ఫ్యామిలీ గురించి మాట్లాడిన‌ హేమమాలిని

ఒకప్పుడు హేమమాలిని సినిమాలు చూసేందుకు ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తూ ఉండేవారు. ఇప్పుడు హేమమాలిని కూతుర్లు, తమ దైనశైలిలో సినిమాలలో నటిస్తూ మళ్ళీ అలనాటి హేమమాలిని చిత్రాలను గుర్తు చేస్తున్నారు. హేమమాలిని ఇటీవల తమ ఫ్యామిలీ గురించిన విషయాలు బయట మాట్లాడింది. ముఖ్యంగా ప్రజలలో ఉన్న అపోహను దూరం చేసేందుకు ఆమె ఓపెన్ అయినట్లు తెలుస్తోంది.  ఫ్యామిలీ గురించి మాట్లాడిన హేమమాలిని:  హేమమాలిని ఇటీవల తన ‘ఛల్ మన్ బృందావన్’ అనే కాఫీ టేబుల్ బుక్ […]

Share:

ఒకప్పుడు హేమమాలిని సినిమాలు చూసేందుకు ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తూ ఉండేవారు. ఇప్పుడు హేమమాలిని కూతుర్లు, తమ దైనశైలిలో సినిమాలలో నటిస్తూ మళ్ళీ అలనాటి హేమమాలిని చిత్రాలను గుర్తు చేస్తున్నారు. హేమమాలిని ఇటీవల తమ ఫ్యామిలీ గురించిన విషయాలు బయట మాట్లాడింది. ముఖ్యంగా ప్రజలలో ఉన్న అపోహను దూరం చేసేందుకు ఆమె ఓపెన్ అయినట్లు తెలుస్తోంది. 

ఫ్యామిలీ గురించి మాట్లాడిన హేమమాలిని: 

హేమమాలిని ఇటీవల తన ‘ఛల్ మన్ బృందావన్’ అనే కాఫీ టేబుల్ బుక్ రిలీస్ చేసిన అనంతరం తాను మీడియాతో మాట్లాడుతూ తమ ఫ్యామిలీ గురించి ముఖ్యంగా ఓపెన్ అవ్వడం జరిగింది. ప్రత్యేకించి, తమ ఫ్యామిలీ విడిపోయినట్లు చాలామంది అభిమానులు అపోహ పడుతున్నట్లు తాను గ్రహించానని అందుకే తాను ముఖ్యంగా ఫ్యామిలీ విషయం గురించి స్పష్టం చేయాలి అనుకున్నట్లు తెలిపారు హేమమాలిని. హేమమాలిని ధర్మేంద్ర దంపతుల గురించి సినీ ఇండస్ట్రీలో చెప్పాల్సిన అవసరం లేదు. సుమారు 43 సంవత్సరాలుగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని సాగిస్తున్నారు. అయితే ఇటీవల ధర్మేంద్ర తన మొదటి భార్యా పిల్లలతో ఉంటున్న విషయాలను గురించి హేమమాలిని మాట్లాడింది. 

తాము ఎక్కడ ఉన్నప్పటికీ కలిసికట్టుగా తమ ఫ్యామిలీ ఎప్పటికీ ఉంటుందని, మేము విడిపోలేదు అంటూ, తమ సొంత ఫ్యామిలీ గురించి అభిమానులు మరో ఉద్దేశం పెట్టుకోకూడదు అంటూ మాట్లాడారు. అంతేకాకుండా ఇటీవల జూన్ 18న, ధర్మేంద్ర మనవడైనా,కరణ్ డియోల్, సన్నీ డియోల్ కుమారుడు వివాహ వేడుకకు, తమ కుటుంబ సభ్యులు, అంటే హేమమాలిన ఇద్దరు కూతుర్లు ఇషా డియోల్ అలాగే అహనా డియోల్ కనిపించకపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయని, అందువల్లే తాము వివాహ వేడుకలో పాలుపంచుకోలేకపోయామని చెప్పుకొచ్చింది హేమమాలిని. 

ఎందుకు కలిసి ఉండటం లేదు?: 

ధర్మేంద్ర-హేమమాలిని ఎందుకు ఒకే చోట కలిసి ఉండట్లేదు అని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ, కొన్ని కొన్ని సందర్భాలను మనం యాక్సెప్ట్ చేయాలని, కొన్ని కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటూ సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి సాదా జీవితం గడపాలని ఆశ ఉంటుందని, అది కుదరనప్పుడు కొన్ని సందర్భాలలో సర్దుకుపోవడం మంచిది అంటూ మాట్లాడారు. ప్రతి ఒక్క పెళ్లయిన మహిళకు, భర్త, పిల్లలు సాధారణ జీవితం ఉండాలని ఎవరికి ఉండదు అంటూ.. కానీ కొన్ని అలా జరిగిపోతాయి అంటూ, యాక్సెప్ట్ చేయక తప్పదు మాట్లాడారు హేమమాలిని. 

ముఖ్యంగా తనకి జరిగిన సంఘటన గురించి తను బాధపడటం లేదని, ఇంకా చెప్పాలంటే తనకి ఇద్దరు కూతుర్లు దేవుడు ప్రసాదించాడని, వారే తన ఆనందం అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా వారిని పెంచి పెద్ద చేయడంలో తనకి ఎంతో సంతోషం లభించిందని వెల్లడించింది. ముఖ్యంగా వారిని పెంచి పెద్ద చేయడంలో ధర్మేంద్ర ఎప్పటికీ తోడుగా ఉన్నాడని, తను ఎప్పుడూ కూడా కుటుంబ బాధ్యతను తీసుకోవడంలో వెనకాడలేదు అంటూ తన భర్త గురించి చెప్పుకొచ్చారు హేమమాలిని. అంతేకాకుండా తన భర్త ధర్మేంద్ర తన ఇద్దరు కూతుర్ల పెళ్లి విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడిని, వారిద్దరికీ త్వరగా పెళ్లి చేయాలని తన ఎక్కువ ఆశపడుతూ ఉండేవాడని, ధర్మేంద్ర గురించి మాట్లాడింది. అయితే తను ఎప్పుడు కూడా ధర్మేంద్రకి ధైర్యం చెప్పే దాన్ని అంటూ, సరైన వారు దొరికితే తమ కూతుర్ల పెళ్లిళ్లు జరపచ్చు అంటూ తను సర్ది చెప్పే దాన్ని అంటూ, వారిద్దరు తమ భార్యాభర్తల బంధం గురించి మరొకసారి ప్రస్తావించింది హేమామాలిని.