చూసుకుంటారు. గతంలో ఇద్దరం కలిసి పని చేసిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ సమయంలోనూ అంతే. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయనతో కలిసి జవాన్ సినిమా కోసం పని చేసే అవకాశం వచ్చింది. ఆయనతో చాలా సీన్లలో కనిపించాను. కానీ ఆయనకు దీటుగా నటించడం అనేది పెద్ద సవాలే. తన చుట్టూ వెలుగును వ్యాపింపజేసి.. మొత్తం నటులను, సిబ్బందిని ఉత్తేజపరుస్తారు. ఆయనతో పని చేసిన క్షణాలను ఎప్పటికీ గౌరవిస్తాను” అని ప్రియమణి వివరించింది. 

అట్లీ.. హిట్ మెషీన్

తమిళ ఇండస్ట్రీకి చెందిన అట్లీ, నయనతారతో కలిసి పని చేయడంపై ప్రియమణి స్పందించారు. అట్లీ అద్భుత డైరెక్టర్ అని చెప్పారు. జవాన్‌లో షారుఖ్ ఖాన్ కోసం కొత్త అవతార్‌‌ను సృష్టించారని తెలిపారు. ‘‘విజయ్‌తో బిగిల్ తీసి బ్లాక్‌బస్టర్‌‌ కొట్టి.. ఇప్పుడు షారుఖ్‌తో జవాన్‌తో రికార్డు బ్రేకింగ్ హిట్‌ కొట్టారు. ఆయనొక హిట్ మెషీన్. ఇక సినిమాలో నయనతారతో నాకు కొన్ని సీన్లు ఉన్నాయి. ఆమె చాలా నైపుణ్యం ఉన్న నటి. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య సంపూర్ణ సమతుల్యతను కొనసాగిస్తోంది. అట్లీతో మాట్లాడేటప్పుడు తమిళ్‌లోనే మాట్లాడుకునే వాళ్లం. నయనతారతోనూ ఇంతే. అయితే జవాన్ సినిమాలో విలన్ పాత్ర పోషించిన విజయ్ సేతుపతితో మాత్రం ఒక్క సీన్‌ కూడా కలిసి నటించలేదు. సేతుపతి ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఆయన్ను ఆరాధిస్తాను” అని ప్రియమణి చెప్పుకొచ్చారు. 

నటులందరూ ఒకే కమ్యూనిటీ 

ఇప్పుడు ఇండియన్ సినిమానే ఉందని, ప్రాంతీయ గోడలు లేవని ప్రియమణి అన్నారు. ఇప్పుడు సౌత్ సినిమా, నార్త్ సినిమా అంటూ ఏవీ లేవని చెప్పారు. ‘‘నిజం చెప్పాలంటే పాన్ ఇండియా స్టర్స్ అనడంపై విజయ్ సేతుపతి అభ్యంతరం చెబుతారు. మనమందరం ఇండియన్ నటులమని అంటారు. ఆయన అభిప్రాయానికి నేను మద్దతిస్తా. ఇప్పుడు హిందీ నటులు దక్షిణాదిలో.. సౌత్ నటులు బాలీవుడ్‌లో కనిపిస్తున్నారు. అందుకే నటులందరూ ఒకే కమ్యూనిటీ అని నేను నమ్ముతా” అని చెప్పుకొచ్చారు. హిందీ సినిమా మైదాన్‌లో కూడా నటిస్తున్నట్లు చెప్పారు. ఇంకా కొన్ని సినిమాలకు సంతకం చేసినట్లు వెల్లడించారు.