స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఎంతైనా ఖ‌ర్చు చేస్తా: DVV దాన‌య్య‌

స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఎంతైనా ఖ‌ర్చు చేస్తా అని అంటున్నారు DVV సంస్థ దాన‌య్య‌. RRR  ఈ మూవీ కేవలం తెలుగు భాష అనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లో పెద్ద హిట్ అయింది. భాషేదైనా కానీ RRR అంటే అదో ఎమోషన్ లా మిగిలిపోయింది. చివరికి ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. అది వేరే విషయం కానీ RRR మూవీకి ఉన్న క్రేజ్ గురించి మనం తప్పకుండా చర్చించుకోవాలి. ఎంత […]

Share:

స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఎంతైనా ఖ‌ర్చు చేస్తా అని అంటున్నారు DVV సంస్థ దాన‌య్య‌. RRR  ఈ మూవీ కేవలం తెలుగు భాష అనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లో పెద్ద హిట్ అయింది. భాషేదైనా కానీ RRR అంటే అదో ఎమోషన్ లా మిగిలిపోయింది. చివరికి ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. అది వేరే విషయం కానీ RRR మూవీకి ఉన్న క్రేజ్ గురించి మనం తప్పకుండా చర్చించుకోవాలి. ఎంత క్రేజ్ అంటే ఆ మూవీ చూసేందుకు చాలా మంది చాలా సాహసాలు చేశారు. అటువంటి RRR ప్రొడ్యూసర్ దాన‌య్య‌ తాజాగా మీడియాతో మాట్లాడారు. తను ఈ మధ్యే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అనే మూవీని రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో దాన‌య్య‌ తెరకెక్కిస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. నిర్మాతగా దానయ్య ఎటువంటి విజయాలు సాధించారో అందరికీ తెలిసిందే. అటువంటి దానయ్య ఎలా ఫీల్ అవుతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. 

పెద్ద సినిమాలంటే ఇష్టం.. వాటికి అట్రాక్ట్ అయ్యా… 

మొన్న RRR మూవీ రూ. 500 కోట్ల బడ్జెట్ కంటే ఎక్కువ.. ప్రస్తుతం పవర్ స్టార్ నటిస్తున్న ఓజీ మూవీకి రూ. 200 కోట్ల బడ్జెట్ మీరు పెద్ద సినిమాలకు కాస్త అట్రాక్ట్ అయ్యారా? అని ప్రశ్నించినపుడు ఆయన చెప్పిన సమాధానం ఆశ్చర్యం కలిగించేలా చేసింది. అవును నిజం చెప్పాలంటే నేను కాస్త పెద్ద సినిమాలకు అట్రాక్ట్ అయ్యా. అందుకోసమే వరుసగా ఇటువంటి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న అని ఆయన చెప్పుకొచ్చారు. కొత్త తరం ప్రేక్షకులు రిచ్ లుక్ ఉన్న మూవీలను చూసేందుకు ఇష్టపడుతున్నారని దానయ్య పేర్కొన్నారు. అందుకోసమే తాను కూడా పెద్ద సినిమాలనే తెరకెక్కించేందుకు మొగ్గు చూపుతున్నానని తెలిపారు. ఇప్పుడే ఓజీ గురించి లెక్కలను చెెప్పలేనని కానీ స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఎంత ఖర్చైనా చేయడంలో తనకు ఎటువంటి అభ్యంతరం లేదని అతడు తెలిపాడు. ఈ యాక్షన్ మూవీ ఒక రకమైన గ్యాంగ్ స్టర్ జానర్ లో వస్తుంది. పవర్ స్టార్ ను ఆయన ఫ్యాన్స్ ఎప్పుడూ ఇటువంటి డిఫరెంట్ రోల్ లో చూసి ఉండరని మేకర్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. అందుకోసమే ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

పవన్ తో పని చేయడం ఆనందాన్నిచ్చింది.. 

పవర్ స్టార్ తో పని చేయడం ఎలా అనిపించిందని ప్రశ్నించగా… ఈ ఓజీ మూవీని సుజీత్ 1980ల నాటి గ్యాంగ్ స్టర్ కథతో తెరకెక్కించాడని తెలిపాడు. ఈ మూవీకి ఎన్నడూ లేనంత రెస్పాన్స్ రావడం ఖాయమన్నారు. ఈ మూవీలో ఎక్కువ భాగం షూటింగ్ ను బయటే విదేశాల్లో చేశామని తెలిపాడు. పవన్ కల్యాణ్ తో వర్క్ చేయడం ప్రత్యేకంగా అనిపించిందని పేర్కొన్నాడు. ఈ మూవీ కోసం భారీ భారీ సెట్లను రూపొందించామని తెలిపాడు. 

ఓజీ రిలీజ్ అప్పుడే 

దానయ్య నిర్మించిన భారీ బడ్జెట్ మూవీ ఓజీ చిత్ర షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయిందట. కేవలం 40 శాతం షూటింగ్ మాత్రమే మిగిలుందని అతడు తెలిపాడు. ఈ మూవీని ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ మూవీ తప్పకుండా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను తిరగరాస్తుందని దానయ్య ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ మూవీ పవన్ ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా కామన్ ఆడియన్స్ కి కూడా నచ్చుతుందని అతడు తెలిపాడు. 

అందులో విఫలం అయ్యాం… 

దానయ్య ఇది వరకు అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి చాలా మంది నటులతో వర్క్ చేశారు. వారికి పెద్ద సంఖ్యలో అభిమానుల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వారి ఫ్యాన్స్ కోరికలను తీర్చేందుకు మీరేం చేస్తారని ప్రశ్నించగా.. దానయ్య మాట్లాడుతూ…. ముందుగా సరైన స్క్రిప్ట్ ను కనుక్కోవడం అవసరం. అని తెలిపాడు. స్క్రిప్ట్ తర్వాత దర్శకుడు మరింత కీలకం అని దానయ్య పేర్కొన్నాడు. ఇవన్నీ అనుకున్నవి అనుకున్నట్లు కుదిరితే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఈజీ అని తెలిపారు. కానీ ఆ అంచనాను రెండు మూడు సార్లు అందుకోవడంలో విఫలం అయ్యానని పేర్కొన్నాడు. కేవలం బిగ్ మూవీస్ మాత్రమే కాకుండా దానయ్య నిర్మాతగా ‘నిన్ను కోరి’ వంటి క్లాసికల్ మూవీస్ కూడా వచ్చాయి. నాచురల్ స్టార్ నాని నటించిన ఈ మూవీ పెద్ద హిట్ అయి.. నిర్మాతకు కాసుల పంట కురిపించింది. కేవలం పెద్ద స్టార్ల మూవీలు మాత్రమే పక్కాగా హిట్ అవుతాయని చెప్పలేమని నిన్ను కోరి వంటి కంటెంట్ బేస్డ్ మూవీస్ కూడా హిట్ అవుతాయని తెలిపాడు. కావున ఇటువంటి చిన్న మూవీలను కూడా మనం తెరకెక్కించాలని ఆయన పేర్కొన్నాడు. అందుకోసమే తాను అన్ని రకాల మూవీలను తీసేందుకు తన వంతు కృషి చేస్తానని వివరించాడు.