ధర్మేంద్రే కాదు ఏ మగాడైనా నాకంటే హేమమాలినినే ఇష్ట‌ప‌డ‌తారు

బాలీవుడ్ నటదిగ్గజం ధర్మేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలనాటి నటులు ధర్మేంద్ర హేమమాలినిల వివాహం గురించి అందరికీ తెలిసిందే. అప్పటికే పెళ్ళైన ధర్మేంద్ర హేమమాలిని పెళ్లి చేసుకోవడానికి ఏకంగా ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారు. ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ తో నలుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. అయినా కూడా హేమమాలిని మరిచిపోలేక ఆయన రెండో పెళ్లి చేసుకుని మరో ఇద్దరి పిల్లల్ని కన్నారు. అయితే ఇటీవల ధర్మేంద్ర మనవడు కరణ్ డియోల్ పెళ్లి ఘనంగా జరిగిన […]

Share:

బాలీవుడ్ నటదిగ్గజం ధర్మేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలనాటి నటులు ధర్మేంద్ర హేమమాలినిల వివాహం గురించి అందరికీ తెలిసిందే. అప్పటికే పెళ్ళైన ధర్మేంద్ర హేమమాలిని పెళ్లి చేసుకోవడానికి ఏకంగా ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారు. ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ తో నలుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. అయినా కూడా హేమమాలిని మరిచిపోలేక ఆయన రెండో పెళ్లి చేసుకుని మరో ఇద్దరి పిల్లల్ని కన్నారు. అయితే ఇటీవల ధర్మేంద్ర మనవడు కరణ్ డియోల్ పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కరణ్  దృశ ఆచార్యతో ఏడు అడుగులు వేశారు.  ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. హేమామాలిని సన్నీడియోల్, కరణ్ పెళ్లికి రావాలని ఆహ్వానించినప్పటికీ ఈ కుటుంబం మాత్రం వేడుకకు వచ్చేందుకు మొగ్గు చూపలేదు. పెళ్లి పందిట్లో హేమమాలిని ఆమె కూతుర్లు ఎక్కడ కనిపించలేదు. ధర్మేంద్ర పిలవకపోవడంతోనే వాళ్ళు రాలేదని ప్రచారం జరిగింది. అయితే అది నిజమేనని తెలుపుతూ ధర్మేంద్ర సోషల్ మీడియాలో భావోద్వేగానికి లోనవుతూ పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. ఈ విషయంపై ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ స్పందించారు.

అయితే ఈ పెళ్లికి ధర్మేంద్ర హేమమాలిని కానీ, తన పిల్లలను కానీ పిలవలేదు. ఈ క్రమంలో ధర్మేంద్ర సోషల్ మీడియాలో భావోద్వేగానికి లోనయ్యారు. హేమ, నా డార్లింగ్ పిల్లలు ఈశా, అహనా. అల్లుళ్లు తక్తాన్ని, వోహరా మిమ్మల్ని నేను ఎంతో గౌరవిస్తాను. మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. వయసు పైపడటం అనారోగ్యం నాకు విషయాన్ని గుర్తు చేశాయి. నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడాల్సింది. కానీ అంటూ.. వాక్యాన్ని సగంలోనే ఆపేస్తూ క్షమించండి అన్నట్లుగా చేతులు జోడించి ఎమోజిని జత చేస్తూ పోస్ట్ పెట్టారు. ఇందుకు ధర్మేంద్ర క్షమాపణలు చెబుతూ ఇంస్టాగ్రామ్ లో పోస్టులు కూడా పెట్టారు. దీనిపై ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ స్పందించారు..

నా భర్త మాత్రమే ఎందుకు ఏ మగాడైనా నాకంటే హేమమాలినైనా ఇష్టపడతారు. ఇండస్ట్రీలో సగం మంది ఇదే పనిచేస్తున్నప్పుడు నా భర్తను ఉమనైజర్ అని పిలవడానికి ఎవరైనా ఎంత ధైర్యం చేస్తారు. హీరోలందరూ పెట్టుకొని రెండో పెళ్లి చేసుకుంటున్నారు. అతను నాకు మంచి భర్త కాకపోవచ్చు. కానీ అతను కచ్చితంగా మంచి తండ్రి. అతని పిల్లలు ఆయన్ని ప్రేమిస్తారు. ఆయన ఎప్పుడూ పిల్లల పట్ల నిర్లక్ష్యం చేయలేదని ప్రకాష్ కౌర్ తెలిపారు. 

హేమమాలినేని రెండో పెళ్లి చేసుకున్నందుకు తన భర్తను అందరూ అమ్మాయిల పిచ్చోడు అనే వారిని, ఇంకోసారి ఆ మాటలంటే ఊరుకునేది లేదని ఫైర్ అయ్యారు. ధర్మేంద్ర స్థానంలో ఎవరు ఉన్నా హేమమాలిని చేసుకోవాలని అనుకుంటారని.. ధర్మేంద్ర మంచి భర్త కాకపోయినా, మంచి తండ్రిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు. సాటి మహిళగా హేమమాలిని సపోర్ట్ చేస్తాను కానీ ఓ తల్లిగా భార్యగా మాత్రం ధర్మేంద్ర హేమమాలినిల రిలేషన్ ను ఒప్పుకోనని చెప్పారు.

హేమమాలిని కూడా ధర్మేంద్రకు సంబంధించిన ఇతర కుటుంబ సభ్యులతో చాలా మర్యాదగానే ప్రవర్తిస్తుందని ప్రకాష్ కౌర్ చెప్పుకొచ్చింది. గతంలో ధర్మేంద్రను ఉమనైజర్ అని పలువురు కామెంట్లు చేశారు. అదే కామెంట్లను ఎప్పుడు కొందరు చేస్తూ ఉంటారు అని ప్రకాష్ కౌర్ ఈ విధంగా స్పందించారు.

ఇక ఈ విషయంపై హేమమాలిని కానీ ఆమె పిల్లలు కానీ ఏమైనా స్పందిస్తారా అనేది చూడాలి. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.