ర‌జినీకాంత్ ముందు డ్యాన్స్

రజనీకాంత్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం జైలర్(Jailer Movie), జూలై 06వ తేదీన ఈ చిత్రం నుండి కావాలా సాంగ్ ను విడుదల చేసారు. ఈ పాట ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది.  జైలర్ సినిమా (Jailer Movie)నుండి విడుదల అయిన కావాలా సాంగ్ (Kavalaa Song) సోషల్ మీడియాలో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తూనే ఉన్నాయి, ఈ పాటలో తమన్నా భాటియా(Tamanna Bhatia) వేసిన […]

Share:

రజనీకాంత్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం జైలర్(Jailer Movie), జూలై 06వ తేదీన ఈ చిత్రం నుండి కావాలా సాంగ్ ను విడుదల చేసారు. ఈ పాట ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది. 

జైలర్ సినిమా (Jailer Movie)నుండి విడుదల అయిన కావాలా సాంగ్ (Kavalaa Song) సోషల్ మీడియాలో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తూనే ఉన్నాయి, ఈ పాటలో తమన్నా భాటియా(Tamanna Bhatia) వేసిన స్టెప్పులు చూస్తున్న కుర్ర కారుని కూడా ఊపేస్తున్నాయి. ఇన్స్తాగ్రాం రీల్స్ లో కూడా ఈ పాట విడుదల అయినప్పటి నుండి ట్రెండ్ లోనే ఉంది. 

తాజాగా తమన్నా భాటియా జైలర్ సినిమా ఆడియో లాంచ్ లో కావాలా సాంగ్ (Kavalaa Song)కు స్టేజ్ మీద స్టెప్పులు వేశారు. ఆడియో లాంచ్ కు వచ్చిన అనేక మంది ప్రేక్షకులతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)కూడా తమన్నా భాటియా డ్యాన్స్ ను వీక్షించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ముందు డ్యాన్స్ చేయడం గురించి తమన్నా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్టు పెట్టారు. 

“కావాలా సాంగ్ (Kavalaa Song) ను ఇష్టపడే అద్భుతమైన అభిమానుల ముందు ప్రదర్శన ఇచ్చినందుకు మనసు ఉప్పొంగిపోయింది, ప్రేక్షకులలో సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)గారు ఉండడం మరింత ప్రత్యేకమైనది గూస్ బంప్స్, నా హృదయం లోతుల్లో నుండి మీ అందరినీ ప్రేమిస్తున్నాను” అని తమన్నా వివరించింది. 

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)లీడ్ రోల్ లో నటిస్తున్న యాక్షన్ మూవీ జైలర్(Jailer Movie) ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్(Shiva Rajkumar) ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు.  ఈ సినిమా కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ జైలర్ గా కనిపించనున్నారు. బాలీవుడ్ యాక్టర్ జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణ, యోగి బాబు, తమన్నా భాటియా, ప్రియాంక అరుల్ మోహన్ , వసంత్ రవి, వినాయకన్ తదితరులు ఈ చిత్రం(Jailer Movie) లో నటిస్తున్నారు. 

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) జైలర్ చిత్రంలో ఒక అతిధి పాత్రలో నటించడం విశేషం. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ మీద కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గత కొంత కాలంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కు సరైన హిట్ లేకపోవడంతో అభిమానులు అందరూ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జైలర్ లుక్ లో రజనీకాంత్ మాస్ లుక్ లో అదరకొడితే ఈ చిత్రంలో పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి, దాంతో ఒక్కసారిగా ఈ సినిమా మీద అంచనాలు తారాస్థాయి కు చేరుకున్నాయి. మరి సినిమా ను థియేటర్ లో చూడాలి అంటే ఆగస్టు 11 వ తేదీ వరకూ ఆగాల్సిందే.