ఛత్రపతి హిందీ రీమేక్ విడుదల తేదీ ఖరారు

వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఛత్రపతి చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్, నుశ్రత్ భారుచ్చా, అమిత్ నాయర్, రాజేంద్ర గుప్తా, స్వప్నిల్ మరియు ఆశిష్ సింగ్ నటించారు. ఛత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించగా.. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్, నుశ్రత్ భారుచ్చా ప్రధాన పాత్రల్లో నటించగా.. అమిత్ నాయర్, రాజేంద్ర గుప్తా, స్వప్నిల్, ఆశిష్ సింగ్ మరిన్ని పాత్రల్లో నటించారు. తెలుగులో SS రాజమౌళి  దర్శకత్వం వహించిన ఛత్రపతి […]

Share:

వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఛత్రపతి చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్, నుశ్రత్ భారుచ్చా, అమిత్ నాయర్, రాజేంద్ర గుప్తా, స్వప్నిల్ మరియు ఆశిష్ సింగ్ నటించారు.

ఛత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించగా.. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్, నుశ్రత్ భారుచ్చా ప్రధాన పాత్రల్లో నటించగా.. అమిత్ నాయర్, రాజేంద్ర గుప్తా, స్వప్నిల్, ఆశిష్ సింగ్ మరిన్ని పాత్రల్లో నటించారు.

తెలుగులో SS రాజమౌళి  దర్శకత్వం వహించిన ఛత్రపతి సినిమాని అదే పేరుతో వివి వినాయక్ హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని యూనిట్ ప్రకటించింది,  సోమవారం ట్విట్టర్‌‌లో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా విడుదల తేదీతో పాటు సినిమా పోస్టర్‌ను షేర్ చేశారు.

“మే 12, 2023న ఛత్రపతి సినిమా థియేటర్లలోకి రానుంది. మేము పడ్డ మా కష్టాన్ని, ఈ యాక్షన్ ప్యాక్డ్ ధమాకాను మీకు చూపించడానికి నేను  మీ ముందుకు వస్తున్నాను, విజయేంద్ర ప్రసాద్ రచించిన ఈ సినిమాకు..  వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ఇదే”  అని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు బెల్లంకొండ శ్రీనివాస్. 

కాగా.. అతను షేర్ చేసిన చిత్రంలో, అతను కలశం పట్టుకొని నదిలో నిలబడి కండరాలను వంచుతున్నట్లు కనిపిస్తాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ కోసం చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. మరోవైపు తెలుగు ఛత్రపతిలోని ప్రభాస్‌లాగా కనబడాలని శాయాశక్తులా కష్టపడినట్టు సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్‌‌ను చిత్రసీమకు పరిచయం చేసిన దర్శకుడు కూడా వి.వి. వినాయకే కావడం విశేషం. బెల్లంకొండ శ్రీనివాస్‌‌ మొదటి చిత్రం “అల్లుడు శీను” కు వి.వి. వినాయక్ దర్శకత్వం వహించారు.

రాజమౌళి తండ్రి వి.విజయేంద్ర ప్రసాద్ రాసిన ఛత్రపతి మూవీ తెలుగులో 2005 లో  విడుదల అయ్యింది. ఇద్దరు సవతి సోదరుల మధ్య జరిగిన వైరం గురించి ఈ సినిమాలో వివరించారు. ఈ ప్రముఖ స్క్రీన్ రైటర్ హిందీ రీమేక్ కథను కూడా రాశారు. ఈ చిత్రానికి ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వం  వహించగా.. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా పని చేశారు. ఈ మూవీని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి నిర్మాణ సంస్థ నిర్మించింది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించగా.. ఛాయాగ్రహణం సెంధిల్ కుమార్ అందించారు. ప్రభాస్, శ్రియ, ప్రదీప్ రావత్, భానుప్రియ, జయప్రకాశ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. 

కాగా.. ప్రభాస్ నటించిన ఈ  సినిమా ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 100 రోజులు నడిచింది. ఆ రోజుల్లో ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టించింది.

వచ్చే నెల(మే 12) 12న విడుదల కానున్న ఛత్రపతి (2023) ద్వారా  బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో అరంగేట్రం చెయ్యనున్నారు.  అయితే ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు, ఈ చిత్రంలో నుశ్రత్ బారుచ్చా, అమిత్ నాయర్, రాజేంద్ర గుప్తా, స్వప్నిల్, ఆశిష్ సింగ్ కూడా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి.. తనిష్క్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు.