బిగ్ బాస్7 ఉండబోయేది ఎవరు?

తెలుగు బిగ్ బాస్ 7 వీక్షకులారా, షో గురించిన కొత్త అప్‌డేట్ ఇదిగోండి. ఇంతకీ విషయం ఏమిటంటే బిగ్ బాస్ 7 ప్రారంభం కాబోతోంది. ఇటీవలే కొత్త ప్రోమో కూడా వచ్చేసింది. డాషింగ్ గా నాగార్జున కొత్తగా ఎదో ట్రై చేస్తానని ఏఎన్ఆర్ పాట పడేసాడు.  కుడి ఎడమైనా పర్లేదు:  ఈమధ్య వచ్చిన బిగ్ బాస్ 7 లో నాగార్జున చేసిన ప్రోమో చూసారా? కొత్తగా ఏమి చెప్పాలి? ఈసారి సరికొత్తగా ఉండబోతోంది అని పాప్కార్న్ తింటూ […]

Share:

తెలుగు బిగ్ బాస్ 7 వీక్షకులారా, షో గురించిన కొత్త అప్‌డేట్ ఇదిగోండి. ఇంతకీ విషయం ఏమిటంటే బిగ్ బాస్ 7 ప్రారంభం కాబోతోంది. ఇటీవలే కొత్త ప్రోమో కూడా వచ్చేసింది. డాషింగ్ గా నాగార్జున కొత్తగా ఎదో ట్రై చేస్తానని ఏఎన్ఆర్ పాట పడేసాడు. 

కుడి ఎడమైనా పర్లేదు: 

ఈమధ్య వచ్చిన బిగ్ బాస్ 7 లో నాగార్జున చేసిన ప్రోమో చూసారా? కొత్తగా ఏమి చెప్పాలి? ఈసారి సరికొత్తగా ఉండబోతోంది అని పాప్కార్న్ తింటూ వచ్చి, ఇలా ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, ఈసారి కొత్తగా చెప్తాను అని “కుడి ఎడమైనతే పొరపాటులేదోయ్..” అన్నాడు కింగ్. మరి ఏది తారుమారు కాబోతోందో తెలియాల్సి ఉంది. లేదా కుడి ఎడమైనా పర్లేదు మనం ఓడిపోము అని ఏఎన్ఆర్ చేసిన దేవదాసు సినిమాలో పాట పాడుతూ స్టైల్గా “మీరు ఓడిపోయినా పర్లేదు పాల్గొటం ముఖ్యం” అని పాల్గొనే వారిని ఆహానిస్తున్నాడా ఈ మన్మధుడు అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. 

పాల్గొబోయేది ఎవరు? 

బిగ్ బాస్ అనౌన్స్మెంట్ రాగానే కంటెస్టెంట్స్ ఎవరు అని  వెతికేస్తున్నారు కదూ! ప్రతిసారి సీజన్లో లో ప్రతి ఎపిసోడ్ చూసినా చూడక పోయినా కాంటెంటెంట్స్ ఎవరో తెలుసుకోవాలని అనుకుంటాం. మా టివి వారు లిస్ట్ రిలీజ్ చేసే ముందే ఎన్నో పేర్లు బయటకి వచ్చేస్తూ ఉంటాయి.. ఆతరువాత కొంత మంది సెలెబ్రిటీస్ మేము పాల్గోవట్లేదు అని ఓఫిషల్ స్టేట్మెంట్లు కూడా ఇస్తూ ఉంటారు. ఈ సీజన్‌లో రియాల్టీ షోలో ప్రవేశించే ప్రముఖుల పేర్లను తెలుసుకోవాలని మీరందరూ చాలా ఆసక్తిగా ఉన్నారని మాకు తెలుసు.  ప‌లువురు సెలెబ్రిటీస్ పేర్లు ఇప్పటికే హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ప్ప‌టికీ కొంద‌రి పేర్లే ఖ‌ర‌మైన‌ట్లు తెలిసింది. 

ఈసారి బిగ్ బాస్ తెలుగు మేకర్స్ స్టార్ మా లో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు బిగ్ బాస్ 7  తెలుగులో యూట్యూబ్ స్టార్స్ కూడా ఉండబోతున్నారని తెలుస్తోంది. షో హోస్ట్ నాగ్ ఇటీవల మరో ప్రోమో కూడా చిత్రీకరించారు, ఇది వచ్చే వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు, షో మేకర్స్ తమను సంప్రదించలేదని పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఇప్పటికే  పేర్కొన్నారు. సరే, అంటే వారికి పాల్గొనే ఉద్దేశం ఉందని షో హోస్ట్ చేసే వారికి చెప్పకుండానే చెప్తున్నారు అనుకోండి. జాబితాలో చాలా మంది పెద్ద పేర్లు ఉన్నాయని తెలిసినా కచ్చితమైన సమాచారం కోసం ఎదురుచూడక తప్పదు.

ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది: 

గత సీజన్లలో కనిపించినట్లే, బిగ్ బాస్ తెలుగు 7 కూడా ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానెల్, స్టార్ మాలో ప్రసారం కానుంది. మొదటి చిన్న ప్రోమో సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది. ఈ ఆసక్తికరమైన రియాలిటీ షో తిరిగి వస్తున్నట్లు ప్రకటించింది, డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని మాట ఇస్తున్నారు. వర్గాల సమాచారం ప్రకారం, బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్‌లో స్టార్ మా లో ప్రసారం కానుంది. అయితే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ప్రతిరోజు ఒక ఆసక్తికరమైన అంశం గురించి కంటెస్టెంట్ల మధ్య జరిగే చర్చల గురించి ప్రేక్షకులు అయితే ఎదురుచూస్తున్నారని చెప్పుకోవాలి. మునపటి సీజన్లో, రేవంత్ విన్నర్ గా నిలిచినప్పటికీ, రన్నరప్గా నిలిచిన శ్రీహాన్ ఎక్కువ మొత్తంలో ప్రైజ్ మనీ గెల్చుకున్నాడు. చివరి క్షణంలో ఓటింగ్ లో శ్రీహన్ ముందంజలో ఉన్నప్పటికీ, ప్రైజ్ మనీ చేజారిపోతుందనే క్రమంలో తాను రన్నరప్గా నిలిచి రేవంత్ ని విన్నర్ చేశాడు.