ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్.. అభిమానుల్లో క‌ల‌వ‌రం

హరీష్ శంకర్ భగత్ సింగ్ పోస్ట్ పోన్ కానుందని రూమర్లు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ తన రాజకీయ రంగంలో బిజీ అయిపోవడం. అంతేకాకుండా హరీష్ శంకర్ రవితేజ మరో సినిమాకి గాను దర్శకత్వం వహించడమే అంటున్న అభిమానులు.  ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పోస్ట్ పోన్:  ఇటీవల వరకు, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో బిజీగా […]

Share:

హరీష్ శంకర్ భగత్ సింగ్ పోస్ట్ పోన్ కానుందని రూమర్లు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ తన రాజకీయ రంగంలో బిజీ అయిపోవడం. అంతేకాకుండా హరీష్ శంకర్ రవితేజ మరో సినిమాకి గాను దర్శకత్వం వహించడమే అంటున్న అభిమానులు. 

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పోస్ట్ పోన్: 

ఇటీవల వరకు, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం. 

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ వాయిదా పడింది అనే విషయంపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడనప్పటికీ, పవన్ కళ్యాణ్ తన రాజకీయ కట్టుబాట్లతో బిజీగా ఉన్నారని పుకార్లు, 

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పోస్ట్ పోన్ నిజమే ఏమో అని నిర్ధారణ కూడా కలిగిస్తున్నాయి. తెలుగు మీడియా ప్రకారం, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన వారాహి విజయ యాత్రలో నిమగ్నమై ఉన్నాడు. అంతేకాకుండా AP అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నందున నటుడు రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమా విశేషాలు: 

శ్రీలీల, పూజా హెగ్డే, పంకజ్ త్రిపాఠి, పవన్ కళ్యాణ్, అశుతోష్ రానా, మరియు గౌతమి వంటి పెద్ద పెద్ద సినీ తారలు నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో చాలా అంచనా పెరిగింది. ఈ చిత్రానికి నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్‌లు తమ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో మద్దతునిస్తున్నారు. 

రవితేజ సినిమా చిత్రీకరణలో హరీష్ శంకర్!: 

ఇటీవల, పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కించాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పోస్ట్ పోన్ అయినందున, రవితేజ కొత్త చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారని నివేదికలు పేర్కొన్నాయి. ఈ ప్రాజెక్ట్ 2018లో అజయ్ దేవ్‌గిన్ ప్రధాన పాత్రలో రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన రైడ్ చిత్రానికి రీమేక్. ఈ చిత్రం 1980లలో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు జరిపిన ఆదాయపు పన్ను దాడుల నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. రవితేజ ప్రస్తుతం ఈగల్, చాంగురే బంగారు రాజా సినిమాలలో కూడా బిజీ అయ్యారు. 

రవితేజ సినీ కెరీర్: 

ఒకప్పుడు సైడ్ పాత్రలు వేస్తూ రవితేజ అంచలంచలుగా ఎదిగి ఇవాళ్ళ హీరోగా మారాడు. రవితేజ హీరోగా మారడానికి చాలా కష్టపడ్డాడు. అవకాశం వచ్చిన ప్రతి సినిమాలో నటించాడు. అల్లరి ప్రియుడు సినిమాలో రాజశేఖర్ కి ఫ్రెండ్ గా నటించాడు. సముద్రం సినిమాలో జగపతిబాబుకు విలన్ గా నటించాడు. బడ్జెట్ పద్మనాభం లో హీరోయిన్ బ్రదర్ గా నటించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే ఉంటాయి. ఇలా అవకాశం వచ్చిన ప్రతి సినిమాలో నటిస్తూ ఒక మంచి యాక్టర్ అనిపించుకున్నాడు. తర్వాత తన ఫ్రెండ్ శ్రీనువైట్ల డైరెక్షన్లో నీకోసం అనే సినిమాతో హీరోగా మారాడు. తర్వాత తన మరొక ఫ్రెండ్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ సినిమాలు నటించాడు. ఈ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలే. ఇడియట్ అయితే రవితేజ కెరీర్నే మార్చేసింది. 

రవితేజ కెరీర్ ఇడియట్ కి ముందు ఇడియట్ తర్వాత అన్న విధంగా మారింది. ఆ తర్వాత కూడా రవితేజతో పూరి జగన్నాథ్ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి అనే సినిమా తీసి మంచి హిట్ ఇచ్చాడు. రవితేజని హీరోగా నిలబెట్టింది పూరి జగన్నాథ్ అంటే అతిశయోక్తి కాదు. రవితేజ పూరి జగన్నాథ్ కాంబినేషన్ మళ్లీ రావాలని కోరుకుందాం. రవితేజ ఇప్పుడు పెద్ద స్టార్. తనకు లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో తను నటించిన ధమాకా బ్లాక్ బస్టర్. ఆ తర్వాత డిఫరెంట్ గా ట్రై చేసిన రావణాసుర ఫ్లాప్ అయింది. కానీ రావణాసుర సినిమా చాలా బాగుంటుంది. ఇప్పుడు తను నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ రెడీగా ఉంది. ఈ సినిమా పాన్ ఇండియన్ లెవెల్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి రవితేజని మరో పాన్ ఇండియన్ స్టార్ని చేయాలని మనం కోరుకుందాం.