పెళ్లిపై హీరో విశాల్ కామెంట్స్

యాక్షన్ హీరో విశాల్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. హిట్లు ఫ్లాప్ లను విశాల్ అస్సలు పట్టించుకోరు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు విశాల్. విశాల్ షూటింగ్స్ తో క్షణం గ్యాప్ లేకుండా గడిపేస్తున్నారు…  అయితే తమిళ స్టార్​ హీరో విశాల్ పెళ్లి పై గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. హీరోయిన్ లక్ష్మీ మీనన్‌తో విశాల్ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే వీరి పెళ్లి అంటూ […]

Share:

యాక్షన్ హీరో విశాల్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. హిట్లు ఫ్లాప్ లను విశాల్ అస్సలు పట్టించుకోరు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు విశాల్. విశాల్ షూటింగ్స్ తో క్షణం గ్యాప్ లేకుండా గడిపేస్తున్నారు… 

అయితే తమిళ స్టార్​ హీరో విశాల్ పెళ్లి పై గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. హీరోయిన్ లక్ష్మీ మీనన్‌తో విశాల్ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే వీరి పెళ్లి అంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. ఈ పెళ్లి వార్తలపై విశాల్ టీం స్పందించింది. విశాల్, లక్ష్మీ మీనన్‌ పెళ్లి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పుకొచ్చింది. తాజాగా తన పెళ్లి వార్తలపై స్వయంగా విశాల్ స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న పెళ్లి వార్తను పూర్తిగా ఖండిస్తున్నాను అని ఓ ట్వీట్ చేశారు.

విశాల్ తన సినిమా పనులు చేసుకుంటూ బిజీగా ఉంటాడు. అప్పుడప్పుడు రాజకీయాల మీద మాట్లాడుతూ ఉంటారు . ఇవి తప్ప విశాల్‌కి వేరే ధ్యాస ఉండదని తెలుస్తోంది. అయితే విశాల్ పర్సనల్ లైఫ్ మాత్రం అంత సవ్యంగా సాగడం లేదని కనిపిస్తోంది. విశాల్ పెళ్లి విషయంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతూనే ఉంది. విశాల్ వరలక్ష్మీ శరత్ కుమార్ వ్యవహారం పెళ్లి వరకు వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుని, ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకోవాల్సి వచ్చింది. నడిగర్ ఎన్నికలు వీరిద్దరి మధ్య మరింత గ్యాప్‌ను పెంచేశాయి. వరలక్ష్మీ తండ్రి శరత్ కుమార్ మీద విశాల్ చేసిన ఆరోపణలు లే బ్రేకప్‌కు కారణమని తెలుస్తోంది.

ఆ తరువాత విశాల్ పెళ్లి వార్తలు ఎక్కువగా వినిపించలేదు… మళ్లీ కొన్ని రోజులకు తెలుగు అమ్మాయి అనీషాతో విశాల్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక పెళ్లి జరిగిపోతోందని అనుకునే సమయంలో ఆ బంధానికి బ్రేకులు పడ్డాయి. ఇలా పెళ్లి కాక ముందే బ్రేకప్పులు జరుగుతున్నాయి. ఆ తరువాత మళ్లీ కొన్ని రోజులు విశాల్ పెళ్లి వార్తలు ఎక్కడా కనిపించలేదు. తెలుగు నటి అభినయతో విశాల్ ప్రేమలో పడిపోయారు , త్వరలోనే వీరిద్దరికి పెళ్లి జరుగుతుందని టాక్ బయటకు వచ్చింది.

అయితే రెండు మూడు రోజుల నుంచి విశాల్ ప్రేమ, పెళ్లి మీద మరో రూమర్ బయటకు వచ్చింది. నటి లక్ష్మీ మీనన్‌తో విశాల్ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతోన్నారంటూ టాక్ వచ్చింది. ఈ వార్తలు చివరకు విశాల్ వరకు వెళ్లినట్టున్నాయి. వెంటనే విశాల్ టీం అలర్ట్ అయింది. ఈ రూమర్లను కొట్టిపడేసింది. 

రూమర్స్​ గురించి స్పందించిన విశాల్… 

సాధారణంగా నేను సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్, రూమర్స్​ గురించి స్పందించను. . అనవసరం అనుకుని వదిలేస్తాను. కానీ, ఈసారి స్పష్టత ఇవ్వాల్సి వస్తుంది. లక్ష్మీ మీనన్ తో నా వివాహం అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఇందులో ఏ నిజం లేదు. నేను ఇప్పుడు స్పందించడానికి ఓ కారణం ఉంది. లక్ష్మీ మీనన్‌ నటిగా కంటే.. ఓ అమ్మాయి. మీరు ఒక అమ్మాయి వ్యక్తిగత జీవితం గురించి ఇలా చెప్పి తన ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు. ఆమె ఇమేజ్‌ను కించపరిచారు. . సమయం వచ్చినప్పుడు నా పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటిస్తా అని విశాల్ పేర్కొన్నారు.

ప్రస్తుతం విశాల్ మార్క్ ఆంటోని మూవీ తో బిజీ గా ఉన్నారు .. ఇది వినాయక చవితి స్పెషల్‌గా రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. మార్క్ ఆంటోని సినిమాలో విశాల్ డిఫరెంట్ లుక్కులో కనిపించబోతోన్నారు