జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా తీయాలని ఉంది.. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్‌ కామెంట్స్

టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి ఎలాంటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.  చిన్న వయస్సులోనే ఇండియాలో ఎవరికీ సాధ్యం కానీ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇండస్ట్రీలోకి వచ్చిన రెండేళ్ల లోపే సాధించాడు. ఆయన అద్భుతమైన నటన మరియు డ్యాన్స్ చూసి ఎదో ఒక రోజు ఈ చిచ్చర పిడుగు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను తన అద్భుతమైన నటనతో మైమరచిపొయ్యేలా చేస్తాడని అభిమానులు కోరుకున్నారు. వాళ్ళ కోరికకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ ఇప్పుడు #RRR సినిమా […]

Share:

టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి ఎలాంటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.  చిన్న వయస్సులోనే ఇండియాలో ఎవరికీ సాధ్యం కానీ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇండస్ట్రీలోకి వచ్చిన రెండేళ్ల లోపే సాధించాడు. ఆయన అద్భుతమైన నటన మరియు డ్యాన్స్ చూసి ఎదో ఒక రోజు ఈ చిచ్చర పిడుగు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను తన అద్భుతమైన నటనతో మైమరచిపొయ్యేలా చేస్తాడని అభిమానులు కోరుకున్నారు. వాళ్ళ కోరికకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ ఇప్పుడు #RRR సినిమా తో ప్రపంచం లోనే పాపులర్ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు ప్రతీ టాప్ డైరెక్టర్ ఎన్టీఆర్‌తో సినిమాలు చేయడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొరటాల శివతో ఒక సినిమా చేస్తున్న ఎన్టీఆర్ , ఈ చిత్రం తర్వాత బాలీవుడ్‌లో తెరకెక్కబోయ్యే ‘వార్ 2 ‘ లో నటించబోతున్నాడు.

ఈ న్యూస్‌ని ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఇప్పుడు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ మరో థ్రిల్లింగ్ మ్యాటర్ చెప్పాడు. ఎన్టీఆర్‌‌తో ఒక సినిమా చెయ్యాలని ఉందని తన కోరిక బయటపెట్టాడు. దీంతో సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యింది. జేమ్స్ గన్ ఇది వరకు ‘గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ’ మరియు ‘సూసైడ్ స్క్వాడ్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తీసాడు. అలాంటి డైరెక్టర్ ఎన్టీఆర్ నటనని మెచ్చుకోవడం, అతనితో సినిమా చెయ్యాలని ఉందని చెప్పడం నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‍‌కి, నందమూరి అభిమానులకు ఎంతో గర్వకారణం అనే చెప్పొచ్చు. అన్నీ కుదిరి ఎన్టీఆర్‌తో జేమ్స్ గన్ సినిమా ప్రారంభిస్తే ప్రతీ తెలుగువాడు ఎంతో గర్వించొచ్చని అభిమానులు అనుకుంటున్నారు. మరో పక్క #RRR లో మరో హీరోగా నటించిన రామ్ చరణ్ కూడా త్వరలో ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించబోతున్నాను అని అధికారికంగా తెలియచేసిన సంగతి తెలిసిందే.

‘టైటానిక్’ మరియు,  ‘అవతార్’ సిరీస్  వంటి వెండితెర దృశ్య కావ్యాలను తెరకెక్కించిన జేమ్స్ కెమరూన్ కూడా గతంలో రామ్ చరణ్‌ని మెచ్చుకోవడం మనం గమనించొచ్చు. అప్పట్లో రామ్ చరణ్‌ని పొగుడుతూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా మొత్తాన్ని ఒక ఊపు ఊపేసాయి. అప్పుడు రామ్ చరణ్‌తో, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌తో హాలీవుడ్ క్రేజీ డైరెక్టర్స్ సినిమాలు చెయ్యాలని ఆసక్తి చూపడాన్ని చూస్తుంటే మన తెలుగు సినిమా స్థాయి ఏ రేంజ్‌కి ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. రాబేయే రోజుల్లో ఈ #RRR హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకెన్ని ప్రభంజనాలు సృష్టించబోతున్నారో చూడాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివతో, రామ్ చరణ్ శంకర్‌తో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కాబోతున్నాయి, ఈ రెండు సినిమాల ద్వారా ఈ ఇద్దరు హీరోలు ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తారో చూడాలి. ఎన్టీఆర్ – కొరటాల సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కాబోతుంది, రామ్ చరణ్ శంకర్ గేమ్ చేంజర్ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.