సూర్య‌తో వేదాల‌పై సినిమా

విలక్షణ నటుడు సూర్య గురించి ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే అవుతుంది. సూర్య కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అయినా కానీ ఇక్కడ టాలీవుడ్ లో అతడికి విపరీతమైన డిమాండ్ ఉంది. అతడి డబ్బింగ్ మూవీలు ఇక్కడ రిలీజ్ అవుతుంటాయి. ఇక ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ వచ్చింది కాబట్టి డబ్బింగ్ అని చెప్పకుండానే అవి రిలీజ్ అవుతున్నాయి. సూర్యకు ఇక్కడ ఎంత క్రేజ్ ఉందంటే ఇక్కడి స్టార్లతో పోటీ పడి మరీ సూర్య సినిమాలు […]

Share:

విలక్షణ నటుడు సూర్య గురించి ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే అవుతుంది. సూర్య కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అయినా కానీ ఇక్కడ టాలీవుడ్ లో అతడికి విపరీతమైన డిమాండ్ ఉంది. అతడి డబ్బింగ్ మూవీలు ఇక్కడ రిలీజ్ అవుతుంటాయి. ఇక ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ వచ్చింది కాబట్టి డబ్బింగ్ అని చెప్పకుండానే అవి రిలీజ్ అవుతున్నాయి. సూర్యకు ఇక్కడ ఎంత క్రేజ్ ఉందంటే ఇక్కడి స్టార్లతో పోటీ పడి మరీ సూర్య సినిమాలు వసూళ్లు రాబడుతుంటాయి. మొన్నా మధ్య సూర్య నటించిన సూపర్ హిట్ మ్యూజికల్ మూవీ సూర్య సన్నాఫ్ కృష్ణన్ రీ రిలీజ్ అయితే థియేటర్లు మోత మోగిపోయాయి. ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూసి నిర్మాతలే షాక్ అయ్యారు. అది సూర్య క్రేజ్..

కంగువాతో బిజీ

ప్రస్తుతం సూర్య పాన్ ఇండియా మూవీ కంగువా చేస్తున్నాడు. ఈ మూవీతో అతడు ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇందులో సూర్య క్యారెక్టర్ ను డైరెక్టర్ శివ ఓ రేంజ్ లో డిజైన్ చేశాడు. మొన్నా మధ్య రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో మూవీ యూనిట్ ఈ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. ఇక ఈ విషయాలను అలా పక్కన పెడితే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడైన చందూ మొండేటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. చందూ ఒక మూవీని తెరకెక్కిస్తే అది చాలా సస్పెన్స్ తో కూడుకుని ఉంటుంది. ఎటువంటి మూవీని కానీ హిట్ చేయగల సత్తా చందూ మొండేటి సొంతం. ఓ కార్తికేయ వంటి సస్పెన్స్ మూవీ తెరకెక్కించినా లేక ప్రేమమ్ వంటి మెలోడియస్ లవ్ స్టోరీని తెరకెక్కించినా కానీ చందూ మొండేటి టేకింగ్ స్టైలే డిఫరెంట్ గా ఉంటుంది. ఇందువల్లే అతడి సక్సెస్ రేట్ ఎక్కడో ఉంటుంది. 

వైరల్ అవుతున్న వ్యాఖ్యలు

చందూ మొండేటి ప్రస్తుతం యంగ్ స్టార్ నాగచైతన్యతో మరో మూవీ తెరకెక్కించేందుకు సన్నద్ధం అవుతున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో ఇప్పటికే ప్రేమమ్ వంటి సూపర్ హిట్ మూవీ వచ్చింది. ఇక ఇప్పుడు వచ్చే మూవీ మత్య్సకారుల జీవిత గాధ ఆధారంగా రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసమే టీం అంతా కలిసి శ్రీకాకుళం జిల్లాలోని గ్రామాల్లోని మత్య్సకారుల లైఫ్ స్టైల్ ను అబ్జర్వ్ చేస్తున్నారు. ఇవలా ఉంచితే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వైరల్ వ్యాఖ్యలు చేశాడు. తాను తమిళ సూపర్ స్టార్ సూర్యతో మూవీ తీసేందుకు కథను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపాడు. వేదాల బ్యాక్ డ్రాప్ లో హీరో సూర్యతో తాను త్వరలోనే ఓ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు తెలిపాడు. తాను ఇప్పటికే ఈ విషయమై సూర్యతో రెండు సార్లు సమావేశం అయినట్లు తెలిపాడు.  

ముందు ఆ హీరోనే అనుకున్నా… 

నాగచైతన్యతో ప్రస్తుతం తీయబోయే మూవీకి మొదట బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ ను తీసుకోవాలని చందూ మొండేటి అనుకున్నాడట. కానీ ఆ తర్వాత నాగచైతన్యను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలిపాడు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో కూడా తాను టచ్ లో ఉన్నట్లు చందూ మొండేటి తెలిపారు. త్వరలోనే తాను స్ట్రెయిట్ హిందీ మూవీ తీయాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. మీరు పౌరాణిక కథకలకు బాగా అట్రాక్ట్ అయ్యారా అని ప్రశ్నించగా…. నేను చిన్నప్పటి నుంచి రామాయణ, మహాభారతాలను చదివానని తెలిపాడు. వాటి శక్తి ఏంటో తనకు తెలుసు కాబట్టి వాటి ఆధారంగా సినిమాలు తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. 

ఇక సూర్యతో చేయబోయే మూవీ గురించి మాట్లాడుతూ… ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్లేందుకు సంవత్సరంన్నర లేదా రెండు సంవత్సరాల సమయం పడుతుందని చెప్పాడు. అప్పటి వరకు హీరో సూర్యతో పాటు తాను కూడా తన ప్రాజెక్టులతో బిజీగా ఉంటానని వెల్లడించాడు.