బేబీ మూవీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్

SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వం వహించిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ బేబీ. ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా జూలై 14న విడుదలయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ మూవీ సక్సెస్ సెలబ్రెషన్స్ గ్రాండ్ గా నిర్వహించింది చిత్రయూనిట్. ఇక ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయ్యి 25 రోజులు పూర్తి చేసుకోవడంతో సినిమా అభిమానులకు.. ప్రేక్షకులకు మరో క్రేజీ […]

Share:

SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వం వహించిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ బేబీ. ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా జూలై 14న విడుదలయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇప్పటికే ఈ మూవీ సక్సెస్ సెలబ్రెషన్స్ గ్రాండ్ గా నిర్వహించింది చిత్రయూనిట్. ఇక ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయ్యి 25 రోజులు పూర్తి చేసుకోవడంతో సినిమా అభిమానులకు.. ప్రేక్షకులకు మరో క్రేజీ న్యూస్ అందించింది చిత్రయూనిట్. సినిమాలో ఎడిటింగ్ లో తీసేసిన మరిన్ని సన్నివేశాలు… ఒక సాంగ్ యాడ్ చేసి మరోసారి థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.

ముఖ్యంగా యూత్ లో ఈ సినిమాకి భారీ క్రేజ్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుత జనరేషన్ లో జరుగుతున్న ప్రేమకథలను ఇన్స్పిరింగ్ గా తీసుకోని తెరకెక్కించిన ఈ మూవీ యూత్ లోని ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయ్యింది.

ఇక ఈ మూవీలో నటించిన ఆనంద్ అండ్ వైష్ణవి కూడా తమ పాత్రల్లో జీవించేసి.. ఆడియన్స్ కి తమనే స్క్రీన్ పై చూసుకుంటున్న ఫీలింగ్ ని కలిపించారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీస్ కూడా ఈ మూవీకి ఫిదా అయ్యిపోతున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్, రామ్, పూరీజగన్నాధ్.. ఇలా ప్రతి ఒక్కరు చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఈమద్యలో పెద్ద సినిమాలు వచ్చినా గాని ఇప్పటికి థియేటర్స్ లో బేబీ ఇంకా సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. ఈ చిత్రం ఇప్పటివరకు 75 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది.

డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా బేబి. ఇందులో విరాజ్ అశ్విన్ కీలకపాత్రలో నటించారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. జూలై 14న రిలీజ్ అయిన ఈ ప్రేమకథా చిత్రమ్ యూత్‏ను ఆకట్టుకుంటుంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ భారీ విజయం సాధించింది. 

 అలాగే ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. బేబీ చిత్రంలో వైష్ణవి, ఆనంద్, విరాజ్ అశ్విన్ నటనకు ప్రేక్షకులతోపాటు.. సెలబ్రెటీలు ముగ్దులయ్యారు. ఇప్పటికే ఈ మూవీ సక్సెస్ సెలబ్రెషన్స్ గ్రాండ్ గా నిర్వహించింది చిత్రయూనిట్. ఇక ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయ్యి 25 రోజులు పూర్తి చేసుకోవడంతో సినిమా అభిమానులకు.. ప్రేక్షకులకు మరో క్రేజీ న్యూస్ అందించింది చిత్రయూనిట్.

మూవీలో ఎడిటింగ్ లో తీసేసిన సీన్స్ తోపాటు మరోక సాంగ్ ను యాడ్ చేసి మరోసారి థియేటర్లలో రిలీజ్ చేయనున్నాట మేకర్స్.  ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించింది. అలాగే ఇవాళ హైదరాబాద్ సంధ్య థియేటర్లో యాడ్ చేసిన సన్నివేశాలతో సాయంత్రం ఫస్ట్ షో వేసి అనంతరం అన్ని చోట్ల రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. ఈ నిర్ణయంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు ఈ సినిమా రిలీజ్ అయి 25 రోజులు అవుతున్నా.. ఇంకా భారీగా కలెక్షన్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. చిత్రయూనిట్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ టూర్ నిర్వహిస్తుంది. లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను ఎస్కేఎన్ నిర్మించారు. ఇక ఇందులో కథానాయికగా నటించిన వైష్ణవి నటన ప్రేక్షకులను హృదయాలను తాకింది. ఈ మూవీతో తెలుగమ్మాయి హీరోయిన్ గా సక్సెస్ అయ్యిందనే చెప్పుకోవాలి. అందమైన సన్నివేశాలు, అద్భుతమైన నటన, హృదయాన్ని హత్తుకునే బలమైన సంభాషణలు.. మ్యూజిక్.. అన్ని ఈ మూవీకి హైలెట్ అయ్యాయి.

అయితే ఈ సినిమా  ని ఇప్పటికే థియేటర్స్ పలుమార్లు చూసిన ఆడియన్స్.. ఓటీటీకి బేబీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. అదికూడా ఎక్సట్రా ప్యాకేజీతో రాబోతుంది. మూవీ రన్ టైం చాలా ఎక్కువ అవ్వడం వల్ల.. సినిమాలోని చాలా సన్నివేశాలు కట్ చేసేశారు. హీరో – అమ్మ, హీరో – హీరోయిన్ లవ్ ట్రాక్, హీరోయిన్ – బాయ్ ఫ్రెండ్ బోల్డ్ సీన్స్.. ఇలా మరికొన్ని సీన్స్ తో మొత్తం నాలుగు గంటల రన్ టైంతో బేబీ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారట. మరి ఆ కంప్లీట్ ఎమోషన్ రోలర్ కోస్టర్ ని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి.