త్రివిక్ర‌మ్‌పై కోపంగా ఉన్న గుణశేఖర్

గుణశేఖర్…. దర్శకుడు త్రివిక్రమ్‌పై చిరాకు పడడానికి మరిన్ని కారణాలు ఉన్నట్లు కనిపిస్తోంది.త్రివిక్రమ్ ‘నువ్వే నువ్వే ‘ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసినప్పుడు గుణశేఖర్ ‘చూడాలని ఉంది’ మరియు ‘ఒక్కడు’ వంటి హిట్లు అందుకొని ఉన్నారు. ఆ సమయం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన అతడు మూవీ లో  నటించేందుకు మహేష్ బాబు ని ఒపించారు గుణశేఖర్ అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ ని కొన్ని నెలలు వేచి ఉండమని కోరారు ఈ లోపు కమిట్‌మెంట్‌లను పూర్తి చేయవలసి […]

Share:

గుణశేఖర్…. దర్శకుడు త్రివిక్రమ్‌పై చిరాకు పడడానికి మరిన్ని కారణాలు ఉన్నట్లు కనిపిస్తోంది.త్రివిక్రమ్ ‘నువ్వే నువ్వే ‘ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసినప్పుడు గుణశేఖర్ ‘చూడాలని ఉంది’ మరియు ‘ఒక్కడు’ వంటి హిట్లు అందుకొని ఉన్నారు. ఆ సమయం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన అతడు మూవీ లో  నటించేందుకు మహేష్ బాబు ని ఒపించారు గుణశేఖర్ అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ ని కొన్ని నెలలు వేచి ఉండమని కోరారు ఈ లోపు కమిట్‌మెంట్‌లను పూర్తి చేయవలసి ఉంది కానీ త్రివిక్రమ్ ఆ సమయం లో చిన్న బడ్జెట్ తో ‘నువ్వే నువ్వే’ మూవీ తీసి హిట్ అందుకున్నారు .

అయితే మహేష్ బాబు  కోసం ఎదురు చూడకుండా’ అతడు’ లాంటి పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు చిన్న బడ్జెట్ మూవీ  ఆయన దర్శకులు నిర్మాత స్రవంతి రవి కిషోర్ తో నువ్వే నువ్వే చేసినందుకు కాస్త చిరాకు పది కొన్ని నెలలు ఆయనను కలవలేదు అని కొన్ని వర్గాలు చెప్ప్తున్నాయి.

ఆ రోజుల్లో పద్మాలయా స్టూడియోస్‌కి తరచుగా వెళ్లే  గుణశేఖర్, మహేష్ మరియు త్రివిక్రమ్ మధ్య గొడవ గురించి తెలుసుకున్నారు . “మహేష్‌తో జరిగిన ఒక సమావేశంలో, కథ ఆసక్తికరంగా ఉందని  త్రివిక్రమ్‌తో ప్రాజెక్ట్ గురించి ఆలోచించమని గుణ  పర్సనల్గ మహేష్‌తో చెప్పారు మరియు త్రివిక్రమ్ మంచి సినిమాని అందిస్తాడని అతనిని ఒప్పించారట గుణ శేఖర్. 

అయితే ఇప్పుడు త్రివిక్రమ్ ఏకై వచ్చి మేకై కుర్చున్నారట .త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందిస్తున్నారని, తాను హిరణ్య కశ్యప సినిమాలో నటించనున్నట్లు అమెరికాలో కామిక్ కాన్ ఫిలిం ఫెస్టివల్లో భాగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే  దీంతో అందరి చూపూ గుణశేఖర్ వైపు మళ్లింది. ‘హిరణ్య కశ్యప’ అనే సినిమాను ముందు అనౌన్స్ చేసింది గుణశేఖర్.‘రుద్రమదేవి’ తర్వాత ఆయన చేయాలనుకున్న ప్రాజెక్టు కూడా ఇదే. ఆ సినిమాలో ముఖ్య పాత్ర చేసిన రానా దగ్గుబాటినే లీడ్ రోల్‌లోకి తీసుకోవాలనుకున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్లో ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చింది. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా గుణశేఖర్ ఈ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేశాడు. వేరే దర్శకుడితో సినిమా చేయనున్నట్లు గత ఏడాది ఆఖర్లో నిర్మాత సురేష్ బాబు ప్రకటించారు.

 ఇప్పుడు రానా ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేయగానే.. గుణశేఖర్ వేసిన ట్వీట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. దేవుడి మీద సినిమాలు తీయడం ఓకే కానీ.. మనం అనైతికంగా ఏదైనా చేస్తే దేవుడు చూస్తూ ఉంటాడని మరిచిపోవద్దు అంటూ గుణశేఖర్ ఒక ట్వీట్ వేశారు. తనను పక్కన పెట్టి ‘హిరణ్యకశ్యప’ను చేయబోతుండటం మీదే ఈ ట్వీట్ అని అందరూ భావిస్తున్నారు. కాగా గతంలో ఒక ఇంటర్వ్యూలో గుణశేఖర్ మాట్లాడుతూ.. ‘హిరణ్య కశ్యప’కు శ్రీకారం చుట్టిందే తను అనే విషయం చెబుతూ.. దాని కోంస తానెంత కష్టపడింది కూడా వివరించారు.

త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టులోకి రావడం గురించి మాట్లాడుతూ.. తాను నిజానికి సాయిమాధవ్ బుర్రాను డైలాగ్ రైటర్‌గా తీసుకున్నానని.. కానీ త్రివిక్రమ్ తనకు తానుగా ఈ చిత్రానికి మాటలు రాస్తానని ముందుకు వచ్చాడని.. ఐతే బ్రహ్మాండం కదా అనుకున్నానని.. కానీ తర్వాత ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయని గుణ అన్నారు. ఆయన మాటల్ని బట్టి చూస్తుంటే.. త్రివిక్రమ్ మాటల రచయితగా ఈ ప్రాజెక్టులోకి ప్రవేశించి.. మొత్తం స్క్రిప్టు మీద కంట్రోల్ తెచ్చుకున్నారని.. ఈ క్రమంలోనే వెర్షన్ మారిపోయి గుణశేఖర్ ప్రాజెక్టు నుంచే తప్పుకున్నాడని అర్థమవుతోంది.