జవాన్ మూవీ తొలి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేయొచ్చంటే?

షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా నేడు (సెప్టెంబర్ 7) రిలీజ్ కానుంది. ఈ చిత్రం తొలి రోజు ఎంత కలెక్షన్లను రాబడుతుందో అంచనాలు వెలువడుతున్నాయి.  తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం రిలీజ్‍కు సిద్ధమైంది. నేడు (సెప్టెంబర్ 7) ఈ సినిమా థియేటర్లలో హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా అడ్వాన్స్ బుకింగ్స్ […]

Share:

షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా నేడు (సెప్టెంబర్ 7) రిలీజ్ కానుంది. ఈ చిత్రం తొలి రోజు ఎంత కలెక్షన్లను రాబడుతుందో అంచనాలు వెలువడుతున్నాయి.

 తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం రిలీజ్‍కు సిద్ధమైంది. నేడు (సెప్టెంబర్ 7) ఈ సినిమా థియేటర్లలో హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగాయి. ఇండియాతో పాటు విదేశాల్లోనూ జవాన్‍కు బుకింగ్స్ అంచనాలకు మించి జరిగాయి. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ చిత్రంపై బజ్ మరింత పెరిగింది. సినీ ప్రేక్షకులందరూ ఈ సినిమా కోసం వేచిచూశారు. దీంతో జవాన్ అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగాయి. 

‘జవాన్’  సినిమా స్పెషల్ షోను బుధవారం రాత్రి అంధేరిలోని వైఆర్ఎఫ్ స్టూడియోలో ప్రదర్శించారు. ఈ సినిమా చూసిన దర్శకుడు ముఖేష్ ఛాబ్ర, ర్యాపర్ రాజకుమారి తమ ఫస్ట్ రియాక్షన్‌ను షేర్ చేసుకున్నారు. కత్రినా కైఫ్, సుహానా ఖాన్, హృతిక్ రోషన్ తదితర సెలబ్రిటీలు ఈ షోకు హాజరయ్యారు. ఈ షో పూర్తయిన తరవాత కొంత మంది సెలబ్రిటీలు సినిమాపై స్పందించారు. ఈ సినిమాకు కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన ముఖేష్ ఛాబ్ర కూడా ‘జవాన్’ చూశారు. ఇక ఈయన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఇది ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ బాలీవుడ్, పాన్ ఇండియా సినిమాల్లో ఒకటని కొనియాడారు.

తన అభిమాప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్న ముఖేష్.. ‘జవాన్ ఒక ఎయోషనల్ రోలర్ కోస్టర్’. ఈ సినిమాలో నన్ను కూడా భాగం చేసినందుకు షారుఖ్ ఖాన్, అట్లీ, గౌరవ్ వర్మకు ధన్యవాదాలు. ఒకవేళ నేను ఈ సినిమాలో భాగం కాకపోయినా, ఇది మాత్రం నాకు గూస్‌బంప్స్ ఇచ్చేది. నేను చూసిన బెస్ట్ బాలీవుడ్, పాన్ ఇండియా సినిమాల్లో ఇదీ ఒకటి. మెసేజ్‌తో కూడి మాసీ మూవీ’ అని పేర్కొన్నారు. అలాగే, దీపి పదుకొనె, నయనతార, సాన్య మల్హోత్ర, సునీలో గోవర్, ఇతర జవాన్ నటీనటులను ఆయన పొగిడారు. అంతేకాదు ఈ సినిమాకు ఆయన 10 స్టార్లు ఇచ్చారు.

మరి తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉందంటే..

జవాన్ సినిమా తొలి రోజు రూ.75 కోట్ల నుంచి రూ.80కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్‍లను సాధించడం పక్కా అని ట్రేడ్ ఎనలిస్టులు లెక్కలు వేశారు. అడ్వాన్స్ బుకింగ్‍లను పరిగణనలోకి తీసుకొని ఈ అంచనాలను వెల్లడిస్తున్నారు. షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తుండటంతో బాలీవుడ్‍లో జవాన్‍కు విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే, ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేయడం, విజయ్ సేతుపతి, నయనతార లాంటి యాక్టర్లు ఉండటంతో సౌత్‍లోనూ జవాన్‍కు మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో తొలి రోజు ఈ సినిమాకు భారీ కలెక్షన్లు ఖాయంగా కనిపిస్తోంది. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ తొలి రోజు కలెక్షన్లను జవాన్ క్రాస్ చేయడం ఖాయమే అనిపిస్తోంది.

ఈ ఏడాది విడుదలైన పఠాన్ సినిమా తొలి రోజు రూ.57కోట్లను కలెక్ట్ చేసింది. హిందీ వెర్షనే సుమారు రూ.55కోట్లను రాబట్టింది. అయితే, ఈ సారి జవాన్ విషయంలో మాత్రం హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ ఫుల్ క్రేజ్ కనిపిస్తోంది. దీంతో జవాన్ తొలి రోజు ప్రపంచవ్యాప్త కలెక్షన్లు రూ. 80 కోట్ల వరకు వస్తుందని చాలా మంది అంచనాలు వేస్తున్నారు. మరికొందరేమో విదేశాల్లోనూ బుకింగ్స్ అదిరిపోవటంతో ఫస్ట్ డే రూ.100 కోట్లు వస్తాయని చెబుతున్నారు. మొత్తంగా తొలి రోజు కలెక్షన్ల విషయంలో పఠాన్‍ను జవాన్ దాటడం ఖాయంగా కనిపిస్తోంది.

జవాన్ చిత్రంలో షారుఖ్ సరసన నయనతార హీరోయిన్‍గా నటిస్తుండగా.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‍ పాత్ర పోషించారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. దీపికా పదుకొణ్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. ప్రియమణి, సునీల్ గ్రోవర్, సాన్య మల్హోత్రా, యోగిబాబు కీ రోల్స్ చేశారు. ఆరు గెటప్‍లు, రెండు పాత్రల్లో షారుఖ్ ఈ చిత్రంలో కనిపిస్తారని ట్రైలర్ చూస్తే అర్థమైంది. మొత్తంగా షారుఖ్ అభిమానులకు జవాన్ పండగలా ఉంటుందని అంచనాలు ఉన్నాయి.