ఓటీటీ లోకి వచ్చేస్తున్న ధనుష్ సార్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నేరుగా తెలుగులో నటించిన మొదటి సినిమా సార్. ఇది తమిళంలో వాతిగా తెరకెక్కింది. ఈ ద్విభాషా చిత్రాన్ని వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కించారు.. ఈ సినిమాలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ కూడా నటించింది. అక్కినేని సుమంత్, తనికెళ్ల భరణి, సముద్రఖని, హైపర్ ఆది కీలక పాత్రలో నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్టీ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన సార్ సినిమా ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా […]

Share:

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నేరుగా తెలుగులో నటించిన మొదటి సినిమా సార్. ఇది తమిళంలో వాతిగా తెరకెక్కింది. ఈ ద్విభాషా చిత్రాన్ని వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కించారు.. ఈ సినిమాలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ కూడా నటించింది. అక్కినేని సుమంత్, తనికెళ్ల భరణి, సముద్రఖని, హైపర్ ఆది కీలక పాత్రలో నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్టీ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన సార్ సినిమా ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలైంది. ఈ సినిమా మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.. ధనుష్ కెరియర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌ను అందుకుంది. చదువుకుందాం.. చదువు కొనకూడదు అనే అద్భుతమైన సోషల్ మెసేజ్‌తో వచ్చిన ఈ సినిమాకి.. విమర్శకుల ప్రశంసలు సైతం అందాయి. చదువుకు ఉన్న విలువను గురించి చర్చిస్తూనే.. మంచి మాస్, కమర్షియల్ హంగులు ఉండడంతో సార్.. సినిమా ఊచ కోత కలెక్షన్లను వసూలు చేసింది. ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. థియేటర్స్‌లో సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న సార్.. ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెర పడింది. ధనుష్ సినిమా ఓటిటి రిలీజ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది.

ప్రీ రిలీజ్ బిజినెస్

ధనుష్ సార్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.5.50 కోట్ల బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రూ.6 కోట్లుగా ఫిక్స్ అయింది. అలాగే తమిళనాడులో రూ.19 కోట్లు, కర్ణాటకలో రూ.3 కోట్లు, రెస్ట్ ఆఫ్ భారత్‌లో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లు కాగా.. వరల్డ్ వైడ్‌గా రూ. 35 కోట్లు బిజినెస్ చేసింది. దీంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్లు రూ.36 కోట్లుగా నమోదయింది.. 

26 రోజుల కలెక్షన్స్

ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వచ్చిన సార్ సినిమాకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో 26 రోజుల్లో రూ.23.46 కోట్లు షేర్, రూ. 44.60 కోట్లు గ్రాస్ సాధించింది. అదే విధంగా వరల్డ్ వైడ్‌గా 26 రోజుల్లో రూ.117.37 కోట్లు గ్రాస్, రూ.61.17 కోట్లు షేర్ కలెక్షన్స్‌ను వసూలు చేసింది. ధనుష్ సార్ సినిమా తెలుగు రాష్ట్రాలతోనే కాకుండా కర్ణాటక, ఓవర్సీస్ అన్నింటిలోనూ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపే కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమా రెండు రెట్లకు పైగా లాభాలను అందుకొని, ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ హిట్టును అందుకుంది. 

ఓటీటీ స్ట్రీమింగ్

ధనుష్ సార్ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్  భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. మార్చి 17 నుంచి సార్ తెలుగు, తమిళ భాషల్లో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ఈ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సార్ వస్తున్నాడు.. అందరూ క్లాసులకు అటెండ్ కావాల్సిందే అంటూ రిలీజ్ డేట్ పోస్టర్‌ను షేర్ చేసింది. మరి థియేటర్లో సార్ క్లాసులను మిస్ అయిన వారు.. ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేయండి.