మిస్‌ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీకి అనుష్కకు భారీ రెమ్యునరేషన్‌

నవీన్‌ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటిస్తున్న మిస్‌ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై ఆకట్టుకుంటుంది. చాలారోజుల గ్యాప్‌ తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం కావడంతో అందరిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి గాను అనుష్క భారీ రెమ్యునరేషన్ అందుకుంది.   ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండే అనష్క.. ఈ మధ్య సినిమాల నుంచికాస్త గ్యాప్‌ తీసుకుంది. ప్రభాస్‌ హీరోగా నటించిన బహుబలి పార్ట్ 1, 2 లో నటించి పాన్‌ […]

Share:

నవీన్‌ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటిస్తున్న మిస్‌ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై ఆకట్టుకుంటుంది. చాలారోజుల గ్యాప్‌ తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం కావడంతో అందరిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి గాను అనుష్క భారీ రెమ్యునరేషన్ అందుకుంది.  

ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండే అనష్క.. ఈ మధ్య సినిమాల నుంచికాస్త గ్యాప్‌ తీసుకుంది. ప్రభాస్‌ హీరోగా నటించిన బహుబలి పార్ట్ 1, 2 లో నటించి పాన్‌ వరల్డ్‌ వైడ్‌గా పాపులర్‌‌ అయ్యింది. ఈ సినిమాతో ప్రభాస్‌కు ఎంత పేరు వచ్చిందో.. అనుష్కకు కూడా అంతే పేరు వచ్చింది. అయితే, ఆమె నటించిన ఆఖరి సినిమా నిశ్శబ్దం తర్వాత మరే సినిమాలో నటించలేదు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు ‘మిస్‌ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు సినిమా లేడీ సూపర్‌‌స్టార్‌‌గా ఉన్న అనుష్కకు ఇండస్ట్రీలో ఫుల్‌ డిమాండ్‌ ఉంది. ఆమె అద్భుతమైన నటన, స్క్రీన్‌ ప్రెజెన్స్‌, అందం ఆమెకు విపరీతమైన అభిమానులను సంపాదించి పెట్టింది. చాలా రోజుల నుంచి ఆమె నటించిన చిత్రం కోసం ఆడియన్స్‌ ఎదురుచూస్తూ ఉన్నారు. ఆడియన్స్ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌ చెబుతూ మిస్‌ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో రాబోతోంది.

రూ.6 కోట్ల పారితోషికం.

అనుష్కకు ఉన్న డిమాండ్‌ వల్ల ఆమె నటించిన తాజా చిత్రంలో  భారీగా రెమ్యునరేషన్‌ అందుకుందని ఇండస్ట్రీ వర్గాల టాక్‌. మిస్‌ శెట్టి, మిస్టర్ పోలిశెట్టిలో చెఫ్‌ పాత్రకుగాను అనుష్కరూ.6 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుందని సమాచారం. దీని ముందు  సినిమాకు రూ.3 కోట్లు తీసుకుందని తెలిసింది. అనుష్కకు ఉన్న మార్కెట్‌ ను బట్టి ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసినట్లు సమాచారం. దీంతో ఆమె ప్రస్తుతం సౌతిండియా చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో అనుష్క కూడా ఒక్కరు. స్టార్‌‌ హీరోలు రాజ్యమేలుతున్న చిత్ర పరిశ్రమలో అనుష్క, నయనతార,సమంతా వంటి హీరోయిన్లు అత్యధికంగా  రెమ్యునరేషన్‌ అందుకుంటున్నారు. 

అలరిస్తున్న ట్రైలర్‌‌.

మిస్‌ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో అనుష్క శెట్టి పెళ్లి కాకుండా తల్లి అవ్వాలని కోరుకునే పాత్ర. వృత్తిరీత్యా చెఫ్‌ అయిన అనుష్క. వివాహ సంప్రదాయాలు, పెళ్లి కాకుండా ఒక బిడ్డను కలిగి ఉండాలని కోరుకుంటుంది. ఆమె సరసన జాతిరత్నాలు ఫేమ్‌ నవీన్‌ పోలిశెట్టి స్టాండ్‌అప్‌ కమెడియన్‌ గా నటించాడు. ఇద్దరూ వేర్వేరు నేపథ్యాలతో విభిన్నమైన కాథాంశంతో డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇద్దరి మధ్య మంచి ఆకర్షనీయమైన ప్రేమకథను తీశాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌‌ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. నవీన్‌ పోలిశెట్టి కామెడీ టైమింగ్‌, స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బాగున్నాయి. నిర్మాణ విలువకు ఢోకా లేదు. చాలా గ్రాండ్‌గా ఈ మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. 

 మహేశ్‌బాబు.పి దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ మూవీలో సీనియర్‌‌ నటులు జయసుధ, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాధన్‌ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. మిస్‌ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సెప్టెంబర్‌‌ 7న తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అదే టైమ్‌లో అట్లీ డైరెక్షన్‌లో షారుఖ్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ సినిమా కూడా రిలీజ్‌ కానుంది. ఇందులో  నయనతార హీరోయిన్‌ కాగా, దీపికా పదుకొనే, విజయ్ సేతుపతి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

కాగా, బహుబలి సినిమాలో ప్రభాస్‌ సరసన నటించి అనుష్క మంచి మార్కులు కొట్టేసింది. దేవసేన పాత్రలో అనుష్క తప్ప ఇంకెవరూ సరిపోని విధంగా ఆ సినిమాలో ఆమె నటన ఆకట్టుకుంది. బహుబలి తర్వాత కొంత గ్యాప్‌ తీసుకున్న తర్వాత మాధవన్‌ హీరోగా వచ్చిన నిశ్శబ్దం సినిమాలో చాలెంజింగ్‌ క్యారెక్టర్‌‌లో నటించింది. ఇందులో చెవిటి, మూగ పాత్రలో నటించి అలరించింది. కానీ, ఈ మూవీ జనాలను అంతగా అకట్టుకోలేదు.