గుంటూరు కారం మూవీలో మరో మార్పు

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు-స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న తాజా మూవీ గుంటూరు కారం. ఈ మూవీని ప్రకటించిన దగ్గరి నుంచి అనేక మార్పులను ఎదుర్కొంటోంది. ఈ మూవీలో జరుగుతున్న మార్పులపై ప్రిన్స్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ప్రిన్స్, త్రివిక్రమ్ కాంబోలో మూవీ వస్తుండడంతో ఫ్యాన్స్ లో ఒక రకమైన హైప్ నెలకొంది. దీంతో ఫ్యాన్స్ ఈ  మూవీ అప్టేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అటువంటి తరుణంలో […]

Share:

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు-స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న తాజా మూవీ గుంటూరు కారం. ఈ మూవీని ప్రకటించిన దగ్గరి నుంచి అనేక మార్పులను ఎదుర్కొంటోంది. ఈ మూవీలో జరుగుతున్న మార్పులపై ప్రిన్స్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ప్రిన్స్, త్రివిక్రమ్ కాంబోలో మూవీ వస్తుండడంతో ఫ్యాన్స్ లో ఒక రకమైన హైప్ నెలకొంది. దీంతో ఫ్యాన్స్ ఈ  మూవీ అప్టేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అటువంటి తరుణంలో మూవీ నుంచి వస్తున్న వార్తలు వింటూ మహేశ్ అభిమానులు తెగ వర్రీ అవుతున్నారు. 

అప్పుడు పూజా.. ఇప్పుడు ఫైట్ మాస్టర్స్

ఈ మూవీ ప్రకటించిన వద్ద నుంచే అనేక రూమర్లు కొనసాగుతున్నాయి. మొదట ఈ మూవీలో బుట్టబొమ్మ పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తోందని మేకర్స్ ప్రకటించారు. అయితే తర్వాత ఏమైందో తెలియదు కానీ కొద్ది రోజుల తర్వాత బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ మూవీ నుంచి తప్పుకుంది. కారణం ఏంటో తెలియదు కానీ అమ్మడు మాత్రం ఈ మూవీ నుంచి తప్పుకుంది. కేవలం హీరోయిన్ మాత్రమే కాకుండా అనేక మంది క్రూ ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నారని తెలుస్తోంది. కారణాలు ఏంటో సరిగ్గా తెలియకపోయినా కానీ ఈ మూవీని అందరూ వదిలి వెళ్లిపోతున్నారు. 

సెకండ్ హీరోయినే ఇప్పుడు ఫస్ట్ 

మొదట ఈ మూవీని అనౌన్స్ చేసినపుడు మొదటి హీరోయిన్ గా పూజా హెగ్డేను మరియు సెకండ్ హీరోయిన్ గా శ్రీ లీలను ఎంపిక చేశారు. కానీ ఆ తర్వాత ఏవో కారణాల వల్ల పూజా హెగ్డే తప్పుకున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ వార్తను విన్న ప్రిన్స్ ఫ్యాన్స్ ఇదంతా రూమరే అని కొట్టిపారేశారు. కానీ తర్వాత మేకర్స్ ఈ వార్తను కన్ఫామ్ చేయడంతో అంతా ఊసురుమన్నారు. ఇక సెకండ్ హీరోయిన్ అయిన శ్రీ లీల పూజా హెగ్డే ప్లేస్ లో ఫస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ భర్తీ చేయనుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. 

సెకండ్  హీరోయిన్ గా మీనాక్షి 

ఇక మేకర్స్ మరో ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరిని సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఈ వార్తతో మహేశ్ అభిమానులు కొంత కుదుటపడ్డారు. ఇక మొన్న శ్రీలీల జన్మదినం సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా మహేశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మహేశ్ బాబు  మాస్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ మహేశ్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టింది. దీంతో మహేశ్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. 

ఇప్పుడు ఫైట్ మాస్టర్ల వంతు??

ఇక ఇప్పుడుఈ మూవీ నుంచి ఫైట్ మాస్టర్లయిన రామ్-లక్ష్మణ్ కూడా తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్-లక్ష్మణ్ కంటే ముందుగానే హిట్ మూవీ kgf ఫైట్ మాస్టర్లను ఈ మూవీ కోసం సెలెక్ట్ చేశారు. వారు మూవీ మొదటి షెడ్యూల్ లో కూడా పాల్గొన్నారు కానీ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ మూవీ నుంచి వారిని తప్పించారు. ఇక వారి స్థానంలో రామ్-లక్ష్మన్ మాస్టర్ వచ్చి చేరారు. ఇక ఇప్పుడు వీరు కూడా తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి మేకర్స్ ఎవరిని ఈ రోల్ కోసం కన్ఫామ్ చేస్తారో వేచి చూడాలి. 

మొదటి నుంచి మార్పుల గొడవే.. 

దాదాపు దశాబ్ద కాలం తర్వాత మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో మూవీ వస్తుందని ఆశపడిన ప్రిన్స్ ఫ్యాన్స్ కు షాక్ లు తగులుతూనే ఉన్నాయి. మూవీ ఫస్ట్ గ్లింప్స్ మహేశ్ లుక్స్ యమ మాస్ గా ఉన్నాయని ఆనందపడే లోపే మూవీ నుంచి వారు తప్పుకున్నారు. వీరు తప్పుకున్నారు అనే వార్తలు వినవస్తున్నాయి. ఈ వార్తలతో మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ టెన్షన్ లో ఉన్నారు. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి. అప్పట్లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా ఈ మూవీ నుంచి తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలను కొట్టిపారేస్తూ అటువంటిదేం లేదని థమన్ క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఈ వార్తలకు కాస్త పుల్ స్టాప్ పడింది. థమన్ వార్తలకు పుల్ స్టాప్ పడినా కానీ మిగతా టెక్నీషియన్ల విషయంలో అయితే అటువంటి వార్తలే వస్తున్నాయి.