నేను పెళ్లికి వ్యతిరేకం కాదు : అనుష్క

నవీన్‌ పొలిశెట్టి- అనుష్క నటించిన తాజా చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ . తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌లో అనుష్క మాట్లాడుతూ తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా సంవత్సరాల విరామం తర్వాత అనుష్క శెట్టి నటిస్తోన్న సినిమా ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. పి.మహేష్‌బాబు తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లతో సినిమా విశేషాలను పంచుకుంటోంది. కొన్ని రోజులుగా హీరో నవీన్ పొలిశెట్టి ఈ […]

Share:

నవీన్‌ పొలిశెట్టి- అనుష్క నటించిన తాజా చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ . తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌లో అనుష్క మాట్లాడుతూ తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా సంవత్సరాల విరామం తర్వాత అనుష్క శెట్టి నటిస్తోన్న సినిమా ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. పి.మహేష్‌బాబు తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లతో సినిమా విశేషాలను పంచుకుంటోంది. కొన్ని రోజులుగా హీరో నవీన్ పొలిశెట్టి ఈ పనిలో బిజీగా ఉండగా.. తాజాగా అనుష్క కూడా ఇందులో భాగమైంది. ఓ ఆంగ్ల మీడియతో ఈ సినిమా సంగతులతో పాటు తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

‘‘ఈ సినిమాలో నా పాత్ర పేరు అన్విత. ఎంతో సానుభూతిపరురాలు. తన పనులు పూర్తి చేయడం కోసం దేనికైనా సిద్ధపడుతుంది. అందరి లాంటి అమ్మాయి కాదు. ఎంతో ప్రత్యేకమైన అమ్మాయి. మంచి స్క్రిప్ట్‌ ఉన్న సినిమాలో నటించడం సవాలుతో కూడుకున్నది. నా కెరీర్‌లో దేవసేన (బాహుబలి), జేజమ్మ (అరుంధతి), భాగమతి లాంటి ఎన్నో ప్రత్యేకమైన పాత్రల్లో నటించాను. ఇప్పుడు అన్విత పాత్ర కూడా భిన్నంగా ఉంటుంది. ఇలాంటి రోల్స్‌ రావాలంటే అదృష్టం ఉండాలి. నేను ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో నాకు నటనపై ఎలాంటి అవగాహన లేదు. ఇప్పుడీ స్థాయికి వచ్చానంటే దీని వెనుక ఎంతో మంది సహాయం ఉంది. చాలా సినిమాలు చేసినప్పటికీ మొదటి రోజు సెట్‌కు ఎలా వెళ్లానో ఇప్పుడూ అలానే వెళ్తాను. నా పాత్రకు తగిన న్యాయం చేయగలనా అనే ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. ఇన్నేళ్ల నా ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఉన్నాయి. ఒక్కోసారి అందంగా కనిపించింది.. మరోసారి ఎంతో కఠినంగా అనిపించింది. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేయాలనే కోరిక ఎప్పుడూ ఉంటుంది. సినిమా పరిశ్రమలో ఉన్న వారు నిరంతరం నేర్చుకునే అవకాశం ఉంటుంది’’ అని అనుష్క చెప్పారు.

ప్రణాళిక లేకపోవటం మరియు ప్లాన్ చేసేంత తెలివితేటలు లేకపోవటం నా రహస్యం (గట్టిగా నవ్వుతూ). నేను ఎప్పుడూ ఏమీ ప్లాన్ చేసుకోలేదు; సినిమా సెట్‌లోకి వెళ్లినప్పుడల్లా ఆనందంగా ఉంటుంది. నా లెక్కలు ఎప్పుడూ ఎలాంటి కథలు చేయాలనే దానిపైనే ఉంటాయి. ప్రభావవంతమైన పాత్రలు చేయాలనే అత్యాశ నాకు ఎప్పుడూ ఉంటుంది. ప్రపంచం పూర్తిగా మారిపోయింది మరియు మీరు పాత్రలను చూస్తారు తప్ప తమను తాము ప్రదర్శించే నటులు కాదు. నేను పనిచేసిన వ్యక్తుల వల్ల నేను అభివృద్ధి చెందానని అనుకుంటున్నాను. నా పనిలో నేను నిజాయితీగా  ఉన్నాను. నా ప్రయాణంలో అన్నీ ఉన్నాయి — హెచ్చు తగ్గులు; ఇది అందంగా మరియు కొన్ని సమయాల్లో కఠినంగా ఉంటుంది; నా ప్రయాణంలో చాలా ఎమోషన్ ఉంది అని అన్నారు.

ఇక పాన్‌ ఇండియా సినిమాల గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ ట్రెండ్ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. శ్రీదేవి లాంటి వారు ఎన్నో ఏళ్ల క్రితమే పాన్‌ ఇండియా సినిమాల్లో నటించారు. మంచి కథకు భౌగోళిక సరిహద్దులు ఉండవు. ఓటీటీ, సోషల్‌మీడియా టెక్నాలజీతో ప్రపంచం చాలా చిన్న ప్రదేశంలా మారింది. ఒక సినిమాను రూపొందించే సమయంలోనే ఎక్కువ మంది ప్రేక్షకులను అది చేరుకోవాలని చిత్రబృందమంతా కోరుకుంటుంది’’ అని అన్నారు. ఇక సినిమాల కోసం శరీరాకృతిలో మార్పు తీసుకురావడంపై అనుష్క మాట్లాడుతూ.. మంచి స్క్రిప్ట్‌ ఉంటే దానికోసం ఎంత సాహసమైనా చేయాలనిపిస్తుందని అన్నారు. ఒక్కోసారి బరువు పెరగడం, తగ్గడం నటులకు ఎంతో సవాలుతో కూడుకున్న విషయమని ఆమె తెలిపారు. అలాగే తన పెళ్లిపై కూడా అనుష్క స్పందించారు. వివాహ వ్యవస్థపై నమ్మకముందన్న అనుష్క.. పెళ్లికి తానెప్పుడూ వ్యతిరేకం కాదని అన్నారు. సమయం వచ్చినప్పుడు వివాహం చేసుకుంటానని తెలిపారు.