చిరంజీవి భోళా శంకర్ నుండి లేటెస్ట్ అప్ డేట్

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఓ లెక్క.. అందరూ చిరంజీవి పాటలను రీమిక్స్ చేశారు. త్వరలో తన పాటను తానే చిరంజీవి రీమిక్స్ చేయబోతున్నారు. అవును.. భోళా శంకర్ సినిమా విషయంలోనూ అదే జరగబోతోందని తెలుస్తోంది.  ఇప్పటి వరకు మెగా హీరోలందరూ తమ సినిమాలకు చిరంజీవి సూపర్ హిట్ పాటలను రీమిక్స్ చేశారు. మెగా హీరోలే కాదు అల్లరి నరేష్, శివాజీ లాంటి బయటి హీరోలు కూడా చిరంజీవి పాటలను రీమిక్స్ చేశారు. మగధీరలో బంగారు కోడిపెట్ట […]

Share:

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఓ లెక్క.. అందరూ చిరంజీవి పాటలను రీమిక్స్ చేశారు. త్వరలో తన పాటను తానే చిరంజీవి రీమిక్స్ చేయబోతున్నారు. అవును.. భోళా శంకర్ సినిమా విషయంలోనూ అదే జరగబోతోందని తెలుస్తోంది. 

ఇప్పటి వరకు మెగా హీరోలందరూ తమ సినిమాలకు చిరంజీవి సూపర్ హిట్ పాటలను రీమిక్స్ చేశారు. మెగా హీరోలే కాదు అల్లరి నరేష్, శివాజీ లాంటి బయటి హీరోలు కూడా చిరంజీవి పాటలను రీమిక్స్ చేశారు. మగధీరలో బంగారు కోడిపెట్ట అంటూ రామ్ చరణ్ చేసిన డ్యాన్సులు సినిమాను వేరే లెవల్‌‌కి తీసుకెళ్లాయి. సినిమా విజయంలో బంగారు కోడిపెట్ట సాంగ్ పాత్ర ఉందనడంలో సందేహం లేదు. అంతేకాదు మగధీరతో చిరంజీవి గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత వానావానా వెల్లువాయే అంటూ రచ్చ సినిమాలో తమన్నాతో కలిసి రామ్ చరణ్ చేసిన రొమాన్స్‌ అంతాఇంతా కాదు.

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా మేనమామ చిరంజీవి పాటలను తన సినిమాల్లో చాలానే రీమిక్స్ చేశాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలో ఖైదీ నెం. 786 లోని సాంగ్, ఇంటిలిజెంట్ సినిమాలో లావణ్య త్రిపాఠితో కలిసి చమకు చమకు సాంగ్, ఇద్దరు అమ్మాయిలు సినిమాలో గ్యాంగ్ లీడర్ పాటకు అల్లు అర్జున్ స్టెప్పులు వేశారు. మెగా ఫ్యామిలీలో అందరూ చిరంజీవి పాటలను వాడుకున్నారు. అల్లు శిరీష్ కొత్త జంటలో కూడా ఓ సాంగ్ రీమిక్స్ చేశాడు. ఇలా చిన్న చిన్న పాటలను రీమిక్స్ చేయడం మాములు విషయం కాదు. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఓ లెక్క. అందరూ చిరంజీవి పాటలను రీమిక్స్ చేశారు. త్వరలో తన పాటను తానే చిరంజీవి రీమిక్స్ చేయబోతున్నారు. అవును.. భోళా శంకర్ సినిమా విషయంలోనూ అదే జరగబోతోందని తెలుస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌‌లో జరుగుతుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కోల్‌కతా సెట్‌ను నిర్మించారు. ఇందులో మెహర్ ఓ ప్రధాన భాగాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఆల్ టైమ్ క్లాసిక్ సాంగ్ రామ్మ చిలకమ్మా పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఇక చూడాలని ఉంది చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా ఇప్పుడు ఆయన తనయుడు మహతి స్వర సాగర్ భోళా శంకర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

భోళా శంకర్‌‌లో కూడా కోల్‌కతా బ్యాక్ డ్రాప్ ఉండనున్నట్లు తెలుస్తోంది. చూడాలని ఉందిలో కోల్ కతా బ్యాక్‌డ్రాప్ గురించి మనకు తెలిసిందే. అందుకే రామ్మ చిలకమ్మ పాటను రీమిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పాటలో చిరంజీవి తన సొగసైన స్టెప్పులతో మళ్లీ పాత మెగాస్టార్‌ని గుర్తుకు తెస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే భోళా శంకర్‌పై అంచనాలు పెరగడం ఖాయం. వేసవి తర్వాత సినిమా విడుదల కానుంది. హీరోయిన్ కీర్తి సురేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్‌‌గా తమన్నా నటిస్తోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, కేఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే పూనకాలు తెప్పించిన వాల్తేరు వీరయ్య హిట్​తో మెగా అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక ఈ వార్త కూడా దావానంలా వ్యాప్తి చెందడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇంత వయసొచ్చినా కానీ టాలీవుడ్​లో డ్యాన్స్ విషయంలో మెగాస్టార్​ను బీట్ చేసే స్టార్ ఇప్పటికీ రాలేదనే విషయం అందరికీ తెలిసిందే.