‘పుష్ప 2’ సెట్‌లో జూనియర్ ఎన్టీఆర్

గత కొద్ది రోజులుగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచుస్తున్న చిత్రాల్లో పుష్ప 2 ఒకటి. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. కాగా ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం జరుగుతోంది. సినిమా కోసం వేసిన ప్రత్యేక సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా తాజాగా ఈ సెట్‌కు జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు. ప్రస్తుతం తారక్‌కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ […]

Share:

గత కొద్ది రోజులుగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచుస్తున్న చిత్రాల్లో పుష్ప 2 ఒకటి. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. కాగా ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం జరుగుతోంది. సినిమా కోసం వేసిన ప్రత్యేక సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా తాజాగా ఈ సెట్‌కు జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు. ప్రస్తుతం తారక్‌కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్‌‌గా మారింది. కాగా మరోవైపు తారక్‌-కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ కూడా అక్కడే జరుగుతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పుష్ప-2 సెట్స్‌ను తారక్‌ సందర్శించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా.. బావా హ్యాపీ బర్త్ డే అటూ.. ఎన్టీఆర్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. దీనికి బన్నీ బావా హగ్ అంటూ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అనంతరం పార్టీ లేదా పుష్ప అంటూ.. ఎన్టీఆర్ చేసిన రీట్వీట్ కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఇప్పుడు పుష్ప-2 సెట్స్ లోకి ఎన్టీఆర్ అడుగు పెట్టడంతో ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ అభిమానులు ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే తారక్‌కు పార్టీ ఇవ్వడానికి పుష్పరాజ్ ఏర్పాట్లు చేశాడా అంటూ అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు.

అటు ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో ఫహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నాడు. కాగా రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు అభిమానుల నుండి ఓ రేంజ్‌లో రెస్పాన్స్‌ వచ్చింది.

ఇక గ‌తేడాది డిసెంబ‌ర్‌లో విడుద‌లైన పుష్ప సినిమా ఎంత‌ పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పుష్ప సినిమాతో బాక్సాఫీస్‌ దగ్గర రూ.350 కోట్లకు పైగా కలెక్షన్‌లు సాధించి అల్లు అర్జున్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ చిత్రం ఎలాంటి ప్రమోష‌న్లు చేయ‌కుండానే రూ.100 కోట్లు సాధించి అక్క‌డి అభిమానులను సైతం ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. కాగా పుష్ప సీక్వెల్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 

అటు ఎన్టీఆర్ ప్రస్తుతం తన తదుపరి సినిమా (ఇంకా పేరు పెట్టని తెలుగు చిత్రం) షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇది జాన్వీ కపూర్ యొక్క తెలుగు అరంగేట్రం మూవీ. ఈ సంవత్సరం చివర్లో ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. కాగా వార్ 2లో నటుడు హృతిక్ రోషన్‌తో తారక్ స్క్రీన్‌ షేర్‌ చేసుకోబొతున్నారు. వార్ 2తో ఎన్టీఆర్ హిందీ చిత్రసీమలో అరంగేట్రం చేయనున్నాడు.

కాగా చిన్నప్పటి నుంచే అర్జున్ డ్యాన్స్ అంటే అమితాసక్తిని కనబరిచేవాడు. ఇంట్లో ఏదైనా పంక్షన్‌ సమయంలో చిరంజీవి కుమారుడైన రామ్‌చరణ్ తేజ్, అర్జున్ ఇద్దరు ఆసక్తిగా డ్యాన్స్‌లు చేసేవారు. మొదట్లో అల్లు అర్జున్ హీరో కావడానికి తల్లి కొద్దిగా సందేహించినా, తరువాత బన్నీ కోరికను కాదనలేకపోయింది. 

శాకుంతలం సినిమాతో వెండి తెరపై అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఎంట్రీ ఇవ్వడమేకాక ఐదేళ్లకే రెండు నెలల కాలవ్యవధిలో 50 మందికి పైగా చదరంగం ఆటలో శిక్షణ ఇచ్చింది. అత్యంత పిన్నవయసులోనే ఆమెలో ఉన్న అసమాన ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ సంస్థ అర్హ కు వరల్డ్‌ యంగెస్ట్‌ చెస్‌ ట్రైనర్‌గా అవార్డు అందించారు.