Mihika Daggubati: రానా దగ్గుబాటికి భార్య మిహీకా బహిరంగ ప్రశ్న..!

రానా దగ్గుబాటి(Rana Daggubati) ఇటీవల ఒక ప్రచార కార్యక్రమంలో కనిపించాడు. అతని స్టైలిష్ మరియు కాన్ఫిడెంట్ లుక్.. సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందింది. అతని భార్య మిహీకా దగ్గుబాటి(Mihika Daggubati) కూడా తమ వ్యక్తిగత క్షణాలను సోషల్ మీడియా(Social Media)లో పంచుకోవడం వాటికి ఫన్నీ క్యాప్షన్‌(Funny caption)లను జోడించడంతో అభిమానులచే ఫాలో చేయబడుతుంది.  మిహీక ఇటీవల తన భర్తను ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో ఒక ప్రశ్న అడిగింది. కొత్త ఫర్నీచర్ (furniture) ఫోటోను పోస్ట్ చేసి దానికి క్యాప్షన్ […]

Share:

రానా దగ్గుబాటి(Rana Daggubati) ఇటీవల ఒక ప్రచార కార్యక్రమంలో కనిపించాడు. అతని స్టైలిష్ మరియు కాన్ఫిడెంట్ లుక్.. సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందింది. అతని భార్య మిహీకా దగ్గుబాటి(Mihika Daggubati) కూడా తమ వ్యక్తిగత క్షణాలను సోషల్ మీడియా(Social Media)లో పంచుకోవడం వాటికి ఫన్నీ క్యాప్షన్‌(Funny caption)లను జోడించడంతో అభిమానులచే ఫాలో చేయబడుతుంది. 

మిహీక ఇటీవల తన భర్తను ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో ఒక ప్రశ్న అడిగింది. కొత్త ఫర్నీచర్ (furniture) ఫోటోను పోస్ట్ చేసి దానికి క్యాప్షన్ ఇచ్చింది. రానాను వారి ఇంట్లో దాని కోసం స్థలం ఇవ్వగలరా? అని అడిగింది. వారి అభిమానులు దీన్ని స్వీట్‌గా భావించి ఇష్టపడ్డారు. మిహీకా ఇంటీరియర్ డిజైన్(Interior design) మరియు డెకరేషన్‌(Decoration)కు సంబంధించిన వ్యాపారాన్ని కలిగి ఉంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో జంతువులు మరియు ప్రకృతి ప్రింట్‌లతో బ్లాక్ కలర్ ఆఫ్-వైట్ సోఫా(Sofa) చిత్రాన్ని పోస్ట్ చేసింది. అభిమానులు చాలా మంచి కామెంట్స్ చేసారు. ఒక వ్యక్తి ఇది ఒక అందమైన కళాఖండమని చెప్పాడు, మరికొందరు రానా దగ్గుబాటి దానికి ఇంకా సమాధానం ఇవ్వలేదని గమనించారు. మిహీకా ఫర్నిచర్ డిజైన్‌ చాలా బాగుందని ప్రశంసించారు.

రానా దగ్గుబాటి మరియు మిహీకా దగ్గుబాటి ఆగస్టు 8, 2020న కోవిడ్-19 లాక్‌డౌన్(Lock Down) సమయంలో వివాహం చేసుకున్నారు. మహమ్మారి నిబంధనల కారణంగా రామానాయుడు స్టూడియోస్‌లో కేవలం 30 మందితో చిన్నగా ఉండాల్సి వచ్చినప్పటికీ, రానా తమ పెళ్లికి ఇదే సరైన సమయమని భావించారు.

పెళ్లి తర్వాత నాలో వచ్చిన మార్పు ఇదే

దగ్గుపాటి హీరో రానా తాజాగా ఓ ప్రత్యేక కార్యక్రమంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. “నాతో పాటు నా భార్య కూడా ఓ ఆర్టిస్ట్. తను కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో మేమిద్దరం కలిసి పనిచేస్తాం. నిజానికి అది నా జాబ్ కాదు. కానీ అది లైఫ్ స్టైల్ లో భాగం. నా భార్య ఆ లైఫ్ స్టైల్ ని ఎంతో ఎంజాయ్ చేస్తుంది. దానికోసం మా ఇద్దరికీ సరిపడా సమయం దొరుకుతుంది. ఆ లైఫ్ స్టైల్ నన్ను ఓ బ్యాలెన్స్డ్ హ్యూమన్ బీయింగ్ గా మార్చింది. 

ఈ లైఫ్ స్టైల్(Life Style) కి నేను అలవాటు పడకపోయి ఉంటే నిలకడగా లేకుండా దేశం మొత్తం తిరిగి వచ్చేవాడిని. పెళ్లి తర్వాత నా లైఫ్ లో జరిగిన బెస్ట్ పార్ట్ ఏంటంటే, బాధ్యతలు తెలిసి రావడం. పెళ్లి తర్వాత మనం చేయాల్సిన పనులు ఉన్నాయని మనకు తెలుస్తుంది. అదే పెళ్లికి ముందు మనం ఏం చేయాలనేది మనకు తెలియదు. మనకు ఎవరు చెప్పరు. ఏదో తోచింది చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ పెళ్లి తర్వాత అలా కాదు. మనం ఎప్పుడు ఏం చేయాలనేది మనకు తెలుస్తుంది. బాధ్యతలు తెలిసి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అయ్యాను” అంటూ చెప్పారు.

హిరణ్యకశ్యప్ కాన్సెప్ట్ టీజర్..

రానా(Rana) వివిధ రకాల సినిమాల్లో తన బహుముఖ నటనకు ప్రసిద్ది చెందాడు మరియు అతను స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్(Spirit Media) అనే వీఎఫ్ఎక్స్(VFX) కంపెనీని కూడా నడుపుతున్నాడు. అతను ఇటీవలే శాన్ డియాగో కామిక్-కాన్ 2023లో తన రాబోయే పౌరాణిక చిత్రం “హిరణ్యకశ్యప్”ని(Hiranyakashyap) ప్రకటించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) ఈ చిత్రానికి కథ అందించబోతున్నట్లు తెలుస్తుంది. హిరణ్యకశ్యపుడి పౌరాణిక గాధని ఈ సినిమాలో ఎంతో ఆసక్తికరంగా చూపించబోతున్నారని సమాచారం.. అయితే తాజాగా ఈ చిత్ర కాన్సెప్ట్ టీజర్(Concept teaser) ని రానా విడుదల చేశారు. హిరణ్య కశ్యపుడి కార్టూన్ చిత్రాల రూపంలో ఉన్న వీడియో ను షేర్ చేశారు. ఈ వీడియోలో అనేక అంశాలు దాగి ఉన్నాయి. హిరణ్యకశ్యపుడిగా రానా లుక్ ఎంతో క్రూరంగా ఉండబోతుందని ఈ కాన్సెప్ట్ టీజర్(Concept teaser) తో తెలియజేశారు.