అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయిన వెంటనే దుమ్ము లేపుతున్న హనుమాన్

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ హనుమాన్ (Hanuman).

Courtesy: x

Share:

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ హనుమాన్ (Hanuman). యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. చిన్న సినిమాగా అనౌన్స్ అయ్యి పాన్ ఇండియా బజ్ జనరేట్ చేస్తున్న హనుమాన్ సినిమాపై అభిమానుల్లో రేంజ్ రోజు రోజుకీ అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. 

ఇటీవల హనుమాన్ మూవీ క్రియేట్ చేసిన హైప్, ఈ మధ్య కాలంలో ఏ చిన్న సినిమా క్రియేట్ చేయలేదు. టీజర్, ట్రైలర్ లాంటి ప్రమోషనల్ కంటెంట్ హనుమాన్ సినిమాని ఆకాశానికి ఎత్తాయి. ఈ స్థాయిని తెలుపుతూ హనుమాన్ సినిమా ప్రీమియర్స్ చాలా సెంటర్స్ లో సోల్డ్ అవుట్ అయ్యాయి. ఈ సినిమా రిలీజ్ విషయంలో హనుమాన్ ఫ్యాన్స్కు మేకర్స్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. జనవరి 12న గుంటూరు కారం సినిమా వస్తుండడంతో హనుమాన్ చిత్ర యూనిట్ మొదటిరోజు పెద్దగా థియేటర్స్ దొరికే అవకాశం లేదు కాబట్టి ఒక రోజు ముందే ప్రీమియర్స్ వేయడానికి రెడీ అయ్యారు. జనవరి 11 నుంచి అంటే మరో 48 గంటల్లో కొన్ని సెలెక్టెడ్ సెంటర్స్ లో హనుమాన్ సినిమా పైడ్ ప్రీమియర్స్ పడుతున్నాయి. జనవరి 11న సాయంత్రం 6 గంటల నుంచి సినిమా స్పెషల్ షోస్ పడనున్నాయి. ఇప్పటికే ప్రీమియర్ షో టికెట్లను రిలీజ్ చేసింది.

ఈ ప్రీమియర్స్ కి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే… హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. హనుమాన్ సినిమాకి పబ్లిక్ లో ఎంత క్రేజ్ ఉందో చూపిస్తూ కేవలం క్షణాల్లో టికెట్స్ బుక్ అవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయం. మరీ ముఖ్యంగా నైజాం సెంటర్స్ లో హనుమాన్ సినిమా టికెట్స్ జెట్ స్పీడ్ లో కంప్లీట్ అయ్యాయి. ఈ మేరకు నైజాం డిస్ట్రిబ్యూటర్ మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. దీంతో హనుమాన్ మూవీని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ప్రీమియర్స్ కోసం షోస్ పెంచే పనిలో ఉన్నారు. ప్రీమియర్స్ నుంచి టాక్ పాజిటివ్ గా బయటకి వస్తే చాలు హనుమాన్ సినిమా సంక్రాంతి చిత్రాల్లో మొదటి హిట్ సినిమాగా నిలుస్తుంది. ఇక ఫ్యాన్స్ ఉద్దేశ్యం మేరకు మరిన్నీ స్క్రీన్స్ యాడ్ చేస్తున్నట్లు మరో ట్వీట్ చేస్తూ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది.